RRR Vs YSRCP : గెలిపించిన రాయలసీమకు అన్యాయం చేయవద్దు.. ప్రాజెక్టుల్ని పూర్తి చేయాలని జగన్‌కు రఘురామ సూచన
ఏకపక్ష విజయం అందించిన రాయలసీమకు నీటి కష్టాలు తీర్చే విషయంలో జగన్ నిర్లక్ష్యంగా ఉన్నారని రఘురామ అభిప్రాయపడ్డారు.సంక్షేమ కోసం రూ. లక్ష కోట్లు ఖర్చు పెట్టినా ప్రాజెక్టు కోసం కొంత కూడా ఖర్చు చేయలేదన్నారు.
పరుగు పందెంలో ఒక్కరే పాల్గొని ఫస్ట్ ప్రైజ్ వచ్చినట్లుగా తమ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెలబ్రేషన్స్ ఉన్నాయని రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించారు. పలు అంశాలపై ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన ఎన్నికల ఫలితాలపై తాను పెద్దగా మాట్లాడదల్చుకోలేదన్నారు. కానీ ఆచంట ఎమ్మెల్యే, మంత్రిగా ఉన్న రంగనాథరాజు నియోజకవర్గంలో జడ్పిటీసీ, ఎంపీటీసీ స్థానాలు అత్యధికం తెలుగుదేశం - జనసేన గెలుచుకున్నాయని... ఆయన తీరుపై చాలా ఆరోపణలు ఉన్నాయని తాను ముందే చెప్పానన్నారు. చివరికి ఆయన దత్తత తీసుకున్న గ్రామంలోనూ జనసేన గెలిచిందని గుర్తు చేశారు. తన పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న ఆచంట విషయంలో జగన్ ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సి ఉందన్నారు. Also Read : అబద్ధాన్ని నిజం చేసి.. ముఖ్యమంత్రిని దింపేయాలని చూస్తున్నారు
ఇక రాయలసీమ ప్రాజెక్టుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విధానాల కారణంగా ప్రజలకు అన్యాయం జరుగుతోందన్నారు.. రాయలసీమ మొత్తం వైసీపీకే ఓట్లు వేసి గెలిపించారని అయితే అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్ల తర్వాత సీమకు నీళ్లు అందించే అత్యంత కీలకమైన ప్రాజెక్టులన్నీ ఎక్కడవక్కడ నిలిచిపోయాయన్నారు. నోటు కొట్టు - ఓటు పట్టు విధానం ద్వారా ఎన్నిసార్లు ఎన్నికల్లో గెలిచినా ప్రజలకు మంచి చేయకపోతే సీఎంగా ఉండి ఏం ప్రయోజనం అని ఆయన ప్రశ్నించారు. పలు ప్రాజెక్టుల వివరాలను వెల్లడించిన ఆయన పనులేమీ జరగడం లేదన్నారు. రూ. లక్ష కోట్లకుపైగా సంక్షేమం కోసం పంచామని చెబుతున్నారు కానీ ఈ ప్రాక్టులు పూర్తి చేసి ఉంటే పొలాలకు నీరు వచ్చేదన్నారు. Also Read : డ్రగ్స్ కేసుల చుట్టూ తిరుగుతున్న తెలంగాణ రాజకీయాలు ! వైట్ చాలెంజ్‌లో గెలుపెవరిది?
ఇక ఏపీలో విదేశీ నిధులతో చేపట్టిన ప్రాజెక్టులకు సంబంధించి వచ్చిన నిధులను దారి మళ్లించడంపై రఘురామకృష్ణరాజు విమర్శలు గుప్పించారు. ఇలా చేయడం వల్ల ఇక విదేశీ నిధులు వచ్చే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. అలాగే స్టేట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పేరుతో సేకరించిన నిధుల విషయంలో కాగ్ మరోసారి వివరాలు కోరిందని.. గతంలో ఈ అంశంలో రాజ్యాంగ ఉల్లంఘన జరిగిందని చెప్పామన్నారు. Also Read : కేసీఆర్ గుడిని అమ్మేస్తున్న భక్తుడు ! దేవుడు కరుణించలేదా? పూజారి కనికరించ లేదా?
ఇక విజయవాడకు తరలిస్తూంజగా గుజరాత్‌లో పట్టుబడిన డ్రగ్స్ అంశంపైనా రఘురామకృష్ణరాజు స్పందించారు. తొమ్మిది వేల కోట్ల విలువైన డ్రగ్స్ అంటున్నారని.. అది మార్కెట్ కావొచ్చన్నారు. అంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ సరఫరా జరుగుతోందంటే చిన్న విషయం కాదన్నారు. ఈ విషయంపై లోతుగా దర్యాప్తు జరపాల్సి ఉందన్నారు. గుట్కాను బ్యాన్ చేసినా యధావిధిగా అమ్ముతున్నారని అలా కాకుండా డ్రగ్స్ గురించి పూర్తి స్థాయిలో దర్యాప్తు జరగాలన్నారు. Also Read : గుజరాత్ లో రూ.9వేల కోట్ల హెరాయిన్ పట్టివేత.. ఆ ముఠాకు విజయవాడతో సంబంధాలు