X

YSRCP Vs RRR : పోలీసులు పట్టాభిని కొట్టారన్న రఘురామ .. ఆధారాలడిగితే ఇస్తానన్న ఎంపీ !

టీడీపీ నేత పట్టాభిని కస్టడీలో పోలీసులు కొట్టారని ఎంపీ రఘురామకృష్ణరాజు కీలక ఆరోపణలు చేశారు. తన వద్ద ఆధారాలు కూడా ఉన్నాయన్నారు.

FOLLOW US: 

తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ను పోలీసులు కొట్టారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంబీ రఘురామకృష్ణరాజు ఆరోపించారు. ఢిల్లీలో పలు అంశాలపై మీడియాతో మాట్లాడిన ఆయన పట్టాభిని పోలీసులు కొట్టారనడానికి తన వద్ద ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేశారు. కొట్టలేదని విజయసాయిరెడ్డి చెప్పాలని సవాల్ చేశారు. తనకు అందిన సమాచారం  ప్రకారం కోర్టు నుంచి మచిలీపట్నం జైలుకు తీసుకెళ్తున్న సమయంలో పట్టాబిని కొట్టారని అన్నారు. పట్టాభి ఈ విషయాన్ని కోర్టులో కూడా చెప్పారని రఘురామ చెప్పారు. కస్టడీలో ఉన్న ఒక వ్యక్తిపై చేయి చేసుకోవడం తప్పన్నారు. దీనికి సంబంధించి ఆధారాలివ్వాలని పోలీసులు నోటీసులు ఇస్తే ఇచ్చేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. 

Also Read : జూన్ నుంచి అమ్మఒడి.. అదానీకి విశాఖలో 130 ఎకరాలు.. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు !

ఆంధ్రప్రదేశ్‌లో పోలీసులు, వైసీపీ వేర్వేరు కాదని ఆయన అన్నారు. తనకు పోలీసు వ్యవస్థ అంటే గౌరవం ఉందని కానీ కొంత మంది తీరు వల్ల మొత్తం పోలీసు వ్యవస్థ పైనే మరకలు పడుతున్నాయన్నారు. కొందరు చీడపురుగుల వల్ల వ్యవస్థ మొత్తం అపవిత్రం అయిపోయిందని రఘురామ కృష్ణరాజు ఘాటు వ్యాఖ్యాలు చేశారు. వారిని చూసి తాను బాధపడుతున్నట్టుగా చెప్పారు. కొందరు అధికారుల గురించి గతంలో మాట్లాడానని ఇంకా సమయం వచ్చినప్పుడు ఆధారాలన్నీ బయట పెడతానన్నారు. 

Also Read : రాజకీయాల్లోకి వీవీఎస్ లక్ష్మణ్ ! బీజేపీ మైండ్ గేమా ? నిజమా ?

 పోలీసులు అరెస్ట్ చేయడానికి ముందే  రఘురామకృష్ణరాజు అనుభవంతో పోలీసులు తనను కొడతారన్న ముందు జాగ్రత్తతో  పట్టాభిరామ్ ఓ వీడియో కూడా రిలీజ్ చేశారు. తన ఒంటిపై ఎలాంటి గాయాలు లేవని వీడియోలో చూపించారు. ఆ తర్వాత ఆయన ఇంటి తలుపులు బద్దలు కొట్టి పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. నోటీసుల్లో స్పష్టత లేకపోయినా మేజిస్ట్రేట్ రిమాండ్‌కు పంపించారు. దీనిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసి బెయిల్ ఇచ్చింది. బెయిల్ మీద రిలీజయిన సమయంలో ఆయన కుంటుకుంటూ వచ్చారు. అయితే పోలీసులు తనను కొట్టారని కోర్టుకు పట్టాభి చెప్పారో లేదో స్పష్టత లేదు. 

Also Read : జగన్‌తో భేటీకి తాడేపల్లికి వచ్చిన నాగార్జున ! టాలీవుడ్ కోసం కాదు.. వ్యక్తిగతమే ?
 
ప్రెస్‌మీట్‌లో విజయసాయిరెడ్డిపైనా రఘురామకృష్ణరాజు సెటైర్లు వేశారు. టీడీపీ హయాంలో ఎక్కువ గంజాయి పోలీసుల తనిఖీల్లో దొరికిందని విజయసాయిరెడ్డి చెప్పారు. విజయసాయిరెడ్డి చెప్పినదాంట్లో తప్పేం లేదని ఏపీలో పట్టుకోవవడం లేదని బయటి రాష్ట్రాల్లో పట్టుకుంటున్నారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. 

Also Read : అమరావతి రైతుల మహా పాదయాత్ర ! అనుమతిపై టెన్షన్ పెడుతున్న పోలీసులు !

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: ANDHRA PRADESH YSRCP tdp Pattabhi Raghuram Krishnaraja Vijayasaireddy

సంబంధిత కథనాలు

Trivikram Srinivas: త్రివిక్ర‌మ్‌కు, ఏపీ మంత్రి పేర్ని ప్రస్తావించిన ట్వీట్‌కు సంబంధం లేదు

Trivikram Srinivas: త్రివిక్ర‌మ్‌కు, ఏపీ మంత్రి పేర్ని ప్రస్తావించిన ట్వీట్‌కు సంబంధం లేదు

Tirumala: శ్రీవారి సర్వ దర్శనం టిక్కెట్లు విడుదల.. రోజుకు పది వేల చొప్పున కేటాయించిన టీటీడీ 

Tirumala: శ్రీవారి సర్వ దర్శనం టిక్కెట్లు విడుదల.. రోజుకు పది వేల చొప్పున కేటాయించిన టీటీడీ 

Poor States : పేదలు దేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కువ ? ఆశ్చర్యపరిచే నిజాలు వెల్లడించిన నీతిఅయోగ్ !

Poor States :  పేదలు దేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కువ ? ఆశ్చర్యపరిచే నిజాలు వెల్లడించిన నీతిఅయోగ్ !

Breaking News: నారాయణపూర్‌లో నక్సలైట్లు మళ్లీ బీభత్సం.. పోస్టర్ల కలకలం

Breaking News: నారాయణపూర్‌లో నక్సలైట్లు మళ్లీ బీభత్సం.. పోస్టర్ల కలకలం

Crop Damage: నెల్లూరు పంట నష్టం అంచనా 8.5కోట్ల రూపాయలు..

Crop Damage: నెల్లూరు పంట నష్టం అంచనా 8.5కోట్ల రూపాయలు..
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Public Holidays 2022: తెలంగాణలో వచ్చే ఏడాది ప్రభుత్వ సెలవు దినాలు ఇవే.. ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్

Public Holidays 2022: తెలంగాణలో వచ్చే ఏడాది ప్రభుత్వ సెలవు దినాలు ఇవే.. ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్

Silent Killers: ఈ ఆరు వ్యాధులు సైలెంట్‌గా ప్రాణాలు తీసేస్తాయ్... జాగ్రత్త

Silent Killers: ఈ ఆరు వ్యాధులు సైలెంట్‌గా ప్రాణాలు తీసేస్తాయ్... జాగ్రత్త

Monal Gajjar Photos: అందం ఉన్నా... అదృష్టం కలిసిరాని మోనాల్

Monal Gajjar Photos:  అందం ఉన్నా... అదృష్టం కలిసిరాని మోనాల్

Bigg Boss 5 Telugu: 'ఎవరో అలిగారని డైవర్ట్ అవ్వకు'.. షణ్ముఖ్ కి తల్లి సలహా.. తండ్రిని వదల్లేక ఏడ్చేసిన వియా.. 

Bigg Boss 5 Telugu: 'ఎవరో అలిగారని డైవర్ట్ అవ్వకు'.. షణ్ముఖ్ కి తల్లి సలహా.. తండ్రిని వదల్లేక ఏడ్చేసిన వియా..