(Source: ECI/ABP News/ABP Majha)
Shock For Kadiri MLA : గడప గడపకూ వస్తానన్న ఎమ్మెల్యే - పొలిమేరల్లోంచే తరిమేసిన ప్రజలు !
గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో కదిలి ఎమ్మెల్యే సిద్దారెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. ఉళ్లోకి గ్రామస్తులు రానివ్వలేదు.
Shock For Kadiri MLA : గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలకు ప్రజలు చుక్కలు చూపిస్తున్నారు. కదిరి ఎమ్మెల్యే సిద్దారెడ్డి అయితే ప్రజల తిరుగుబాటు నుంచి తప్పించుకోవడానికి సైలెంట్‌గా అక్కడ్నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది. ఈ ఘటన వైరల్‌గా మారింది.
ముఖ్యమంత్రి జగన్ ప్రతి ఇంటికి వెళ్లాలని.. ఎమ్మెల్యేలు, పార్టీ ఇంచార్జులకు దిశానిర్దేశం చేసి గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రారంభించారు. చాలా మంది ఎమ్మెల్యేలు వెళ్లడం లేదని.. నెలా నెలా రివ్యూ పెట్టి వార్నింగ్‌లు ఇస్తున్నారు. దీంతో ఎమ్మెల్యేలు పరిస్థితులు బాగోలేకపోయిన వెళ్లక తప్పడం లేదు. పకడ్బందీగా .. పెద్ద ఎత్తున పోలీసులు..ఇతర సిబ్బంది.. చాలా సార్లు బౌన్సర్లను కూడా పెట్టుకుని గడప గడపకూ వెళ్తున్న కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డికి అనేక చోట్ల నిరసనలు వ్యక్తమయ్యాయి. అయితే బుధవారం మాత్రం ఆయనకు ఇంకా కఠినమైన పరిస్థితి ఎదురయింది.
సత్యసాయి జిల్లా.. కదిరి .. తలుపుల మండలం గొల్లపల్లి తాండ పంచాయతీ లో గడప గడపకూ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే మొదట్లోనే ప్రజలు మీరు మా గ్రామానికి ఎందుకు వచ్చారు అని ప్రశ్నించారు. వారికి సర్ది చెప్పేందుకు ప్రయత్నించారు..అయితే గ్రామస్తులు మాత్రం మీరు మా గ్రామంలోకి రావాల్సిన అవసరమే లేదని.. ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆ గ్రామస్తులు .. ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేయడానికికారణం అభివృద్ధి పనులే.
ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా వారి గ్రామానికి వచ్చిన సిద్ధారెడ్డి .. ఓవర్ హెడ్ ట్యాంక్ కట్టిస్తానని.. వీధి వీధి కుళాయి కనెక్షన్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. కానీ మూడేళ్లయినా పట్టించుకోలేదు. అసలు ఆ గ్రామంలో అనేక విపత్తులు వచ్చినా పట్టించుకోలేదు. వరదలు బీభత్సం సృష్టించి డ్యాం లు కూలి ఊరి లో సగం నీటిన మునిగి అల్లాకల్లోలం అయితే పట్టిచుకోలేదని గ్రామస్తులు ఆగ్రహంతో ఊఆగిపోయారు. ఇచ్చిన హామీలను మరిచిపోయి.. ఓట్లు కోసం వచ్చే నువ్వు ఒక ఎమ్మెల్యే వా అని నిలదీసిన గ్రామస్తులు నిలదీశారు.
గొల్లపల్లి తాండ నుండి మద్దన్నగారిపల్లి మార్గము లో యరాలవంక రోడ్డు దారుణంగా ఉందని.. వర్షాలకు రోడ్డు తెగిపోయిందని తెలిసి కూడా బాగు చేయించలేదని ఎమ్మెల్యేపై మండిపడ్డారు. రోడ్డు మరమత్తులు లేవు నీకు రాజకీయాలు చేయడం చేత కాదా అనినిలదీశారు. నీకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వరు..ఇచ్చినా డిపాజిట్ కూడా రాదు అని గుర్తు పెట్టుకోవాలని హితవు పలికారు.. సమస్యలు తీర్చేందుకు కృషి చేయలేని నాయకుడు మాకు అవసరం లేదని గొల్లపల్లి తాండ పంచాయతీ ప్రజలు హెచ్చరించారు.దీంతో ఎమ్మెల్యే గ్రామంలోకి రాకుండా సమాధానం చెప్పకుండా వెళ్లిపోాయరు.
విదేశాల్లో మండిపోతున్న బొగ్గు ధరలు- జాగ్రత్తగా ఉండాలని అధికారులకు సీఎం జగన్ సూచన