YSRCP Bus Yatra : బస్సుల్లోనే మంత్రులు - యాత్రలో కిందకు దిగేందుకు నిరాసక్తత !
బస్సు యాత్రలో ప్రజలను కలిసేందుకు కిందకు దిగడానికి మంత్రులు ఆసక్తి చూపించడం లేదు. యాత్ర ప్రారంభమైన శ్రీకాకుళం జిల్లాలో ముగ్గురు, నలుగురు మంత్రులు మాత్రమే ప్రజలతో మాట్లాడారు.
YSRCP Bus Yatra : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సామాజిక న్యాయం భేరి బస్ యాత్రను మంత్రులు అంత సీరియస్‌గా తీసుకుంటున్నట్లుగా లేరన్న విమర్శలు మొదట్లోనే ప్రారంభమయ్యాయి. శ్రీకాకుళం జిల్లా నుండి ప్రారంభమైన వైసిపి బస్ యాత్ర ఏడు రోడ్లు కూడలి నుండి బయలుదేరి ఎచ్చెర్ల నియోజకవర్గం లోని చిలకపాలెం జంక్షన్ చేరుకుంది. షెడ్యూల్ ప్రకారం చిలకపాలెం,రణస్థలంలో బస్ యాత్రలో భాగంగా మంత్రులు మాట్లాడవలసి ఉంది. కాని కొందరు మంత్రులు మాత్రమే దిగి ప్రజలతో మాట్లాడారు. మిగతా మంత్రులు ఎవ్వరూ బస్ దిగలేదు.
అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు- సీఎం జగన్, సజ్జల, సవాంగ్ పై చింతమనేని ప్రైవేట్ కేసు
ప్రభుత్వం పథకాలను ప్రజలకు తెలియజేయడం కోసం ఏర్పాటు చేసిన బస్ యాత్రలో మంత్రులు ఎవ్వరూ కూడా బస్ దిగకుండా కొందరు మాత్రమే ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడి తూతూ మంత్రంగా మాట్లాడుతూ లాగించేశారు.. బస్ యాత్ర కోసం వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలు ఎండలో గంటలు తరబడి మంత్రుల కోసం వేచి చూసిన కనీసం అందరూ దిగకపోగా నలుగురు మంత్రులు మాత్రమే సభ వేదిక పై హాజరయ్యారు. జయహో జగనన్న పేరుతో ఏర్పాటు చేసిన బస్సులో మంత్రులు బయలుదేరారు. సీఎం వైఎస్ జగన్ చేస్తున్న సామాజిక న్యాయాన్ని.. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు హయాంలో జరిగిన సామాజిక అన్యాయాన్ని ప్రజలకు చాటిచెప్పడానికే బస్సుయాత్రను నిర్వహిస్తున్నట్లుగా ప్రకటించారు.
29న అనంతపురంలో యాత్ర ముగుస్తుంది. బస్సుయాత్రలో భాగంగా 26న విజయనగరం, 27న రాజమహేంద్రవరంలో, 28న నరసరావుపేటలో, 29న అనంతపురంలో బహిరంగ సభలు నిర్వహిస్తారు. యాత్రలో ఆయా ప్రాంతాల్లోని ప్రజాప్రతినిధులు, నామినేటెడ్ పదవులు పొందిన వారు పాల్గొని సీఎం వైఎస్ జగన్ చేస్తున్న సామాజిక న్యాయాన్ని ప్రజలకు వివరించాల్సి ఉంది. రోజుకు ఐదారు చోట్ల మంత్రులు ఆగి సమీకరించిన ప్రజలకు తమ సామాజిక న్యాయాన్ని వివరించాల్సి ఉంది. అయితే అందరూ దిగకపోతూండటంతో వైఎస్ఆర్‌సీపీ శ్రేణుల్లో నిరుత్సాహం కనిపిస్తోంది.
శ్రీకాకుళం నుంచి వైఎస్సార్‌సీపీ బస్సుయాత్ర ప్రారంభం - ఏపీ అభివృద్ధిలో దూసుకెళ్తుందన్న మంత్రులు
తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహిస్తున్న సమయంలోనే మంత్రులు బస్ యాత్ర చేయడం.. ఈ యాత్రను పూర్తి స్థాయిలో విజయవంతం చేయడం ద్వారా మహానాడు కన్నా ఎక్కువ ప్రజాదరణ తమకే ఉందని మంత్రులు నిరూపించాలనుకున్నారు. అయితే అందరూ కిందకు దిగకపోతూండటంతో వైఎస్ఆర్‌సీపీ శ్రేణులు కూడా డీలా పడుతున్నాయి.