Minister Vasamsetty Subhash: 'గత ఐదేళ్లలో ఒక్క టీచర్ పోస్టు కూడా లేదు' - వైసీపీపై మంత్రి వాసంశెట్టి శుభాష్ విమర్శలు, ఉచిత కోచింగ్ ప్రారంభం
Andhra News: కోనసీమ జిల్లాలోని రామచంద్రాపురం వీఎస్ఎం కళాశాలలో ఉచిత టెట్, డీఎస్సీ కోచింగ్ సెంటర్‌ను కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ శుక్రవారం ప్రారంభించారు.
Free TET And DSC Coaching Center In Ramachandrapuram: గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం ఒక్క టీచర్ పోస్ట్ కూడా వేయలేదని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ (Minister Vasamsetty Subhash) విమర్శించారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం (Ramachandrapuram) వీఎస్ఎం కళాశాలలో ఏర్పాటు చేసిన ఉచిత టెట్, డీఎస్సీ కోచింగ్ సెంటర్‌ను ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా దాతల సహకారంతో సమకూర్చిన స్టడీ మెటీరియల్‌ను అభ్యర్థులకు పంపిణీ చేశారు. అన్ని వృత్తుల కంటే ఉపాధ్యాయ వృత్తి ఉన్నతమైనదని.. సీఎం చంద్రబాబు మెగా డీఎస్సీపై తొలి సంతకం చేసి ఉపాధ్యాయుల పట్ల తనకున్న కమిట్మెంట్ నిరూపించుకున్నారని ప్రశంసించారు. ఇక్కడ నిపుణులైన అధ్యాపకులచే శిక్షణ పొంది ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాలు పొందాలని అభ్యర్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో అభ్యర్థులు, అధ్యాపకులు, టీడీపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు.
Also Read: Pawan Kalyan: పవన్ అభిమానులకు షాకింగ్ న్యూస్- సినిమాల్లో కొనసాగడంపై జనసేనాని ట్విస్ట్