Buggana On Jagan London Tour : జగన్ లండన్ వెళ్లింది నిజమే కానీ అసలు కారణం వేరే - బుగ్గన వివరణ !

జగన్ లండన్ పర్యటనకు వెళ్లడానికి కారణాలను మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వివరించారు. ఎయిర్ ట్రాఫిక్ వల్లనే ఆయన లండన్‌లో ఆగాల్సి వచ్చిందన్నారు.

FOLLOW US: 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ( CM Jagan ) లండన్‌లో ల్యాండయిన మాట నిజమేనని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ( BUggana ) ప్రకటించారు. అలా ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో ఆయన వివరించారు. శుక్రవారం గన్నవరం విమానాశ్రయంలో ( Gannavaram Airport )  బయల్దేరిన తర్వాత ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న విమానం ఇంధనం నింపుకోవడం కోసం ఇస్తాంబుల్‌లో ( Istambul ) ఆగిందని బుగ్గన తెలిపారు. అక్కడ ఎయిర్‌ ట్రాఫిక్‌ ( Air Trafic ) విపరీతంగా ఉండడం వల్ల  ఇంధనం నింపుకునే ప్రక్రియలో ఆలస్యం జరిగిందని తెలిపారు.   దీనివల్ల లండన్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నప్పుడు మరింత ఆలస్యం అయ్యిందన్నారు. 

దావోస్ కంటే ముందు జగన్ లండన్ వెళ్లారా? అసలు నిజం ఏమిటి ?

లండన్‌లో ( London ) కూడా ఎయిర్‌ ట్రాఫిక్‌ విపరీతంగా ఉందని... అక్కడ నుంచి బయలు దేరేలోగా సమయం రాత్రి పది గంటలు దాటిపోయిందన్నారు. జ్యూరిచ్‌లో  ( Zurich ) ల్యాండ్‌ అవడానికి ప్రయాణ షెడ్యూల్‌ సమయం రాత్రి 10 గంటలు దాటిపోయిన తర్వాత అనుమతి ఇవ్వరని  స్విట్జర్లాండ్‌లోని భారత ఎంబసీ అధికారులు చెప్పారని బుగ్గన తెలిపారు.  రాత్రి 10 గంటల తర్వాత జ్యూరిచ్‌లో విమానాలు ( Flights ) ల్యాండింగ్‌ను చాలా సంవత్సరాల నుంచి నిషేధించిన విషయాన్ని స్విస్‌ అధికారులు భారత రాయబార కార్యాలయ అధికారులకు తెలిపారన్నారు.  ఈ విషయాలన్నీస్విట్జర్లాండ్‌లోని భారత ఎంబసీ అధికారులు, లండన్‌లోని భారత దౌత్య అధికారులకు సమాచారం అందించారన్నారు. 

ఓట్లు చీలనివ్వకుండా బీజేపీని ఒప్పిస్తా, పొత్తులపై పవన్ క్లారిటీ

వారు నేరుగా ముఖ్యమంత్రితో ( CM ) కూడిన అధికారులతో చర్చించి.. లండన్‌లోనే ( London Stay )  వైఎస్‌ జగన్‌కు బస ఏర్పాట్లు చేశారని బుగ్గన తెలిపారు. అలాగే  తెల్లవారుజామునే జ్యూరిచ్  బయల్దేరేందుకు ముఖ్యమంత్రి బృందం సిద్ధంగా ఉన్నప్పటికీ.. పైలట్లు ( Pilots ) ఓ రోజు అంతా ప్రయాణంలో ఉన్నందున డీజీసీఏ నిబంధనల ప్రకారం పైలెట్లు నిర్ణీత గంటలు విశ్రాంతిని తీసుకోవాల్సి ఉంటుందని బుగ్గన తెలిపారు . అందుకే ఉదయమే బయలుదేరలేదన్నారు. 

విశాఖలో సచివాలయ ఉద్యోగి ఆత్మహత్య - లక్ష్యం IAS, చేసేది వేరే జాబ్ అని జీవితంపై విరక్తితో !

విమాన ప్రయాణాల్లో అంతర్జాతీయ నియమాలు, నిబంధనలు తదితర అంశాలమీద అవగాహన లేకపోవడం, దీనిమీద పనిగట్టుకుని సీఎం జగన్‌ మీద, ఆయన కుటుంబం మీద విషప్రచారం చేస్తున్నారని బుగ్గన విమర్శించారు. దావోస్ పర్యటనపై టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు సంస్కారం లేకుండా ఉన్నాయన్నారు. 

Published at : 21 May 2022 03:42 PM (IST) Tags: cm jagan buggana Davos Tour Jagan in London

సంబంధిత కథనాలు

Tirumala Darshan Tickets: శ్రీవారి భక్తులకు శుభవార్త - ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల చేసిన టీటీడీ

Tirumala Darshan Tickets: శ్రీవారి భక్తులకు శుభవార్త - ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల చేసిన టీటీడీ

Raghurama Krishna Raju: ఎంపీ రఘురామపై హైదరాబాద్‌లో కేసు, ఆయన కుమారుడిపై కూడా

Raghurama Krishna Raju: ఎంపీ రఘురామపై హైదరాబాద్‌లో కేసు, ఆయన కుమారుడిపై కూడా

Breaking News Live Telugu Updates: నిజామాబాద్‌లో ఉగ్రవాదుల లింకులు, ఒకరి అరెస్టు

Breaking News Live Telugu Updates: నిజామాబాద్‌లో ఉగ్రవాదుల లింకులు, ఒకరి అరెస్టు

Vijayawada: అధిక ధరలకు కూల్ డ్రింక్స్, ఫుడ్ ఐటమ్స్ విక్రయాలు - విజిలెన్స్ ఆకస్మిక దాడులతో సీన్ తారుమారు

Vijayawada: అధిక ధరలకు కూల్ డ్రింక్స్, ఫుడ్ ఐటమ్స్ విక్రయాలు - విజిలెన్స్ ఆకస్మిక దాడులతో సీన్ తారుమారు

Gas Cylinder Price Hike: షాకింగ్ న్యూస్! గ్యాస్ సిలిండర్ ధరపై మళ్లీ బాదుడు, ఈ సారి ఎంతంటే

Gas Cylinder Price Hike: షాకింగ్ న్యూస్! గ్యాస్ సిలిండర్ ధరపై మళ్లీ బాదుడు, ఈ సారి ఎంతంటే

టాప్ స్టోరీస్

Nizamabad Terror Links: నిజామాబాద్‌లో ఉగ్ర లింకులు, పోలీసుల అదుపులో ట్రైనర్ - పెద్ద కుట్రకి ప్లాన్!

Nizamabad Terror Links: నిజామాబాద్‌లో ఉగ్ర లింకులు, పోలీసుల అదుపులో ట్రైనర్ - పెద్ద కుట్రకి ప్లాన్!

UK Ministers Resign: యూకే ప్రధాని బోరిస్‌ జాన్సన్‌కు షాక్- ఇద్దరు సీనియర్ మంత్రులు రాజీనామా!

UK Ministers Resign: యూకే ప్రధాని బోరిస్‌ జాన్సన్‌కు షాక్- ఇద్దరు సీనియర్ మంత్రులు రాజీనామా!

MM Keeravani: కీరవాణి తప్పు చేశారా? బూతు ట్వీట్ డిలీట్ చేసినా...

MM Keeravani: కీరవాణి తప్పు చేశారా? బూతు ట్వీట్ డిలీట్ చేసినా...

Hyderabad As Bhagyanagar: హైదరాబాద్ పేరుని బలవంతంగా మార్చారా? అంతకు ముందు భాగ్యనగర్‌గానే పిలుచుకున్నారా?

Hyderabad As Bhagyanagar: హైదరాబాద్ పేరుని బలవంతంగా మార్చారా? అంతకు ముందు భాగ్యనగర్‌గానే పిలుచుకున్నారా?