Pawan Kalyan : ఓట్లు చీలనివ్వకుండా బీజేపీని ఒప్పిస్తా, పొత్తులపై పవన్ క్లారిటీ

Pawan Kalyan : వచ్చే ఎన్నికల్లో ఓట్లు చీలనివ్వకుండా ఉండేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తానని పవన్ కల్యాణ్ స్పష్టంచేశారు. ఇందుకోసం బీజేపీ హైకమాండ్ ను ఒప్పించే ప్రయత్నం చేస్తానన్నారు.

FOLLOW US: 

Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కల్యాణ్ పొత్తులపై మరింత క్లారిటీ ఇచ్చారు. అమరావతిలో మీడియాతో చిట్ చాట్ లో మాట్లాడిన ఆయన... ఎన్నికల్లో ఓట్లు చీలనివ్వకుండా ఉండేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తానన్నారు. రాజధాని విషయంలో బీజేపీ అధినాయకత్వాన్ని ఒప్పించినట్లే, ఓట్ల చీలిక విషయంలోనూ బీజేపీ హైకమాండ్‌ను ఒప్పించే ప్రయత్నం చేస్తానన్నారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఓట్లను చీలనివ్వకూడదనే నిర్ణయం తీసుకున్నామన్నారు. రాజకీయ ప్రయోజనాలకన్నా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమన్నారు. ఎవరితో పొత్తులకు వెళ్లాలో తమకు వైసీపీ చెప్పాల్సిన అవసరం లేదని పవన్ అన్నారు. మంత్రి పదవులను తాము చెప్పిన వాళ్లకు జగన్ ఇస్తారా? అని ప్రశ్నించారు. అలాంటప్పుడు పొత్తులపై వైసీపీ సలహాలు మాకెందుకున్నారు. ఓట్లు చీలనివ్వమన్న చిన్న పదానికి వైసీపీ నేతలు ఎందుకు భయపడుతున్నారు? పవన్ ప్రశ్నించారు. 

వైసీపీ నేతల ఛాలెంజ్ స్వీకరిస్తున్నా

"ఏపీలో ముందస్తు ఎన్నికలపై ఇప్పుడే ఏం చెప్పలేను. రాష్ట్రం బలంగా ఉంటే జనసేన బలంగా ఉన్నట్లే. ఎక్కడ పోటీ చేసినా నన్ను ఓడిస్తామన్న వైసీపీ నేతల ఛాలెంజ్‌ను స్వీకరిస్తున్నా. ఓడలు బండ్లు అవుతాయి. బండ్లు ఓడలవుతాయని నన్ను విమర్శించిన మాజీ మంత్రులకు ఇప్పటికైనా తెలుసుండాలి. నన్ను తిడితే పదవి కలకలకాలం నిలవదని వైసీపీ నేతలు గ్రహించే ఉంటారు. సీపీఎస్‌ విధానానికి చర్చల ద్వారానే పరిష్కారం లభిస్తుంది. లక్షల కోట్లు విదేశాలకు తరలించే తెలివితేటలున్నపుడు సీపీఎస్‌ సమస్యను పరిష్కరించే తెలివి తేటలు ఉండవా?.  ప్రజలకు దగ్గరయ్యే విధంగా నా యాత్ర ఉంటుంది.
ఇప్పటికే అప్పుపుట్టని పరిస్థితిలోకి రాష్ట్రాన్ని తీసుకెళ్లారు. ఏపీ ఆర్థికపరిస్థితిపై కేంద్రానికి పూర్తి అవగాహన ఉంది." అని పవన్ కల్యాణ్ అన్నారు. 

కాపు సామాజిక వర్గాన్ని వైసీపీ లైట్ తీసుకుంది 

ఏపీలో 20 శాతం ఉన్న కాపుల ఓట్లను చాలా తేలిగ్గా చీల్చగలమని వైసీపీ భావిస్తోందని పవన్ అన్నారు. కాపు సామాజిక వర్గం ఓటర్లు తమను రాజకీయంగా ఏం చేయలేరనే భావనలో వైసీపీ ఉందన్నారు. కాపు సామాజిక వర్గాన్ని వైసీపీ చాలా లైటుగా తీసుకుందని, కాబట్టే రిజర్వేషన్లు ఇవ్వలేమని జగన్ చెప్పారన్నారు. బీసీలకు ఈ ప్రభుత్వం ఏం మేలు చేసిందో చెప్పాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. కొన్ని సందర్భాల్లో ఆర్.కృష్ణయ్యను కలిశానన్నారు. విభజన తర్వాత ఆర్.కృష్ణయ్యను ఏపీ బీసీలు ఎలా చూస్తారోననేది వేచి చూడాలన్నారు. విభజన తర్వాత తెలంగాణలో ఆంధ్రా కులాలంటూ కొన్ని కులాలను బీసీ జాబితా నుంచి తప్పించారన్నారు. తెలంగాణలో ఏపీ కులాలని బీసీ జాబితా నుంచి తప్పిస్తున్నప్పుడు ఆర్ కృష్ణయ్య దాన్ని తప్పు పట్టారో లేదో తనకు గుర్తులేదన్నారు. ఏపీ కులాల పేరుతో బీసీ జాబితా నుంచి తొలగించకుండా చూడాలని అప్పట్లోనే తాను కొందరి తెలంగాణ బీసీ నేతలను కోరానన్నారు.

తెలంగాణలో పోటీపై  

తెలంగాణలో పోటీపై పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో 30 స్థానాల్లో పోటీచేసే బలం జనసేనకు ఉందన్నారు. తెలంగాణలో 15 స్థానాల్లో జనసేన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మీడియాతో చిట్ చాట్ జరుగుతోన్న పవర్ కట్ అయింది. ఏపీ అంధకారంలో ఉందనడానికి ఇదే నిదర్శనమన్న పవన్ సెటైర్లు వేశారు. చీకట్లోనే మీడియాతో మాట్లాడారు. 

Published at : 21 May 2022 08:19 AM (IST) Tags: pawan kalyan AP News Amaravati News Political alliance Votes splitting

సంబంధిత కథనాలు

Breaking News Telugu Live Updates: మరికాసేపట్లో తెలంగాణ టెట్ 2022 ఫలితాలు విడుదల

Breaking News Telugu Live Updates: మరికాసేపట్లో తెలంగాణ టెట్ 2022 ఫలితాలు విడుదల

PM Modi Tour: తెలుగు రాష్ట్రాల్లో ప్రధాని టూర్ షెడ్యూల్ ఇదే- భారీ ఏర్పాట్లు చేసిన బీజేపీ

PM Modi Tour: తెలుగు రాష్ట్రాల్లో ప్రధాని టూర్ షెడ్యూల్ ఇదే- భారీ ఏర్పాట్లు చేసిన బీజేపీ

AP Tourism: తొట్లకొండ బౌద్ధ క్షేత్రానికి కొత్త అందాలు- ఆకట్టుకోనున్న సరికొత్త టూరిజం స్పాట్

AP Tourism: తొట్లకొండ బౌద్ధ క్షేత్రానికి కొత్త అందాలు- ఆకట్టుకోనున్న సరికొత్త టూరిజం స్పాట్

Petrol Price Today 1st July 2022: తెలంగాణలో నిలకడగా పెట్రోల్, డీజిల్ రేట్లు - ఏపీలో అక్కడ మండుతున్న ధరలు

Petrol Price Today 1st July 2022: తెలంగాణలో నిలకడగా పెట్రోల్, డీజిల్ రేట్లు - ఏపీలో అక్కడ మండుతున్న ధరలు

Weather Updates: పూర్తిగా విస్తరించిన నైరుతి రుతుపవనాలు, నేడు ఆ జిల్లాల్లో భారీ వర్షాలు - ఎల్లో అలర్ట్ జారీ చేసిన IMD

Weather Updates: పూర్తిగా విస్తరించిన నైరుతి రుతుపవనాలు, నేడు ఆ జిల్లాల్లో భారీ వర్షాలు - ఎల్లో అలర్ట్ జారీ చేసిన IMD

టాప్ స్టోరీస్

Maharashtra News: అసలైన శివసైనికుడు సీఎం అయ్యాడని, ప్రజలు హ్యాపీగా ఉన్నారు-సీఎం షిండే కామెంట్స్

Maharashtra News: అసలైన శివసైనికుడు సీఎం అయ్యాడని, ప్రజలు హ్యాపీగా ఉన్నారు-సీఎం షిండే కామెంట్స్

Anasuya: 'జబర్దస్త్' వదిలేసింది - మూడు సినిమాలు సైన్ చేసింది!

Anasuya: 'జబర్దస్త్' వదిలేసింది - మూడు సినిమాలు సైన్ చేసింది!

TS TET Results 2022: తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్ - నేడు టెట్ 2022 ఫలితాలు విడుదల

TS TET Results 2022: తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్ - నేడు టెట్ 2022 ఫలితాలు విడుదల

Kuppam Vishal : చంద్రబాబుపై పోటీ చేసేది ఆయనే - తేల్చి చెప్పిన పెద్దిరెడ్డి !

Kuppam Vishal : చంద్రబాబుపై పోటీ చేసేది ఆయనే - తేల్చి చెప్పిన పెద్దిరెడ్డి !