By: ABP Desam | Updated at : 13 Jan 2023 10:42 AM (IST)
Edited By: jyothi
నేను సంబరాల రాంబాబునైతే నువ్వు కల్యాణాల పవన్ వి - పీకే అంటే?
Ambati Rambabu on Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. తీవ్ర స్థాయిలో మండిపడుతూ.. ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాను సంబరాల రాంబుబును అయితే నీవు కల్యాణాల పవన్ వి అంటూ ట్వీట్ చేశారు. రోజా డైమండ్ రాణి అయితే నువ్వు బాబు జోకర్ వి అని విమర్శించారు.
నేను సంబరాల రాంబాబునైతే
— Ambati Rambabu (@AmbatiRambabu) January 12, 2023
నువ్వు కల్యాణాల పవన్ వి ! @PawanKalyan
ఇక పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై మంత్రి రోజూ కూడా మండిపడ్డారు. రెండుసార్లు గెలిచిన నేను.. రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కల్యాణ్ తో తిట్టించుకోవాలా అంటూ ట్వీట్ చేశారు. తూ.. ప్రజల కోసం తప్పట్లేదు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
రోజా డైమండ్ రాణి అయితే
— Ambati Rambabu (@AmbatiRambabu) January 12, 2023
నువ్వు బాబు గారి జోకర్ వి ! @PawanKalyan
PK అంటే పిచ్చి కుక్క @PawanKalyan
— Ambati Rambabu (@AmbatiRambabu) January 12, 2023
శ్రీకాకుళం జనాభా కోటిమందా.. వలస వెళ్లింది 45 లక్షలా అంటూ మంత్రి రోజా ఫైర్ అయ్యారు. ఈ ఒక్క మాటతో శ్రీకాకుళం జనం రెండు చేతులు జేబులో పెట్టుకొని అలా వెళ్లిపోయారంటూ ఎద్దేవా చేశారు.
రెండు సార్లు గెలిచిన నేను..
— Roja Selvamani (@RojaSelvamaniRK) January 12, 2023
రెండు చోట్ల ఓడిపోయిన..@PawanKalyan నీతో తిట్టించుకోవాల..? తూ...
ప్రజల కోసం తప్పట్లేదు..!!#PackageStar pic.twitter.com/4yMESHNz8L
జిల్లాలో 45 లక్షల మంది జనాభానే లేరని.. మరి 45 లక్షల మంది వలసలెలా వెళ్తారని ప్రశ్నించారు. టీడీపీ స్క్రిప్టు ఇస్తే మాత్రం కాస్త చెక్ చేసుకోవాలని తెలియదా దత్తపుత్రా అంటూ ట్వీట్ చేశారు.
శ్రీకాకుళం జనాభా కోటి మందా 😁
— Roja Selvamani (@RojaSelvamaniRK) January 12, 2023
వలస వెళ్ళింది 45 లక్షలా🤭ఈ ఒక్క మాటతో శ్రీకాకుళం జనం రెండు చేతులు జేబులో పెట్టుకుని అలా వెళ్లిపోయారు. 45 లక్షలు జనాభానే లేరు 45 లక్షల మంది వలసలా? టీడీపీ స్క్రిప్ట్ ఇస్తే మాత్రం కాస్త చెక్ చేసుకోవాలని తెలియదా @PawanKalyan దత్తపుత్రా😇#PackageStarPK pic.twitter.com/p9HRZ8i6xn
పవన్ కల్యాణ్ ఏమన్నారంటే..?
"ఏడాది కింద ఈ ప్రాంతాలో ఓ ఇంజినీరింగ్ విద్యార్థి అనుమానాస్పదంగా చనిపోతే ఇప్పటి వరకూ పోస్టుమార్టం రిపోర్టు ఇవ్వలేదు. బాధితులు తమ బిడ్డ ఎలా చనిపోయాడో చెప్పండి దోషులకు శిక్షపడేలా చేయండి అని కోరుకుంటున్నారు. మీరు నా పక్షాన నిలబడితే దోషులకు శిక్ష పడేలా నేను చేస్తాను. చనిపోయిన విద్యార్థి తల్లి మంత్రి దగ్గరకు వెళ్లి న్యాయం చేయాలని అడిగితే ఎటకారంగా ఏంటమ్మా నేనేమైనా నీకు బాకీ ఉన్నావా అని మాట్లాడారంట. ఏంచేయాలి వీళ్లను ఇంకోసారి గెలిపిస్తారా? సరైన రాజు లేకపోతే సగం రాజ్యం నాశనం అవుతుంది. సలహాలిచ్చేవాడు సజ్జల అయితే పూర్తిగా నాశనం అవుతుంది. ప్రజాస్వామ్యం అంటే ప్రజల సొంత ఇది వైసీపీ సొంతం కాదు. మనం ఇప్పటికైనా మేల్కొకపోతే, జనసేనకు అండగా ఉండకపోతే మీ జీవితాలు ఇలానే ఉండిపోతాయి. మీ కోసం నేను ప్రాణత్యాగానికైనా సిద్ధం. మీ నాన్ననే ఎదుర్కున్నానయ్యా నువ్వెంత, మూడుముక్కల సీఎం. పంచలూడదీసి కొడ్తా అని చెప్పా. నేను ఎవరికీ బయపడాను. సంబరాల రాంబాబు, అటిన్ రోజాలు కూడా విమర్శలు చేస్తున్నారు. అన్ని కులాలూ బాగుంటాలనేదే నా లక్ష్యం. ఖైదీ నెంబర్ 6093 నా గురించి మాట్లాడితే ఎట్లా? డీజీపీ ఒక ఖైదీకి సెల్యూట్ చేస్తున్నారు. " - పవన్ కల్యాణ్
Peddagattu Jatara 2023 Effect: హైదరాబాద్ - విజయవాడ హైవేపై ఈ నెల 9 వరకు ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపులు ఇలా
Breaking News Telugu Live Updates: ఎమ్మెల్యే కోటంరెడ్డికి భద్రత తగ్గించిన ఏపీ సర్కార్
Buggana Rajendranath: మూడేళ్లలో జగన్ ప్రభుత్వం చేసిన అప్పులు రూ.1.34 లక్షల కోట్లు: మంత్రి బుగ్గన
Kotamreddy Security: కోటంరెడ్డికి ఏపీ సర్కార్ షాక్, సెక్యూరిటీ సగానికి తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ
సెలవుపై వెళ్లిన దుర్గగుడి ఈవో - పోస్టింగ్ కోసం వైసీపీ నేతల మధ్య వార్ !
Hero Naveen Reddy : టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ రెడ్డి అరెస్టు, చీటింగ్ చేసి జల్సాలు!
AOC Recruitment 2023: పదోతరగతి అర్హతతో 'ఇండియన్ ఆర్మీ'లో ఉద్యోగాలు, 1793 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల!
NTR Death : తెరమీదకు ఎన్టీఆర్ మరణం, టీడీపీకి చెక్ పెట్టేందుకా? డైవర్ట్ పాలిటిక్సా?
TS High Court : న్యాయమూర్తికే నోటీసులిచ్చిన న్యాయవాది, జైలుకు పంపిస్తామని హైకోర్టు సీరియస్