Pawan Vs AP Govt: పవన్ ఏపీకి గుదిబండలా తయారయ్యారు... పవన్ చేసేవి పబ్లిసిటీ పోరాటాలు... మంత్రి ఆదిమూలపు సురేశ్, సజ్జల కామెంట్స్
బద్వేల్ ఎన్నికలో జనసేన ఎవరితో కలిసినా వైసీపీకి నష్టం లేదన్నారు సజ్జల. పవన్ పబ్లిసిటీ స్టంట్స్ చేస్తున్నారని విమర్శించారు. పవన్ ఏపీకి గుదిబండలా తయారయ్యారని మంత్రి ఆదిమూలపు సురేశ్ ఆరోపించారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఏపీ మంత్రుల విమర్శల పర్వం కొనసాగుతోంది. తాజాగా విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ పవన్ పై విమర్శలు చేశారు. పవన్ సినీ పరిశ్రమకే కాకుండా ఏపీకి గుదిబండలా తయారయ్యారని మంత్రి ఆదిమూలపు సురేశ్ విర్శించారు. ఎన్నో పుస్తకాలు చదివానని చెప్పుకుంటున్న పవన్, కులాల మధ్య చిచ్చుపెడుతున్నారని విమర్శించారు. రాజకీయంగా ఎదిగాలంటే ఇది సరైన పద్ధతి కాదన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఒక అలజడి సృష్టించేందుకు పవన్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పవన్ ఎవరి కోసం పోరాడుతున్నారో, ఏ అజెండా ముందుకెళ్తున్నారో పవన్ కే క్లారిటీ లేదన్నారు.
Also Read: ఎవరి ఈగోను వారు తృప్తి పరుచుకుంటున్నారు.. పంజాబీ పిల్ల పూనమ్ కౌర్ ట్వీట్ వైరల్
పవన్ తీరు సినీ పెద్దలకే నచ్చడంలేదు
ఆన్‌లైన్ టికెటింగ్ విధానంపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు సినీపరిశ్రమ వారికే నచ్చలేదని మంత్రి సురేశ్ అన్నారు. సినీ పరిశ్రమకు మంచి జరగాలనే ఆన్‌లైన్ టికెటింగ్ విధానాన్ని ప్రభుత్వం తీసుకువచ్చిందన్నారు. సినీ పరిశ్రమ పెద్దలే ఈ విషయాన్ని చెబుతున్నారన్నారు. వారంతా ఒక క్లారిటీతో ఉంటే.. పవన్ మధ్యలో వెళ్లి అనవసర రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. పవన్ మాట్లాడుతున్న భాష, ఆలోచనా విధానం చాలా ప్రమాదకరమని మంత్రి అన్నారు.
Also Read: అమరావతిలో పవన్‌ను కలిసిన అగ్రనిర్మాతలు ! ఒంటరిని చేయలేదని క్లారిటీ ఇచ్చారా?
పవన్ పబ్లిసిటీ పోరాటాలు
బద్వేల్ ఉప ఎన్నికలో జనసేన ఎవరితో కలిసినా వైసీపీకి నష్టం లేదని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఈ ఎన్నికల్లో పవన్ ప్రభావమే ఉందన్నారు. పవన్ కల్యాణ్ చేసే శ్రమదానంపై స్పందించాల్సిన అవసరం లేదని సజ్జల అన్నారు. పవన్ పబ్లిసిటీ పోరాటాలు చేస్తున్నారని విమర్శించారు. కెమెరా అన్ చేసి యాక్షన్ అనగానే చేయడానికి ఇది సినిమా కాదని, గోతులు పూడ్చి ఫొటోలు దిగి చేసే ఆందోళనల వల్ల ప్రయోజనం లేదన్నారు. రోడ్ల మరమ్మతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.2,200 కోట్లు కేటాయించిందని సజ్జల తెలిపింది. చీప్ పబ్లిసిటి కోసం ఇలాంటి పనులు చెయ్యడం పవన్ కల్యాణ్ మానుకోవాలని హితవు పలికారు. పవన్ స్థాయికి తాము దిగజారాల్సిన అవసరం లేదన్నారు. జనసేన పార్టీకి దిశ లేదని ఎద్దేవా చేశారు. బద్వేల్ ఉప ఎన్నికలో జనసేన ఎవరితో కలిసిన తమకు నష్టం లేదన్నారు.
Also Read: బద్వేలు ఉప ఎన్నిక బరిలో నిలిచే ప్రధాన పార్టీల అభ్యర్థులు వీరే..