అన్వేషించండి

BJP Vishnu : రైతుల ఆత్మహత్యల్లో ఏపీ నెంబర్ వన్ - వైసీపీ సర్కార్‌పై ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణు ఫైర్ !

BJP Hindupuram :హిందూపురంలో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ ధర్నా నిర్వహించారు. పేదలకు వ్యతిరేకంగా ప్రభుత్వం పాలన చేస్తోందని విష్ణువర్ధన్ రెడ్డి విమర్శించారు.


BJP Vishnu Hindupur :   దేశంలోనే రైతులు ఆత్మహత్య చేసుకోవడంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానం ఉందని ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు ప్రభుత్వంపై మండిపడ్డారు.  రాయలసీమలోని అనంతపురం కర్నూల్ లలో పెద్ద ఎత్తున రైతులు ఇతర రాష్ట్రాలకు వలస పోతున్నారని అన్నారు. అయినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోందన్నారు.  ~అన్ని రకాల పన్నులు ప్రతి సంవత్సరం ప్రజలపై భారం మోపిన ఏకైక ప్రభుత్వంగా చరిత్రలో వైకాపా నిలిచిపోతోందని మండిపడ్డారు.  పట్టణాల్లో కనీస వసతులు సౌకర్యాలు కల్పించడంలో వైకాపా ప్రభుత్వం విఫలమైందని విమర్శిచారు. హిందూపురం పట్టణంలో ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు.                                                            

 పట్టణంలో  పన్నులు వసూల్లు చేస్తున్నారు , కానీ అభివృద్ధి మాత్రం చేయడం లేదని మండిపడ్డారు.  విద్యుత్ బిల్లులు , ఆర్టీసీ చార్జీలు ఇంటి పన్నులు , ఇసుక ధరలు , చివరకు మధ్యం ధరలు ఇలా అన్ని పెంచడమే తప్ప ఏమీ చేయలేదని విమర్శించారు.  పేదల ఆర్థిక స్థితి రోజురోజుకు దిగజారుతోంది . మధ్య తరగతి కుటుంబాలు బతకలేని స్థితికి చేరుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  ఏపీలో కేంద్రప్రభుత్వ పథకాలన్నీ పేర్లు మార్చుకోవడం తప్ప వైసిపి ప్రభుత్వం చేసింది మాత్రం సున్నా అని.. కేంద్ర నిధఉలను సైతం దుర్వినియోగం చేశారన్నారు.  
 
పది రోజులుగా సత్యసాయి జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో ఎక్కడ చూసినా బీజేపీ నేతలు ఆందోళనలు చేస్తూనే కనిపిస్తున్నారు.  ప్రతి రోజూ ఓ ప్రజాసమస్యపై ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. ఇళ్లు ఇవ్వలేకపోవడం, నిరుద్యోగ సమస్య, విద్యుత్ చార్జీల పెంపు వంటి అంశాలపై  వీరు దూకుడుగా వ్యవహరిస్తున్నారు.  ఇప్పటి వరకూ విపక్ష నేతలెవరూ ఈ అంశాలపై పోరు సాగించకపోవడంతో.. బీజేపీ నేతలకు ప్రజల మద్దతు లభిస్తోంది.   రాష్ట్ర పార్టీ తరపున ఎక్కువగా వాయిస్ వినిపిస్తూ.. బిజీగా ఉండే ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి ఇప్పుడు  ఫోకస్ అంతా పూర్తిగా సత్యసాయి జిల్లాపై పెట్టారు.  పార్టీని.. పార్టీ యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో యాక్టివేట్ చేస్తున్నారు. అందర్నీ ఉత్సాహంగా రోడ్లపైకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.  ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న ఆగ్రహం బయటకు కనిపిస్తున్న సరైన సమయంలో.. విష్ణువర్ధన్ రెడ్డి ఉద్యమం ప్రారంభించడంతో.. బీజేపీకి ఊపు వస్తోంది. పెద్ద ఎత్తున వీరికి ఎక్కడిక్కకడ స్థానిక ప్రజలు మద్దతు తెలుపుతున్నారు. 
  
హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో  విద్యుత్ చార్జీల పెంపు, మున్సిపాలిటిల్లో పేదలపై పన్నుల పెంపు, నిరుద్యోగుల ఉద్యోగుల కల్పనలో ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా తీవ్ర ఉద్యమం ప్రారంభించారు.  విష్ణువర్ధన్ రెడ్డి వ్యూహాత్మకంగా ఉద్యమం చేస్తున్నారు.  ఇతర పార్టీల నేతలు టిక్కెట్ల హడావుడిలో ఉన్నారు. కానీ బీజేపీ లో ఎవర్ని నిలబెట్టినా అందరూ కలిసి పని చేస్తారు. అందుకే విష్ణువర్ధన్ రెడ్డి ... పార్లమెంట్ నియోజకవర్గం మొత్తంలో బీజేపీని బలోపేతం చేయడానికి రంగంలోకి దిగారు.  ప్రజల్ని మొబిలైజ్ చేయడంలో మంచి ఫలితాలు సాధిస్తున్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Bandi Sanjay : గోపీనాథ్ ఆస్తుల పంపకంలో రేవంత్, కేటీఆర్ మధ్య తేడాలు- బండి సంజయ్‌ సంచలన ఆరోపణలు 
గోపీనాథ్ ఆస్తుల పంపకంలో రేవంత్, కేటీఆర్ మధ్య తేడాలు- బండి సంజయ్‌ సంచలన ఆరోపణలు 
Remove stray dogs: వీధి కుక్కలపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు - ఆ ప్రాంతాల నుంచి వెంటనే తొలగించాలని ఆదేశం
వీధి కుక్కలపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు - ఆ ప్రాంతాల నుంచి వెంటనే తొలగించాలని ఆదేశం
Bihar Elections 2025: బిహార్‌లో 60శాతం కంటే ఎక్కువ ఓటింగ్ జరిగినప్పుడల్లా, రాజకీయాలు మారాయి! ఈసారి ఏంటి?
బిహార్‌లో 60శాతం కంటే ఎక్కువ ఓటింగ్ జరిగినప్పుడల్లా, రాజకీయాలు మారాయి! ఈసారి ఏంటి?
SSMB29 Update : 'SSMB29' విలన్ కుంభ - ఇన్‌స్పిరేషన్ ఎవరు?.. అసలు స్టోరీ ఏంటంటే?
'SSMB29' విలన్ కుంభ - ఇన్‌స్పిరేషన్ ఎవరు?.. అసలు స్టోరీ ఏంటంటే?
Advertisement

వీడియోలు

గంభీర్ భాయ్.. నీకో దండం! బ్యాటింగ్‌ పొజిషన్ ఇలా సెలక్ట్ చేస్తున్నావా?
చిరస్మరణీయ విజయం చిరకాలం గుర్తుండాలని టాటూలు వేయించుకున్న హర్మన్, స్మృతి
పీఎం మోదీని కలిసినప్పుడు అలా ఎందుకు చేసానంటే..!
అల్లటప్పా ఆటగాడనుకున్నారా.. రీప్లేస్ చేయాలంటే బాబులు దిగిరావాల!
Australia vs India 4th T20I Match Highlights | నాలుగో టీ20 లో గెలిచిన టీమిండియా | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bandi Sanjay : గోపీనాథ్ ఆస్తుల పంపకంలో రేవంత్, కేటీఆర్ మధ్య తేడాలు- బండి సంజయ్‌ సంచలన ఆరోపణలు 
గోపీనాథ్ ఆస్తుల పంపకంలో రేవంత్, కేటీఆర్ మధ్య తేడాలు- బండి సంజయ్‌ సంచలన ఆరోపణలు 
Remove stray dogs: వీధి కుక్కలపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు - ఆ ప్రాంతాల నుంచి వెంటనే తొలగించాలని ఆదేశం
వీధి కుక్కలపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు - ఆ ప్రాంతాల నుంచి వెంటనే తొలగించాలని ఆదేశం
Bihar Elections 2025: బిహార్‌లో 60శాతం కంటే ఎక్కువ ఓటింగ్ జరిగినప్పుడల్లా, రాజకీయాలు మారాయి! ఈసారి ఏంటి?
బిహార్‌లో 60శాతం కంటే ఎక్కువ ఓటింగ్ జరిగినప్పుడల్లా, రాజకీయాలు మారాయి! ఈసారి ఏంటి?
SSMB29 Update : 'SSMB29' విలన్ కుంభ - ఇన్‌స్పిరేషన్ ఎవరు?.. అసలు స్టోరీ ఏంటంటే?
'SSMB29' విలన్ కుంభ - ఇన్‌స్పిరేషన్ ఎవరు?.. అసలు స్టోరీ ఏంటంటే?
Jubilee Hills by-election : జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వేళ తనిఖీల కలకలం- కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతల మధ్య వాగ్వాదం
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వేళ తనిఖీల కలకలం- కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతల మధ్య వాగ్వాదం
Indian Railways: రైళ్లలో మద్యం తీసుకెళ్లవచ్చా ? - ఈ డౌట్ ఉంటే ఇది మీ కోసమే
రైళ్లలో మద్యం తీసుకెళ్లవచ్చా ? - ఈ డౌట్ ఉంటే ఇది మీ కోసమే
Jatadhara Movie Review - 'జటాధర' రివ్యూ: శివుని నేపథ్యంలో సుధీర్ బాబు సినిమా - థియేటర్లలో చూడగలమా?
'జటాధర' రివ్యూ: శివుని నేపథ్యంలో సుధీర్ బాబు సినిమా - థియేటర్లలో చూడగలమా?
CTET February 2026: CTET రిజిస్ట్రేషన్ త్వరలోనే ప్రారంభమవుతోంది, అర్హతలు ఏంటీ? ఎలా అప్లై చేయాలో తెలుసుకోండి?
CTET రిజిస్ట్రేషన్ త్వరలోనే ప్రారంభమవుతోంది, అర్హతలు ఏంటీ? ఎలా అప్లై చేయాలో తెలుసుకోండి?
Embed widget