Accident: అనంతపురం జిల్లాలో ఘోర ప్రమాదం.. కారును ఢీకొట్టిన లారీ... ముగ్గురు మృతి
అనంతపురం జిల్లా గుత్తి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును లారీ ఢీకొట్టిన ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు.
అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నేటి తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. గుత్తి సమీపంలో జాతీయ రహదారిపై కారును లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో చనిపోయిన వారు కర్నూలు జిల్లా, కర్ణాటక వాసులుగా గుర్తించారు. లారీ రాంగ్‌రూట్‌లో ఎదురుగా వచ్చి కారును బలంగా ఢీకొట్టింది. కొందరు వ్యక్తులు కారులో అనంతపురం నుంచి కర్నూలు వెళుతుండగా ప్రమాదం చోటుచేసుకుంది.
అనంతపురం జిల్లాలో ఈ తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో కర్నూలకు చెందిన ముగ్గురు మృతిచెందారు. అనంతపురం జిల్లాలోని గుత్తి సమీపంలోని 44వ నంబర్ జాతీయ రహదారిపై రాంగ్ రూట్‌లో వస్తున్న లారీ ఎదురుగా వస్తున్న బోలెరో వాహనాన్ని ఒకదానికొకటి ఢీకొన్నాయి. బెంగళూరు నుంచి అనంతపురం మీదుగా కర్నూలు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గుల్బర్గాకు చెందిన లాయక్ అలీ, అష్రఫ్ అలీ, కర్నూలు జిల్లాకు ఖాశీం మహమ్మద్లుగా అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.
Also Read: Payyavula : ఏపీ ప్రభుత్వ నిర్వాకంతో బ్యాంకులకే గండం..! అప్పుల వివాదంపై పయ్యావుల మరో సంచలనం..
విషయం తెలుసుకున్న సీఐ రాము హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. ప్రమాదంలో కారు పూర్తిగా దెబ్బతింది. అందులో ఇరుక్కుపోయిన మృతదేహాలను బయటకు తీసేందుకు పోలీసులు, స్థానికులు శ్రమించారు. మృత దేహాలు కారులో చిక్కుకోవడంతో క్రేన్ల సహాయంతో వెలుపలికి తీశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
టమోటా లోడుతో వస్తున్న లారీ రాంగ్ రూట్‌లో వచ్చి కారును బలంగా ఢీకొట్టినట్లు గుత్తి సీఐ తెలిపారు. ఈ ప్రమాదం సోమవారం తెల్లవారు జామున సుమారు గం.4.30 నిముషాలకు జరిగిందని వెల్లడించారు. ప్రమాదంలో గుల్బర్గాకు చెందిన అష్రఫ్ అలీ(68), లాయక్ అలీ(45), కర్నూలుకు చెందిన ఖాశీం మహమ్మద్ మృతి చెందారని చెప్పారు. ఈ ప్రమాదంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రమాదంలో లారీ రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. టామోటోలు రోడ్డుపై పడిపోయాయి. అనంతరం పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేశారు.