YSRCP Vs Janasena : వాళ్లు ఓపెనింగ్.. ఎమ్మెల్యే రీ ఓపెనింగ్ ! భీమవరం ఎమ్మెల్యేకు జనసేన "ప్రోటోకాల్ షాక్" !

ఆ ఎమ్మెల్యే ఓపెనింగ్‌కు వెళ్లారు. కానీ అప్పటికే ఓపెనింగ్ చేసేశారు. దీంతో మళ్లీ పసుపునీళ్లతో కడిగించి రిబ్బన్ కట్టించి కట్ చేసి ఆ ఎమ్మెల్యే శాంతించారు. ఇంతకూ ఆ ఎమ్మెల్యేను ఎందుకు అవమానించారంటే ...

FOLLOW US: 

ఆ ఎమ్మెల్యే ప్రభుత్వ నిధులతో కట్టింది కాబట్టి అధికార పార్టీకి మాత్రమే హక్కు ఉందని అనుకున్నారు. ప్రజాధనంతో కట్టిన భవనాలను సొంత వ్యవహారంలా ప్రారంభించాలనుకున్నారు. కానీ ఇతర ప్రజాప్రతినిధులు ఆ ఎమ్మెల్యేకు రివర్స్‌లో షాకిచ్చారు. ఆయన రాక ముందు ప్రారంభోత్సవం నిర్వహించేశారు. తీరా  వచ్చి చూసి ... ఓపెనింగ్ జరిగిపోయిందని చూసి.. వెంటనే పసుపునీళ్లతో కడిగించి.. మళ్లీ రిబ్బన్ కట్టిం.. సెకండ్ హ్యాండ్ ఓపెనింగ్ చేసి... తన ఈగోను శాటిస్‌ఫై చేసుకుని వెళ్లారు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో హాట్ టాపిక్ అయింది. 

Also Read : ఏపీ, తెలంగాణకు కేఆర్ఎంబీ ఛైర్మన్ లేఖ.... శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులు అప్పగించాలని ఆదేశాలు

ప.గో జిల్లా భీమవరం నియోజర్గం నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేసి పరాజయం పాలయ్యారు. అయినప్పటికీ ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో ఆ నియోజకవర్గంలో జనసేన ఓ జడ్పీటీసీతో పాటు కొన్ని సర్పంచ్ పదవులు, మరికొన్ని ఎంపీటీసీ పదవులను గెల్చుకుంది. దాంతో జనసేన కూడా ఆ నియోజకవర్గంలో కొన్ని చోట్ల బలంగా ఉంది. వీరవాసరం మండలంలో జనసేన ప్రజాప్రతినిధులు ఎక్కువగానే ఉన్నారు. ఆ మండలంలోనే తోలేరు అనే గ్రామంలో ప్రజాధనంతో కట్టిన అంగన్ వాడి బిల్డింగ్, సొసైటీ గోడౌన్ ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు.  

Also Read:  అనంత విద్యార్థులపై విరిగిన లాఠీ... ఎస్‌ఎస్‌బీఎన్‌ కళాశాల వద్ద ఉద్రిక్తత

అయితే ఎమ్మెల్యేతో మాత్రమే కార్యక్రమం నిర్వహించాలని జనసేనకు చెందిన ప్రజాప్రతినిధులెవరినీ ఆహ్వానించకూడదని నిర్ణయించుకున్నారు. సాధారణంగా ప్రోటోకాల్ ప్రకారం గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి ప్రజాప్రతినిధుల వరకూ అందర్నీ ఆహ్వానించాలి. కానీ వైఎస్ఆర్‌సీపీ నేతల్ని తప్ప.. జనసేనతో పాటు ఇతర పార్టీల ప్రజాప్రతినిధుల్ని ఆహ్వానించలేదు. ఇది వారిని తీవ్ర ఆగ్రహానికి గురి చేసింది.

Also Read: తీన్మార్ మల్లన్నకు బెయిల్ మంజూరు.. 74 రోజుల తర్వాత బయటకు..

ఎమ్మెల్యే రాక ముందే అంగన్ వాడి భవనం, సొసైటీ గౌడౌన్‌ను సర్పంచ్, జడ్పీటీసీ కలిసి ప్రారంభించేశారు. తీరా ఎమ్మెల్యే వచ్చిన తర్వాత విషయం తెలియడంతో వైఎస్ఆర్‌సీపీ నేతలు ఆందోళన చేశారు. దీంతో కాసేపు ఉద్రిక్తత ఏర్పడింది. చివరికి పసుపునీళ్లు పెట్టి కడిగించి.. కొత్త రిబ్బన్ తెచ్చి కట్టించి.. కట్ చేసి .. ఓపెనింగ్ అయిందని వెళ్లారు ఎమ్మెల్యే. అయితే ప్రోటోకాల్ పాటించని ఎమ్మెల్యేకు సరైన గుణపాఠం చెప్పామని జనసేన నేతలు స్పష్టం చేశారు. 

Also Read : ఏపీకి పాలు సరఫరా బంద్.... రూ.130 కోట్ల బకాయిలు చెల్లించండి... ఏపీకి కర్ణాటక లేఖ

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 08 Nov 2021 04:37 PM (IST) Tags: ANDHRA PRADESH YSRCP janasena Beemavaram Grandhi Srinivas  

సంబంధిత కథనాలు

CM Jagan : వ్యవసాయం, విద్యా రంగాలకు అత్యంత ప్రాధాన్యత- సీఎం జగన్

CM Jagan : వ్యవసాయం, విద్యా రంగాలకు అత్యంత ప్రాధాన్యత- సీఎం జగన్

Balineni Srinivas Reddy : పవన్ చేనేత ఛాలెంజ్ స్వీకరించిన బాలినేని, ట్వీట్ తో రిప్లై

Balineni Srinivas Reddy : పవన్ చేనేత ఛాలెంజ్ స్వీకరించిన బాలినేని, ట్వీట్ తో రిప్లై

National Handloom Day : చేనేత కళాకారులకు ఎప్పుడూ అండగా నిలుస్తాం - సీఎం జగన్

National Handloom Day : చేనేత కళాకారులకు ఎప్పుడూ అండగా నిలుస్తాం - సీఎం జగన్

EX MLC Annam Satish: రూపాయి పెట్టి వంద దోచుకుంటున్నారు, డిప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతిపై అన్నెం సతీష్ ఫైర్

EX MLC Annam Satish:  రూపాయి పెట్టి వంద దోచుకుంటున్నారు, డిప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతిపై అన్నెం సతీష్ ఫైర్

Kurnool News : 'ఫ్రెండ్ షిప్ డే' నాడు విషాదం, వాగులో కొట్టుకుపోయిన నలుగురు మిత్రులు

Kurnool News : 'ఫ్రెండ్ షిప్ డే' నాడు విషాదం, వాగులో కొట్టుకుపోయిన నలుగురు మిత్రులు

టాప్ స్టోరీస్

Nikhat Zareen Gold Medal : నిఖత్ జరీన్ కు సీఎం కేసీఆర్ ఫోన్, స్వర్ణ పతకం సాధించడంపై సంతోషం వ్యక్తం

Nikhat Zareen Gold Medal : నిఖత్ జరీన్ కు సీఎం కేసీఆర్ ఫోన్, స్వర్ణ పతకం సాధించడంపై సంతోషం వ్యక్తం

Nikhat Zareen Wins Gold: తెలంగాణ అమ్మాయి పంచ్‌ పవర్‌ - బాక్సర్‌ నిఖత్‌కు స్వర్ణం

Nikhat Zareen Wins Gold: తెలంగాణ అమ్మాయి పంచ్‌ పవర్‌ - బాక్సర్‌ నిఖత్‌కు స్వర్ణం

Shruti Haasan: నాకోసం అమ్మ నాన్న ఎవరికీ ఫోన్లు చేయలేదు - కష్టం ఎవరికైనా ఒకటే: శ్రుతిహాసన్

Shruti Haasan: నాకోసం అమ్మ నాన్న ఎవరికీ ఫోన్లు చేయలేదు - కష్టం ఎవరికైనా ఒకటే: శ్రుతిహాసన్

Moto G62 5G: మోటొరోలా చవకైన 5జీ ఫోన్ వచ్చేస్తుంది - రూ.15 వేలలోపే!

Moto G62 5G: మోటొరోలా చవకైన 5జీ ఫోన్ వచ్చేస్తుంది - రూ.15 వేలలోపే!