సుప్రీంకోర్టులో అవినాష్‌కు లభించని ఊరట- బెయిల్ పిటిషన్ తీసుకునేందుకు వెకేషన్ బెంచ్ నిరాకరణ
అవినాష్‌ను అరెస్టు చేసేందుకు ఓవైపు సీబీఐ ప్రయత్నాలు చేస్తుండగానే ముందస్తు బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.
వివేక హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి ఊరట లభించలేదు. ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఆయన వెకేషన్ బెంచ్‌లో పిటిషన్ వేశారు. ముందు ఈ పిటిషన్ జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ నరసింహ ధర్మాసనం ముందుకు అవినాష్ రెడ్డి పిటిషన విచారణకు వచ్చింది. దీన్ని వేరే బెంచ్‌కు వెళ్లాలని జస్టిస్ జేకే మహేశ్వరి బెంచ్ సూచించింది.
జస్టిస్ సంజయ్ కరోల్ అనిరుద్ బోస్ బెంచ్ ముందుకు వెళ్లిందీ పిటిషన్. అయితే ముందుగా మెన్షన్ చేసిన కేసులనే వాదిస్తామని మెన్షన్ అధికారులకు చెప్పారా అని బెంచ్ ప్రశ్నించింది. దీనికి అవినాష్ రెడ్డి తరఫు న్యాయవాదులు లేదని చెప్పారు. ఇది అర్జెంట్‌గా విచారించాల్సి ఉందని అందుకే మెన్షన్ అధికారులకు చెప్పలేదని పేర్కొన్నారు. అయితే లిస్ట్ అయిన కేసులను మాత్రమే విచారిస్తామని తేల్చి చెప్పిందా బెంచ్. మరోసారి మెన్షన్ అధికారులను సంప్రదించి లిస్ట్ చేయించుకోవాలని సూచించారు. దీని వల్ల ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణకు రాకుండా పోయింది.