Nandyal News: నంద్యాల వైసీపీ నేత హత్య కేసులో పోలీసులు ఫెయిల్, ప్రూఫ్ చూపెట్టిన వైసీపీ
AP Latest News: నంద్యాల జిల్లాకు చెందిన వైసీపీ నేత పెద్ద సుబ్బారాయుడుని కిరాతకంగా హత్య చేస్తున్నా పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించలేదని వైసీపీ ఆరోపించింది.
YSRCP News: నంద్యాల జిల్లాలో వైఎస్ఆర్ సీపీ నేత హత్యకు గురి కావడంలో పోలీసుల పాత్ర ఉందని వైఎస్ఆర్ సీపీ ఆరోపించింది. ఈ మేరకు ఎక్స్‌లో ఓ పోస్ట్ చేసింది. హత్య గురించి ఎస్పీకి ఫోన్ చేసి చెప్పినా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపించారు. ఎస్పీకి 12:59 నుంచి 3:20 నిమిషాల వరకు ఐదు సార్లు ఫోన్లు చేసినా సకాలంలో స్పందించలేదని బాధితుడు నారపురెడ్డి వివరించారు.
‘‘వైఎస్ఆర్ సీపీ నేత హత్య సుబ్బారాయుడి కేసులో బయటపడ్డ పోలీసులు వైఫల్యం చెందారు. రాత్రి 12:59 నిమిషాలకు జిల్లా ఎస్పీకి YSRCP నేత నారపురెడ్డి ఫోన్ చేశారు. 1:02 నిమిషాలకు ఎస్పీకి మరోసారి నారపురెడ్డి ఫోన్ చేశారు. పరిస్థితి తీవ్రంగా ఉందంటూ వేడుకున్నారు. గ్రామంలో తమను హత్య చేయడానికి టీడీపీ వారు వస్తున్నారని, పోలీసులను పంపాలని ఎస్పీని నారపురెడ్డి కోరారు. తర్వాత సీతారాంపురం గ్రామానికి ఒక ఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు చేరుకున్నారు. పోలీసులు వచ్చిన తర్వాత గ్రామంలోకి టీడీపీ నేత శ్రీనివాసరెడ్డి, అనుచరులు చొరబడ్డారు.
పోలీసులు ఉండగానే సుబ్బారాయుడుపై ఇంటిపై మారణాయుధాలతో టీడీపీ గూండాలు దాడి చేశారు.
కత్తులతో గ్రామస్తులను టీడీపీ నేత శ్రీనివాసరెడ్డి బెదిరించారు. ఎస్.ఐ. నాగేంద్ర ప్రసాద్, కానిస్టేబుళ్ల ఎదుటే వైయస్సార్‌సీపీ నాయకుడు సుబ్బారాయుడిని కిరాతకంగా టీడీపీ నేత శ్రీనివాసరెడ్డి, అనుచరులు హత్య చేశారు. పెద్ద సుబ్బారాయుడుని కిరాతకంగా హత్య చేస్తున్నా పోలీసులు అడ్డుకోలేదు. ఏమీ చేయలేకపోయారని గ్రామస్తులు అన్నారు. అర్ధరాత్రి 1:30 నిమిషాల నుంచి తెల్లవారుజాము 3 గంటల వరకు గ్రామంలో టీడీపీ నేత శ్రీనివాసరెడ్డి విధ్వంసం సృష్టించారు. గ్రామంలో హత్యలు చేస్తున్నారంటూ ఎస్పీకి 12:59 నుంచి 3:20 నిమిషాల వరకు ఐదు సార్లు ఫోన్లో నారపురెడ్డి వివరించారు.
రెండున్నర గంటల పాటు కత్తులతో దాడులు చేస్తున్నా అదనపు బలగాలు గ్రామానికి చేరుకోలేదు. పోలీసుల సమక్షంలో పెద్ద సుబ్బారాయుడిని హత్య చేసి పలువురిని గాయపరిచి తర్వాత తాపీగా అక్కడి నుంచి శ్రీనివాసరెడ్డి వెళ్లిపోయారు.’’ అని వైఎస్ఆర్ సీపీ పోస్ట్ చేసింది.
నంద్యాల: YSRCP నేత హత్య సుబ్బరాయుడి కేసులో బయటపడ్డ పోలీసుల వైఫల్యం.
— YSR Congress Party (@YSRCParty) August 4, 2024
రాత్రి 12:59 నిమిషాలకు జిల్లా ఎస్పీకి ఫోన్ చేసిన YSRCP నేత నారపురెడ్డి ఫోన్
1:02 నిమిషాలకు ఎస్పీకి మరోసారి ఫోన్ చేసిన నారపురెడ్డి.
పరిస్థితి తీవ్రంగా ఉందంటూ వేడుకోలు.
గ్రామంలో తమను హత్య చేయడానికి @JaiTDP… pic.twitter.com/hrGGg9DMYn