X

Anantapuram : ఒక ఒరిజినల్ నోట్‌కు నాలుగు బ్లాక్‌ కరెన్సీ నోట్లు.. గుంతకల్లో దందా గుట్టు రట్టు

బ్లాక్‌ కరెన్సీ పేరుతో నయాదందా మొదలపెట్టారు గుంతకల్లో కొందరు కేటుగాళ్లు. ఒక ఒరిజినల్ నోట్‌కు నాలుగు బ్లాక్‌ కరెన్సీ నోట్లు ఇస్తూ పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా చిక్కారు.

FOLLOW US: 

మోసపోయే వాళ్లు ఉన్నంతవరకు మోసం చేసే వాళ్లు వివిధ రూపాల్లో వస్తూనే ఉంటారు. దానికి ఉదాహరణే గుంతకల్‌లో జరగిని ఓ బ్లాక్ కరెన్సీ మోసం. ప్రాథమిక దశలోనే వాటికి పోలీసులు అడ్డుకట్ట వేయడంతో బాధితుల సంఖ్య తగ్గింది. లేకుంటే చాలా మంది ఈ దందాతో మోసపోయేవాళ్లు. 

చదివిందోమో డిఫార్మసీ... అగ్రిగోల్డ్ ఏజెంట్‌గా జీవితం మొదలపెట్టాడో వ్యక్తి. జల్సాలకు అలవాటు పడి ఎక్కడ పడితే అక్కడ అప్పులు చేశాడు. తీర్చే దారి తెలియక.. మోసాల దారిని ఎంచుకున్నాడు దాసరి నరేష్ కుమార్. అగ్రిగోల్డ్ తర‌్వాత రైస్ పుల్లింగ్ ముఠాలతో పరిచయం పెంచుకొని అడ్డదార్లు తొక్కాడు. అక్రమంగా డబ్బు సంపాదనకు అలవాటు పడ్డాడు. రైస్ పుల్లింగ్‌తో ఆశించిన డబ్బు సంపాదించలేకపోయాడు. ఏం చేస్తే ఈజీగా డబ్బులు వస్తాయో అని ఆలోచించి బ్లాక్ కరెన్సీ తయారీకి సిద్ధమయ్యాడు. ఇందు కోసం మరో ఇద్దరితో కలిసి బ్లాక్ కరెన్సీ మోసాలకు పాల్పడుతూ సంపాదనకు తెరలేపాడు. 

బ్లాక్ పేపర్లను నోట్ల సైజులో కట్ చేసి బ్లాక్‌ కరెన్సీ సిద్ధం చేస్తాడు. ఈ నోట్ల కట్లలపై భాగంలో కెమికల్స్ పూసేవాడు. ఆ నోట్ల కట్ట పైభాగంలో ఒరిజినల్‌ నోట్ ఉంచేవాడు. కస్టమర్లు వస్తే ఆ నోట్‌ను కెమికల్స్ పూసి ఇదిగో ఒరిజినల్‌ నోట్‌ రెడీ అంటూ ఖహానీలు చెప్పేవాడు. ఈ బ్లాక్ కరెన్సీ గోవాలోని ఆర్బీఐ ముద్రించే ప్యాక్టరీ నుంచి తెచ్చామని నమ్మించేవాడు. ఒక ఒరిజనల్ నోటుకు నాలుగు బ్లాక్ కరెన్సీ నోట్లు ఇచ్చేవాడు.

అయితే ఈ మోసం అంత ఈజీగా దాగేది కాదు కనుక ఆ నోటా ఈనోటా  పోలీసుల చెవిన పడింది. బాధితులు మోసపోయిన వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చేందుకు కూడా జంకారు. కానీ ఒకరు మాత్రం ధైర్యంగా పోలీసులకు చెప్పడంతో నిందితుల ఆటకట్టించారు పోలీసులు. ప్రధాన సూత్రధారి నరేష్ కుమార్‌ను అతనికి సహకరించిన దొరస్వామిరెడ్డి(61), పులుసు గోపాలకృష్ణా(32)ను అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 380000/-స్వాదీనం చేసుకొన్నారు. 28బ్లాక్ పేపర్ల కట్టలు,కెమికల్ పూతగా పూసి బ్లాక్ గా మార్చిన 500నోట్లను,కెమికల్స్ ను స్వాధీనం చేసుకొన్నట్లు గుంతకల్ డీఎస్పీనరసింగప్ప వెల్లడించారు.

Tags: Anantapuram Anantapuram News Anantapuram Updates Anantapuram Police Black Currency

సంబంధిత కథనాలు

Compassionate Appointments: ఏపీలో ఆ ఉద్యోగుల కుటుంబాల కారుణ్య నియామకాలకు ఉత్తర్వులు జారీ

Compassionate Appointments: ఏపీలో ఆ ఉద్యోగుల కుటుంబాల కారుణ్య నియామకాలకు ఉత్తర్వులు జారీ

Weather Updates: రెయిన్ అలర్ట్.. ఏపీ, తెలంగాణలో నేడు ఓ మోస్తరు వర్షాలు.. పెరుగుతున్న చలి తీవ్రత

Weather Updates: రెయిన్ అలర్ట్.. ఏపీ, తెలంగాణలో నేడు ఓ మోస్తరు వర్షాలు.. పెరుగుతున్న చలి తీవ్రత

Srisailam- Corona: కరోనా ప్రభావం...శ్రీశైలం శ్రీ మల్లికార్జునుడి సన్నిధిలో ఆంక్షలివే..

Srisailam- Corona: కరోనా ప్రభావం...శ్రీశైలం శ్రీ మల్లికార్జునుడి సన్నిధిలో ఆంక్షలివే..

Weather Updates: తెలంగాణలో వడగండ్ల వానలు.. ఏపీలో పలు చోట్ల విస్తారంగా వర్షాలు కురిసే ఛాన్స్.. ఎల్లో అలర్ట్ జారీ

Weather Updates: తెలంగాణలో వడగండ్ల వానలు.. ఏపీలో పలు చోట్ల విస్తారంగా వర్షాలు కురిసే ఛాన్స్.. ఎల్లో అలర్ట్ జారీ

Kurnool కలెక్టర్ పీఏని అని చెప్పి డబ్బులు డిమాండ్.. నిందితుడికి ఊహించని ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు

Kurnool కలెక్టర్ పీఏని అని చెప్పి డబ్బులు డిమాండ్.. నిందితుడికి ఊహించని ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Lavanya Tripathi: మెగా హీరోతో పెళ్లి పుకార్లకు పరోక్షంగా... తెలివిగా సమాధానం ఇచ్చిన లావణ్యా త్రిపాఠీ!?

Lavanya Tripathi: మెగా హీరోతో పెళ్లి పుకార్లకు పరోక్షంగా... తెలివిగా సమాధానం ఇచ్చిన లావణ్యా త్రిపాఠీ!?

Pushpa Memes: ‘మాస్క్’ తీసేదేలే.. ‘పుష్ప’ పోస్టర్‌తో కేంద్రం వినూతన ప్రచారం.. ఇలా కూడా వాడేస్తారా!

Pushpa Memes: ‘మాస్క్’ తీసేదేలే.. ‘పుష్ప’ పోస్టర్‌తో కేంద్రం వినూతన ప్రచారం.. ఇలా కూడా వాడేస్తారా!

AP Corona Cases: ఆంధ్రప్రదేశ్ లో కరోనా కల్లోలం.. కొత్తగా 10 వేలకుపైగా కేసులు నమోదు..

AP Corona Cases: ఆంధ్రప్రదేశ్ లో కరోనా కల్లోలం.. కొత్తగా 10 వేలకుపైగా కేసులు నమోదు..

Health News: పారాసెటమాల్, డోలో మాత్రలు అతిగా మింగేస్తున్నారా? ఏది ఎంత మోతాదులో తీసుకోవాలో తెలుసుకోండి

Health News: పారాసెటమాల్, డోలో మాత్రలు అతిగా మింగేస్తున్నారా? ఏది ఎంత మోతాదులో తీసుకోవాలో తెలుసుకోండి