IPL, 2022 | Qualifier 2 | Narendra Modi Stadium, Ahmedabad - 27 May, 07:30 pm IST
(Match Yet To Begin)
RR
RR
VS
RCB
RCB
IPL, 2022 | Final | Narendra Modi Stadium, Ahmedabad - 29 May, 08:00 pm IST
(Match Yet To Begin)
GT
GT
VS
TBC
TBC

ఇంటికో హుండీతో అనంత సాయం- రోజుకో రూపాయితో పొదుపుతో తీసుకొచ్చారు విప్లవం

సంపాదించడంలో ఎంత అనందం ఉంటుందో... సాయం చేయడంలో అంతకంటే ఎక్కువ ఆనందం ఉంటుంది. అందుకే ఆ ప్రాంతంలో ఇంటికో హుండీ ఉంటుంది. అదే కొండంత భరోసా ఇస్తుంది.

FOLLOW US: 

స్పందించు... సహాయం అందించు... ఇది అనంతపురం జిల్లాలో గత ఐదేళ్ళ క్రితం మొదలైన హుండీ కార్యక్రమం. ఫాదర్‌ పెర్రర్ జయంతి రోజున ఈ కార్యకమాన్ని ప్రారంభించింది అనంతపురంలోని రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్.

ఐదేళ్ల క్రితం ఆర్డీటి మహిళా సంఘాల ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ కార్యక్రమం నేడు జిల్లావ్యాప్తంగా లక్షా యాభైవేల కుటుంబాలకు చేరుకొంది. ప్రతి ఇంట్లోను ఏర్పాటు చేసే ఈ హుండీలో ఎవరకి తోచినంత వారు డబ్బులు వేస్తారు. సంవత్సరంపాటు ఇలా హుండీలో వేసిన డబ్బును ఫాదర్ పెర్రర్ జయంతి రోజున గ్రామ కమిటీలకు అప్పగిస్తారు. వాటిని ఆ గ్రామంలోనే తెరిచి లెక్కిస్తారు. వచ్చిన డబ్బును అంతా లెక్కించి ఆర్డీటి కేంద్ర కార్యాలయానికి చేరుస్తారు.

వీటి ద్వారా వచ్చిన డబ్బుతో ఆనాథ పిల్లలకు అవసరమైన విద్య, వైద్యంతోపాటు, వారికి అవసరమైన అన్నిసహాయ సహకారాలు అందించేందుకు ఈ ఫండ్ వినియోగిస్తున్నట్టు తెలిపారు ఆర్డీటి డైరెక్టర్ విశాల ఫెర్రర్.

ఈ హుండీ కార్యక్రమానికి నిరుపేద మహిళలతో ప్రారంభమై నేడు అన్ని వర్గాల ప్రజలకు చేరింది. ప్రజలందరూ హుండీ కార్యక్రమంలో భాగస్వామ్యమయ్యారు. ఇది చాలా ఆనందదాయకం అంటున్నారు ఆర్డీటీ డైరెక్టర్‌ విశాల్ ఫెర్రర్. రూరల్ డెవలప్ మెంట్ ట్రస్టు ఆధ్వర్యంలో ప్రారంభం సమయంలో కరవుతో సతమతమవుతున్న అనంతపురం జిల్లాలో పెద్ద ఎత్తున సహాయ కార్యక్రమాలు చేసేవాళ్లమని గుర్తు చేసుకున్నారు. కానీ నేడు వాటికి భిన్నంగా ఎక్కడ ఏ విపత్తులు జరిగినా అనంత ప్రజలు సాయం చేస్తున్నారన్నారు.

కోవిడ్ సమయంలోనూ పెద్ద ఎత్తున విరాళాలు అర్డీటికి అందించారని.. విశాల హృదయం చాటుకోవడంలో అనంత ప్రజలు అగ్రగామిగా ఉన్నారన్నారు విశాల్ ఫెర్రర్. రోజుకు ఎవరికి తోచినంత అంత మొత్తం హుండీలో వేయమని చెప్పామని.. అది ఈ రోజు ఇంత ప్రోగ్రాం అవుతుందని అనుకోలేదన్నారు. ప్రతి రోజు కచ్చితంగా హుండీలో ఒక్క రూపాయి వేయాలన్న నిబంధన ఉందని.. సంవత్సరానికి ఒక్కో హుండీలో మినిమం 365 రూపాయలు వస్తుందన్నారు. ఇంకా ఎక్కవే వస్తుంది కానీ 365 రూపాయల కంటే తక్కువ మాత్రం రాదన్నారు. ఇలా కొందరు నెలకోసారి, మరికొందరు సంవత్సరానికోసారి తమ విరాళాలను అందజేస్తుంటారని తెలిపారు విశాల ఫెర్రర్.

Published at : 19 Apr 2022 01:48 PM (IST) Tags: Anantapuram RDT Helping Hands

సంబంధిత కథనాలు

Anantapur: సచివాలయాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ట్రైనీ జేసీ తనిఖీలు - పోలీసులు అరెస్టు చేయడంతో కి‘లేడీ’ ట్విస్ట్

Anantapur: సచివాలయాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ట్రైనీ జేసీ తనిఖీలు - పోలీసులు అరెస్టు చేయడంతో కి‘లేడీ’ ట్విస్ట్

AP Govt Employees: రేపు ప్రభుత్వ ఉద్యోగులతో కీలక భేటీ - సీపీఎస్ వివాదం ఇకనైనా తేల్చుతారా, కాలయాపన చేస్తారా !

AP Govt Employees: రేపు ప్రభుత్వ ఉద్యోగులతో కీలక భేటీ - సీపీఎస్ వివాదం ఇకనైనా తేల్చుతారా, కాలయాపన చేస్తారా !

Weather Updates: నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఏపీలో మరో 4 రోజులు వర్షాలు - తెలంగాణలో పొడి వాతావరణం

Weather Updates: నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఏపీలో మరో 4 రోజులు వర్షాలు - తెలంగాణలో పొడి వాతావరణం

Chandrababu: కొత్తగా రాజకీయాల్లోకి వచ్చేవారికీ ఛాన్స్, ఈసారి 40 శాతం సీట్లు వారికే : చంద్రబాబు

Chandrababu: కొత్తగా రాజకీయాల్లోకి వచ్చేవారికీ ఛాన్స్, ఈసారి 40 శాతం సీట్లు వారికే : చంద్రబాబు

Chandrababu Kurnool Tour: భూలోకంలో ఎక్క‌డ దాక్కున్నా లాక్కొచ్చి లోప‌లేయిస్తా: చంద్ర‌బాబు సంచలన వ్యాఖ్యలు

Chandrababu Kurnool Tour: భూలోకంలో ఎక్క‌డ దాక్కున్నా లాక్కొచ్చి లోప‌లేయిస్తా: చంద్ర‌బాబు సంచలన వ్యాఖ్యలు
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

CM KCR Meets Devegowda : మాజీ ప్రధాని దేవెగౌడతో సీఎం కేసీఆర్ భేటీ, జాతీయ రాజకీయాలపై చర్చ!

CM KCR Meets Devegowda : మాజీ ప్రధాని దేవెగౌడతో సీఎం కేసీఆర్ భేటీ, జాతీయ రాజకీయాలపై చర్చ!

Samajika Nyaya Bheri: శ్రీకాకుళం నుంచి వైఎస్సార్‌సీపీ బస్సుయాత్ర ప్రారంభం - ఏపీ అభివృద్ధిలో దూసుకెళ్తుందన్న మంత్రులు

Samajika Nyaya Bheri: శ్రీకాకుళం నుంచి వైఎస్సార్‌సీపీ బస్సుయాత్ర ప్రారంభం - ఏపీ అభివృద్ధిలో దూసుకెళ్తుందన్న మంత్రులు

Pawan Kalyan In F3 Movie: 'ఎఫ్ 3'లో పవర్ స్టార్ - పవన్ సహా టాలీవుడ్ టాప్ హీరోలను వాడేసిన అనిల్

Pawan Kalyan In F3 Movie: 'ఎఫ్ 3'లో పవర్ స్టార్ - పవన్ సహా టాలీవుడ్ టాప్ హీరోలను వాడేసిన అనిల్

PM Modi In ISB: 25 ఏళ్లకు వృద్ధి మ్యాప్‌ రెడీ- ఐఎస్‌బీ హైదరాబాద్‌లో ప్రధానమంత్రి మోదీ

PM Modi In ISB: 25 ఏళ్లకు వృద్ధి మ్యాప్‌ రెడీ- ఐఎస్‌బీ హైదరాబాద్‌లో ప్రధానమంత్రి మోదీ