JC Prabhakar Reddy: పల్లె రఘునాథ్ రెడ్డి వార్డు మెంబర్‌గా కూడా గెలవలేడు, టికెట్ ఇవ్వొద్దు: జేసీ ప్రభాకర్ రెడ్డి
పుట్టపర్తి నియోజకవర్గంలో జెసి ప్రబాకర రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేకెత్తిస్తున్నాయి.జిల్లాలో మెజార్టీ నేతలను మార్చకపోతే వచ్చే ఇక అంతే సంగతులు అంటూ చేసిన వ్యాఖ్యలు అలజడిని రేపుతున్నాయి.
![JC Prabhakar Reddy: పల్లె రఘునాథ్ రెడ్డి వార్డు మెంబర్‌గా కూడా గెలవలేడు, టికెట్ ఇవ్వొద్దు: జేసీ ప్రభాకర్ రెడ్డి Palle Raghunatha Reddy cant even win as ward member says JC Prabhakar Reddy JC Prabhakar Reddy: పల్లె రఘునాథ్ రెడ్డి వార్డు మెంబర్‌గా కూడా గెలవలేడు, టికెట్ ఇవ్వొద్దు: జేసీ ప్రభాకర్ రెడ్డి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/28/80fba883c0ab7fc8a2b10f91c8ac85d1_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Tadipatri Municipal Chairman JC Prabhakar Reddy: తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్, టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి మరోసారి టీడీపీ నేతలపైనే హాట్ కామెంట్స్ చేశారు. పుట్టపర్తి నియోజకవర్గంలోనే కొండకమర్లలో టీడీపీ నేత గృహప్రవేశానికి వచ్చిన జేసీ ప్రభాకర్ రెడ్డి కార్యకర్తల వల్లే నేడు టీడీపీ నిలబడిందని, అలాంటి పార్టీకి మళ్లీ పూర్వవైభవం రావాలంటే కచ్చితంగా నేతలను మార్చాల్సిదే అంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి.
మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి (Palle Raghunatha Reddy) ఈసారి వార్డు మెంబర్ గా కూడా గెలవలేడని, అలాంటి వ్యక్తికి మళ్లీ టీడీపీ టికెట్ కేటాయిస్తే ఇక అంతే సంగతులు అని అన్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. ఒక్క పుట్టపర్తి కాదు జిల్లాలో మెజార్టీ నేతలను మార్చాల్సిందే అంటూ హాట్ కామెంట్స్ చేశారు. తాడిపత్రిలో కూడా అవసరమైతే మాకంటే మంచి అభ్యర్థి వస్తే తాను, తన కుమారుడు సైతం పోటీ నుంచి తప్పుకొంటాం అంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఏప్రిల్ నెలాఖరు నుంచి సేవ్ కార్యకర్త అంటూ జిల్లా వ్యాప్తంగా తిరిగి కార్యకర్తల్లో ధైర్యం నింపుతాను అన్నారు.
చంద్రబాబును సీఎం చేద్దాం..
2024లో చంద్రబాబును ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యంగా తన కార్యక్రమాలు ఉంటాయన్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. మూడేళ్లలో నేతలెవ్వరూ క్షేత్రస్థాయిలో లేరని, కార్యకర్తలు మాత్రమే గ్రౌండ్ లెవల్లో పోరాటం చేశారని, వారిని విస్మరిస్తే అంతే అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే అనేకసార్లు చంద్రబాబుకు కూడా ఈ విషయాలను చెప్పామని, ఇక నుంచి చెప్పేది ఏమి ఉండదని, క్షేత్రస్థాయిలో గ్రామగ్రామం తిరిగి పార్టీ కేడర్ ను పటిష్ఠం చేసేవిదంగా తన కార్యకర్రమాలు ఉంటాయని చేసిన వ్యాఖ్యలు మళ్ళీ టీడీపీలో అలజడి రేపుతున్నాయి.
ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా జేసీ కుటుంబానికి వ్యతిరేకంగా ఇతర నేతలంతా ఒక్కటవుతున్నారు. ఎక్కడైతే జేసీ ఇతర నేతలకు వ్యతిరేకంగా గళం విప్పుతున్నారో అక్కడ.... ముందు ఏదో విధంగా జేసీ కుటుంబంతో తలపడిన వారిపైనే టార్గెట్ గా జేసీ బ్రదర్స్ రాజకీయాలు చేస్తున్నారంటూ ఇతర నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికే ప్రభాకర్ చౌదరి, కాలువ శ్రీనివాస్, పల్లె రఘునాథ్ రెడ్డి లాంటి నేతలంతా జేసీ వ్యాఖ్యలపై అధిష్ఠానానికి పిర్యాదు చేశారు.
ఘాటుగా స్పందించిన పల్లె రఘునాథ్ రెడ్డి
జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై పల్లె రఘునాథ్ రెడ్డి కూడా తీవ్రంగానే స్పందించారు. నువ్వు చెప్తే చెప్పించుకొనే స్థాయిలో టీడీపీ నేతలు కానీ, టీడీపీ కేడర్ గానీ లేదంటూ వ్యాఖ్యానించారు. ఇతర నియోజకవర్గాల్లో అనవసర అలజడులు సృష్టించకుండా నీ తాడిపత్రిలో గెలువు అంటూ పల్లె ఫైర్ అయ్యారు. పచ్చగా వున్న పార్టీలో నీ వ్యాఖ్యలు వల్ల గ్రూపులు పెరిగి పార్టీ నాశనానికి కారణం అవుతున్నావంటూ జేసీ ప్రభాకర్ రెడ్డిపై పల్లె విరుచుకు పడ్డారు. జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలు....సేవ్ కార్యకర్త అంటూ ప్రకటించిన ప్రోగ్రాం ను ఏవిదంగా కట్టడి చేయాలన్న దానిపై జిల్లానేతలు ఆలోచనలో పడ్డారు. మరి అదిష్ఠానం ఏవిదంగా స్పందిస్తుందో చూడాలి మరి.
Also Read: Sattenapalli TDP : సత్తెనపల్లి టీడీపీలో భగ్గుమన్న వర్గ విభేదాలు, టెంట్లు కూల్చేసి ఒకరిపై ఒకరు దాడి!
Also Read: Nellore: వైసీపీ నేతపై సంచలన ఆరోపణలు, నెల్లూరు జిల్లాలో తీవ్ర కలకలం
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)