By: ABP Desam | Updated at : 27 Mar 2022 08:44 AM (IST)
ప్రతీకాత్మక చిత్రం
Nellore: నెల్లూరు జిల్లాలో అధికార పార్టీలో తీవ్ర కలకలం రేగింది. ఏపీ ఫిషరీస్ కో ఆపరేటివ్ సొసైటీ (AP Fisheries Cooperative Society) ఛైర్మన్ కొండూరు అనిల్ బాబుపై కిడ్నాప్, రేప్ ఆరోపణలు రావడంతో ఒక్కసారిగా అందరూ ఉలిక్కి పడ్డారు. గతంలో గుంటూరు జిల్లాలో జరిగిన ఘటనకు అనిల్ బాబు కారకుడంటూ ఇప్పుడు కొత్తగా ఫిర్యాదు నమోదు అయింది. దీంతో ఆయనపై విచారణ జరుపుతున్నారని, అరెస్ట్ చేస్తున్నారనే వార్తలొచ్చాయి.
అసలేం జరిగింది..?
గుంటూరు జిల్లా పేరేచర్లకు చెందిన ఎస్సీ బాలిక అత్యాచారం కేసులో రోజుకో కొత్త విషయం వెలుగు చూస్తోంది. ఈ కేసులో ఇప్పటికే 64 మందిని అరెస్టు చేసిన పోలీసులు... తాజాగా ఎస్సీ కమిషన్ ఆదేశాల ప్రకారం.. నెల్లూరు జిల్లా వైసీపీకి చెందిన అనిల్ బాబుని విచారించేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. 2021 జూన్ నెలలో గుంటూరు జిల్లా పేరేచర్లకు చెందిన తల్లి కూతురు కొవిడ్‌తో బాధపడుతూ చికిత్స నిమిత్తం గుంటూరు జీజీహెచ్ లో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ తల్లి మృతి చెందగా, బాలిక ఒంటరిగా మిగిలింది. ఈ క్రమంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలికను ఓ మహిళ అక్కడినుంచి తీసుకెళ్లింది. మెల్లగా పరిచయం పెంచుకుని, నాటు వైద్యంతో కరోనాను తగ్గిస్తానని నమ్మబలికి ఆ అమ్మాయిని తనతోపాటు తీసుకెళ్లింది. అయితే ఆ అమ్మాయిని సదరు మహిళ వ్యభిచార కూపంలో దింపింది. ఏపీతోపాటు హైదరాబాద్ కి కూడా ఆ అమ్మాయిని తీసుకెళ్లినట్టు సమాచారం. అదే సమయంలో నెల్లూరు జిల్లాకు చెందిన అనిల్ బాబు అనే వైసీపీ నాయకుడు ఓ నర్సు ద్వారా ఆ అమ్మాయికి పరిచయం అయ్యాడని, ఆయన సమక్షంలో కూడా ఆ అమ్మాయిపై అత్యాచారం జరిగిందనేది తాజా ఆరోపణ.
ఇంత లేటుగా ఎందుకు..?
ఏడాది క్రితం జరిగిన ఈ ఘటనలో ఇప్పుడే వైసీపీ నాయకుడి పేరు ఎందుకు బయటికొచ్చిందనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. అప్పట్లోనే ఆ బాలిక వైసీపీ నాయకుడిపై ఫిర్యాదు చేసినా.. సదరు నాయకుడు రాజకీయ పలుకుబడితో కేసులో తన పేరు లేకుండా చేసుకున్నాడని అంటున్నారు. ప్రస్తుతం అనిల్ బాబు వ్యవహారంపై ఎస్సీ కమిషన్ కి ఫిర్యాదు అందినట్టు తెలుస్తోంది. దీంతో నెల్లూరు జిల్లాలో కలకలం రేగింది.
ఇదే విషయంపై టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వంగలపూడి అనిత కూడా తీవ్ర స్థాయిలో ద్వజమెత్తారు. అనిల్ బాబుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆమె ట్విట్టర్లో ఉంచిన పోస్టింగ్ లు కలకలం రేపాయి. వైసీపీ నాయకులతో అనిల్ బాబు దిగిన ఫొటోల్ని కూడా ఆమె తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
ఒక్క ఛాన్స్ ఇచ్చిన నేరానికి రాష్ట్రాన్ని రావణ కాష్టం చేస్తున్నారు వైకామా(పా) నాయకులు.. పాలించడానికి వీళ్ళకి అధికారం ఇస్తే .. వీళ్లేమో మహిళల తాళిబొట్లు తెంపడం, అత్యాచారాలు చేయడం, హత్యలు చేయడం.. గుంటూరు జిల్లా పెరేచర్ల గ్రామానికి చెందిన 14 సంవత్సారాల బాలికను
— Anitha Vangalapudi (@Anitha_TDP) March 26, 2022
(1/2) pic.twitter.com/z6fbRzLbuE
అనిల్ బాబుకి వ్యతిరేకంగా ఆందోళనలు..
గుంటూరు జిల్లాకు చెందిన దళిత చిన్నారిపై అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నెల్లూరు జిల్లా నేత అనిల్ బాబుని వెంటనే నామినేటెడ్ పదవినుంచి తొలగించాలంటూ నెల్లూరు జిల్లాకు చెందిన టీడీపీ ఎస్సీ సెల్ విభాగం ఆందోళన చేపట్టింది. పోతిరెడ్డిపాళెంలో అంబేద్కర్ విగ్రహం ఎదుట నాయకులు నిరసన చేపట్టారు. అనిల్ బాబుని కేసు నుంచి తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అనిల్ బాబుకి మద్దతుగా మత్స్యకారులు..
అయితే, అనిల్ బాబుకి మద్దతుగా మత్స్యకార సంఘం నాయకులు కూడా ప్రెస్ మీట్ పెట్టడం విశేషం. అనిల్ బాబు ఆధ్వర్యంలో మత్స్యకారులకు అనేక ప్రయోజనాలు జరిగాయని, ఆయనపై కొంతమంది కావాలనే ఆరోపణలు చేస్తున్నారని అంటున్నారు నెల్లూరు జిల్లా మత్స్యకార నాయకులు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందని అన్నారు.
ఇంత జరుగుతున్నా నెల్లూరు జిల్లా అధికార పార్టీ నాయకులెవరూ ఈ విషయంపై స్పందించలేదు. కనీసం అనిల్ బాబుపై వస్తున్న ఆరోపణలను కూడా వారు ఖండించలేదు.
Rains in AP Telangana: తీవ్రరూపం దాల్చుతోన్న అల్పపీడనం - భారీ వర్షాలతో ఏపీ, తెలంగాణకు రెడ్, ఆరెంజ్ అలర్ట్ వార్నింగ్
Nellore News : నెల్లూరు జిల్లాలో దారుణం, తల్లి, కూతురు అనుమానాస్పద మృతి, భర్త ఆత్మహత్య!
SSLV Launch: అంతరిక్షంలోకి దూసుకెళ్లిన ఎస్ఎస్ఎల్వీ డి1 రాకెట్, ఆఖరి స్టేజ్‌లో ట్విస్ట్ - ఏం జరిగిందంటే
Rains in AP Telangana: నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం, ఏపీలో ఆ జిల్లాల్లో భారీ వర్షాలు - తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్ వార్నింగ్
Rains in AP Telangana: ఏపీ, తెలంగాణలో ఆ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు - IMD ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ
TTD: తిరుమలలో మూడు రోజులపాటు ఆర్జిత సేవలు రద్దు, కీలక ప్రకటన చేసిన టీటీడీ
Rashmika New Movie : అక్కినేని హీరోతో తొలిసారి - మహేష్ దర్శకుడు తీయబోయే సినిమాలో?
Road Accident: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం, ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి దుర్మరణం!
ఫైనల్స్‌లో పోరాడి ఓడిన టీమిండియా - రజతంతోనే సరి!