అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

MLA Arthur: ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేస్తే కోట్లు ఇస్తామన్నారు - ఎమ్మెల్యే ఆర్థర్ సంచలన వ్యాఖ్యలు

ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ వ్యతిరేక ఓటు వేస్తే కోట్లు ఇస్తామని ఆఫర్ చేశారని ఆయన తెలిపారు. దీనికి సంబంధించి తన కుమారునికి ఫోన్ చేశారని వెల్లడించారు.

ఇటీవల ఏపీ రాజకీయాల్లో కీలకంగా మారిన ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. ఆ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కోసం తనకు కూడా ఆఫర్ అందినట్లుగా నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ వ్యతిరేక ఓటు వేస్తే కోట్లు ఇస్తామని ఆఫర్ చేశారని ఆయన తెలిపారు. దీనికి సంబంధించి తన కుమారునికి ఫోన్ చేశారని వెల్లడించారు. అయితే, తన తండ్రి అందుకు ఒప్పుకోడని తన కుమారుడు తిరసకతెలిపారు. ఇది ఇంతటితో ఆగలేదన్నారు.

తొలుత జనసేన ఎమ్మెల్యే వ్యాఖ్యలు
వైఎస్ఆర్ సీపీకి సన్నిహితంగా ఉంటున్న జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రావు మూడు రోజుల క్రితం తొలుత ఇలాంటి వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేయాలని తనకే మొదటి ఆఫర్ వచ్చిందని తెలిపారు. క్రాస్ ఓటింగ్ చేస్తే తనకు ఏకంగా రూ.10 కోట్లు ఇస్తామన్నారని చెప్పారు. తనకంటే ముందు మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు వచ్చిందని ఆరోపణ చేశారు. క్రాస్ ఓటింగ్ చేస్తే టీడీపీలో మంచి పొజిషన్ ఇస్తానని అన్నారని చెప్పారు. తన దగ్గర డబ్బు లేదని, అలాంటి పరిస్థితుల్లో తాను సైలెంట్‌గా క్రాస్ ఓట్ చేసి డబ్బు తీసుకొని ఉండొచ్చని అన్నారు. కానీ, పరువు పోతుందని తాను ఆ పని చేయలేదని మాట్లాడారు. రాజోలు నియోజకవర్గంలోని ఓ సభలో మాట్లాడుతూ రాపాక ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియో బాగా వైరల్ అయింది.

ఈ వీడియో గురించి రాపాక వరప్రసాద్ ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. తన వద్దకు ఈ ఆఫర్ ను ఉండి ఎమ్మెల్యే శివరామరాజు తీసుకొచ్చారని చెప్పారు. రూ.10 కోట్ల ఆఫర్ నేరుగా ఇవ్వలేదని, క్రాస్ ఓటింగ్‌లో అసలు డబ్బుల ప్రస్తావనే రాలేదని వివరణ ఇచ్చారు. మరి పది కోట్లు వస్తుందని స్వయంగా అన్నారు కదా అని ప్రశ్నించగా, అదేదో తాను సుమారుగా చెప్పానని అన్నారు. ఈ విషయాన్ని తాను ఎక్కడా చర్చించలేదని, మీడియాకు కూడా చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. రాజోలులో జరిగిన ఓ ప్రైవేటు మీటింగ్ లో వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలతో తాను ఈ విషయాన్ని పంచుకున్నానని అన్నారు. దీన్ని ఎవరో వీడియో తీసి వైరల్ చేశారని చెప్పారు.

నేను రాపాకకు ఏ ఆఫర్ చేయలేదు - ఉండి ఎమ్మెల్యే రామరాజు
తాను ఏనాడూ రాపాక వరప్రసాద్ కు ఏ ఆఫర్ గానీ, డబ్బుల ఆఫర్ గానీ చేయలేదని ఉండి ఎమ్మెల్యే రామరాజు స్పష్టత ఇచ్చారు. రాపాక వీడియో వైరల్ అయిన అనంతరం కాసేపటికి ఎమ్మెల్యే రామరాజు స్పందించారు. టీడీపీకి ఉన్న 23 మంది ఎమ్మెల్యేల్లో ఒకరిద్దరు వేయకపోయినా వైఎస్ఆర్ సీపీకి చెందిన ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై అసంతృప్తితో టీడీపీకి ఓటు వేస్తారని భావించామని అన్నారు. తాము అనుకున్నట్లుగానే టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థికి ఓటు వేశారని చెప్పారు. ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, తానూ ఎప్పుడూ స్నేహపూర్వకంగానే మాట్లాడుకుంటామని, అసెంబ్లీ లాబీలో అప్పుడప్పుడు మాట్లాడుకుంటామని చెప్పారు. అయితే, ఆయన్ను తాను ఎప్పుడూ వ్యక్తిగతంగా కలవలేదని ఉండి ఎమ్మెల్యే రామరాజు స్పష్టం చేశారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vasamsetti Subhash: తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
Comedian Ali: టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
Crime News: 'అక్కా.. టీచర్ మా ఒంటిపై చేతులు వేస్తున్నారు' - గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌పై అవగాహనతో బట్టబయలైన కీచక టీచర్ నిర్వాకం
'అక్కా.. టీచర్ మా ఒంటిపై చేతులు వేస్తున్నారు' - గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌పై అవగాహనతో బట్టబయలైన కీచక టీచర్ నిర్వాకం
Game Changer: 'గేమ్ చేంజర్'లో మూడో పాట  వచ్చేది ఆ రోజే... గెట్ రెడీ గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్!
'గేమ్ చేంజర్'లో మూడో పాట  వచ్చేది ఆ రోజే... గెట్ రెడీ గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఈ రిజల్ట్‌తో ఫ్యూచర్ క్లియర్..  కాంగ్రెస్‌, BJPకి ఆ శక్తి లేదుఫ్లైట్ లేట్ అయితే ఎయిర్ లైన్ సంస్థ ఇవి ఇవ్వాల్సిందేపెర్త్ టెస్ట్‌లో రెండో రోజు దుమ్ము లేపిన టీమిండియావయనాడ్‌లో భారీ మెజార్టీతో గెలిచిన ప్రియాంక గాంధీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vasamsetti Subhash: తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
Comedian Ali: టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
Crime News: 'అక్కా.. టీచర్ మా ఒంటిపై చేతులు వేస్తున్నారు' - గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌పై అవగాహనతో బట్టబయలైన కీచక టీచర్ నిర్వాకం
'అక్కా.. టీచర్ మా ఒంటిపై చేతులు వేస్తున్నారు' - గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌పై అవగాహనతో బట్టబయలైన కీచక టీచర్ నిర్వాకం
Game Changer: 'గేమ్ చేంజర్'లో మూడో పాట  వచ్చేది ఆ రోజే... గెట్ రెడీ గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్!
'గేమ్ చేంజర్'లో మూడో పాట  వచ్చేది ఆ రోజే... గెట్ రెడీ గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్!
Elon Musk News: భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
Pushpa 2: పుష్పరాజ్ అడ్డాగా మారబోతున్న తెలంగాణ... ఆర్ఆర్ఆర్, కల్కి రికార్డ్స్ బద్దలయ్యేలా నైజాంలో భారీ రిలీజ్!?
పుష్పరాజ్ అడ్డాగా మారబోతున్న తెలంగాణ... ఆర్ఆర్ఆర్, కల్కి రికార్డ్స్ బద్దలయ్యేలా నైజాంలో భారీ రిలీజ్!?
Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో 8కి చేరిన మృతుల సంఖ్య, అక్కడ అధిక ప్రమాదాలకు కారణాలు ఇవే
అనంతపురం రోడ్డు ప్రమాదంలో 8కి చేరిన మృతుల సంఖ్య, అక్కడ అధిక ప్రమాదాలకు కారణాలు ఇవే
Yashasvi Jaiswal Century: సిక్సర్‌తో సెంచరీ సాధించిన భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్
సిక్సర్‌తో సెంచరీ సాధించిన భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్
Embed widget