అన్వేషించండి

Kurnool News: కర్నూలు జిల్లా కోర్టు సంచలన తీర్పు - ఇద్దరు దోషులకు ఉరిశిక్ష, ఒకరికి యావజ్జీవం

Kurnool News: జంట హత్యల కేసులో ఇద్దరికి ఉరి శిక్ష, మరొకరికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. మహిళలపై నేరాలు చేసే వారికి ఈ కేసులో పడిన శిక్షలు భయం కలిగించాలని జిల్లా ఎస్పీ వ్యాఖ్యానించారు.

Kurnool District News: కర్నూలు జిల్లా 4వ పట్టణ పోలీసు స్టేషన్ లో నమోదైన కేసులో ముద్దాయిలకు కర్నూలు జిల్లా నాలుగో అదనపు కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. జంట హత్యల కేసులో ఇద్దరికి ఉరి శిక్ష, మరొకరికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. మహిళలపై నేరాలు చేసే వారికి ఈ కేసులో పడిన శిక్షలు భయం కలిగించాలని జిల్లా ఎస్పీ వ్యాఖ్యానించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను కర్నూలు ఎస్పీ జి. కృష్ణకాంత్ వివరించారు.

డీజీపీ కెవీ రాజేంద్రనాథ్ రెడ్డి ఆదేశాలతో మహిళలకు సంబంధించిన కేసులలో త్వరితగతిన కేసు ట్రయల్స్ పూర్తి చేసి శిక్షలు పడేవిధంగా చర్యలు చేపట్టామని అన్నారు. ‘‘కర్నూలు జిల్లా కల్లూరు మండలం, చెన్నమ్మ సర్కిల్ లో గత సంవత్సరం జంట హత్యల కేసులు నమోదయ్యాయి. వధువును, ఆమె తల్లిని దారుణంగా హత్య చేసి, వధువు తండ్రిపై హత్యాయత్నం చేశారు. గత ఏడాది  తెలంగాణ, వనపర్తి జిల్లాకు చెందిన రుక్మిణికి కర్నూలుకు చెందిన శ్రవణ్ తో వివాహం జరిగింది.

వివాహం అయిన 3 రోజుల తరువాత వధువు రుక్మిణీ తల్లిదండ్రులు అయిన వెంకటేష్, రమాదేవి.. పెళ్ళి కుమారుడైన శ్రవణ్, అతని తల్లిదండ్రులు వర ప్రసాద్, కృష్ణవేణిలతో శ్రవణ్ కుమార్ నపుంసకుడని గొడవపడ్డారు. ఈ విషయంపై ముద్దాయిలు వీరి కుటుంబం పరువు పోతుందని పెళ్ళికూతురు, ఆమె తల్లితండ్రులను హతమార్చాలని నిర్ణయించుకున్నారు. దీంతో కర్నూలు టౌన్ చింతలముని నగర్ లోని ఇంటి వద్ద కత్తులతో పొడవగా వధువు రుక్మిణి, ఆమె తల్లి రమాదేవి అక్కడికక్కడే చనిపోయారు. వధువు తండ్రి వెంకటేశ్ తీవ్రంగా గాయపడ్డాడు. 


Kurnool News: కర్నూలు జిల్లా కోర్టు సంచలన తీర్పు - ఇద్దరు దోషులకు ఉరిశిక్ష, ఒకరికి యావజ్జీవం

గాయపడిన వధువు తండ్రి వెంకటేష్ ఫిర్యాదు మేరకు, కర్నూలు నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ లో Cr.No.62/2023 U/s 498 (A), 302, 307 R/w 34 IPC గా కేసు నమోదు చేశారు. తీవ్ర రక్త స్రావ గాయాలతో ఉన్న పెళ్ళి కూతురు తండ్రి వెంకటేష్ ని కర్నూలు 4 వ పట్టణ పోలీసులు హాస్పిటల్ తీసుకువెళ్ళి మెరుగైన వైద్యం అందించారు. ముద్దాయిలైన శ్రవణ్ కుమార్, వరప్రసాద్, కృష్ణవేణిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. ముద్దాయిలను జైల్లోనే పెట్టి ట్రయల్ పూర్తి చేయడం జరిగింది. 

ఈ కేసులో 90 రోజులలో విచారణ పూర్తి చేసి, చార్జ్ షీట్ ను కర్నూలు డీఎస్పీ విజయశేఖర్, కర్నూలు నాలుగో పట్టణ సీఐ పి. శంకరయ్యను జిల్లా ఎస్పీ అభినందించారు. ఈ కేసును నాలుగో జిల్లా అదనపు కోర్టు జడ్జి విచారణ పూర్తి చేసి ఫిబ్రవరి 21న తీర్పు ఇచ్చారు.  

శిక్షలు ఇవీ..
న్యాయమూర్తి వెల్లడించిన తీర్పు ప్రకారం ముద్దాయి A-1 శ్రవణ్ కుమార్, A-2 వరప్రసాద్ అలియాస్ ప్రసాద్ కు ఉరి శిక్ష వేశారు. A-3 కృష్ణవేణికి యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. మహిళలపై నేరాలకు పాల్పడేవారికి ఈ కేసు గుణపాఠంగా, కనువిప్పు కలిగేలా చేసిందని జిల్లా ఎస్పీ జి.కృష్ణకాంత్ తెలిపారు. ఈ కేసును 10 నెలల్లోనే దర్యాప్తు, ట్రయల్ పూర్తి చేయించి, సాక్షులను, సాక్ష్యా ధారాలను ఎప్పటికప్పుడూ హాజరు పరచిన పోలీసు అధికారులను, ఈ కేసు వాదించిన పబ్లిక్ ప్యాసిక్యూటర్ వై. ప్రకాష్ రెడ్డిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

టాప్ హెడ్ లైన్స్

Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
AP NEET MBBS Cutoff Ranks:నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
YSRCP Protest On DSC Irregularities: డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
Pawan Kalyan : మంగళగిరిలోనే ఉన్న మంత్రివర్గ సమావేశానికి హాజరుకాని పవన్ కల్యాణ్‌- కూటమిలో ఏం జరుగుతోంది?
మంగళగిరిలోనే ఉన్న మంత్రివర్గ సమావేశానికి హాజరుకాని పవన్ కల్యాణ్‌- కూటమిలో ఏం జరుగుతోంది?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
GHMC Elections: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
Chalasani Anjaneyulu: విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
Medical Student Brain Dead: రాజమండ్రి హిట్ అండ్ రన్ కేసులో విషాదం.. మెడికల్ విద్యార్థినికి బ్రెయిన్ డెడ్
రాజమండ్రి హిట్ అండ్ రన్ కేసులో విషాదం.. మెడికల్ విద్యార్థినికి బ్రెయిన్ డెడ్
PMFBY Last Date: రైతులకు అలర్ట్.. పంటల బీమా నమోదు గడువు పెంపు.. ఇలా అప్లై చేసుకోండి!
రైతులకు అలర్ట్.. పంటల బీమా నమోదు గడువు పెంపు.. ఇలా అప్లై చేసుకోండి!
IPL Hardik Trade: హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
Vishwanath And Sons Trailer: సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ వచ్చేసిందోచ్... హిట్టు కళ కనబడుతోందిగా
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ వచ్చేసిందోచ్... హిట్టు కళ కనబడుతోందిగా
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Care Health Insurance: తెలంగాణలో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా, ప్రజలకు ఇబ్బందులే... షాక్ ఇచ్చిన టీఎస్‌హెచ్‌ఏ!
తెలంగాణలో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా, ప్రజలకు ఇబ్బందులే... షాక్ ఇచ్చిన టీఎస్‌హెచ్‌ఏ!
Embed widget