అన్వేషించండి

Jagananna Thodu: వడ్డీలేని రుణంతో చిరు వ్యాపారుల ముఖాల్లో చిరునవ్వు, నగదు జమ కార్యక్రమంలో సీఎం జగన్

Jagananna Thodu: వడ్డీలేని రుణ సాయంతో చిరు వ్యాపారుల ముఖాల్లో చిరునవ్వు వెల్లివిరుస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు.

Jagananna Thodu: వడ్డీలేని రుణ సాయంతో చిరు వ్యాపారుల ముఖాల్లో చిరునవ్వు వెల్లివిరుస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. జగనన్న తోడు పథకంలో భాగంగా నేడు లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జగనన్న తోడు నిధులను విడుదల చేశారు. 5,10,412 మంది లబ్ధిదారులకు రూ. 560.73 కోట్లు విడుదల చేసినట్లు చెప్పారు. చిరు వ్యాపారులకు మంచి చేయాలన్న ఉద్దేశంతోనే జగనన్న తోడు పథకాన్ని ప్రారంభించినట్లు చెప్పుకొచ్చారు. ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ. 10 వేలు అందివ్వడంతో పాటు దానిపై వడ్డీ కూడా ప్రభుత్వమే చెల్లిస్తున్నట్లు జగన్ పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా లబ్ధి పొందే వారిలో దాదాపు 85 శాతం మంది మహిళలో ఉన్నారని వెల్లడించారు. సంక్షేమ పథకాల విషయంలో దేశం మొత్తం సంఖ్య కంటే.. ఏపీలో సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఎక్కువగా ఉండటం ఒక అరుదైన ఘటన అని పేర్కొన్నారు. 

వరుసగా నాలుగో ఏడాదిలోనూ నిధుల విడుదల

అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా నాలుగో ఏడాదిలోనూ జగనన్న తోడు నిధులు ఇచ్చామని పేర్కొన్నారు. ' దేశంలో ఎక్కడా ఇన్ని లక్షలమందికి ఈ రకంగా మంచి చేయడం లేదు. ఇన్ని లక్షలమంది చిరువ్యాపారులకు ఎక్కడా ఇంత మేలు జరడం లేదు. దేశం మొత్తం ఇస్తున్న రుణాలు కంటే ఆంధ్ర రాష్ట్రంలో లబ్ధిదారుల సంఖ్య అంతకన్నా ఎక్కువ ఉంది. ఈ పథకాన్ని పగడ్బందీగా నడుపుతున్న బ్యాంకర్లు, సచివాలయాల వ్యవస్థ, మెప్మా తదితర శాఖలకు అభినందనలు. పేదవాడికి మంచి జరిగేలా చేసే యజ్ఞం సత్ఫలితాలను ఇస్తోంది. ఇంతవరకూ 15.87 లక్షలమంది చిరు వ్యాపారులకు మంచి జరిగింది. హస్త కళాకారులకూ ఈ పథకం ద్వారా మేలు జరిగింది. ఈ విడతలో 5,10,412 మందిలో 4.54 లక్షల మంది సకాలంలో రుణాలు చెల్లించి, మళ్లీ రూ.10 వేలు, ఆపైన రుణాలుగా అందుకుంటున్నారు. సకాలానికి కట్టిన వారికి ఇచ్చే రుణాలు రూ.10 వేల నుంచి రూ.13వేల వరకూ పెంచాం. ఇంతవరకూ 15.87 లక్షల మంది చిరు వ్యాపారులకు రూ. 2,955.79 కోట్ల రుణాలు ఇచ్చాం. వీరిలో తిరిగి చెల్లించి.. మళ్లీ మళ్లీ రుణాలు పొందిన వారు దాదాపుగా 13.29 లక్షల మంది ఉన్నారు. ఇప్పటివరకూ వీరి తరఫున ప్రభుత్వం చెల్లించిన వడ్డీ రూ.74.69 కోట్లు' అని ముఖ్యమంత్రి తెలిపారు.

ఎక్కువ మంది లబ్ధిదారులు మహిళలే

'చిరు వ్యాపారులు సమాజ సేవ చేస్తున్నారు. ఒకరి మీద ఆధారపడకుండా.. వారు జీవనోపాధిని వారు చూసుకుంటున్నారు. అవకాశం వస్తే మరో ఒకరిద్దరికి ఉపాధి కూడా కల్పిస్తున్నారు. అందుకనే వారికి తోడుగా నిలబడాలన్న ఆలోచన వచ్చింది. చేతివృత్తుల వారికీ పథకం వర్తిస్తోంది. రూ. 10వేల రుణంతో ఈ కార్యక్రమం మొదలైతే, క్రమం తప్పకుండా చెల్లించేవారికి మరుసటి ఏడాది వేయి పెంచమని, ఆ తర్వాత ఏడాది మరో వేయి పెంచమని, రూ.13వేల వరకూ ఇవ్వమని చెప్పాం. పాదయాత్రలో స్వయంగా నేను కళ్లారా చూశారు. చిరు వ్యాపారుల కష్టాలు చూశాను. వేయి రూపాయలు రోజుకు రుణం ఇస్తే.. వంద కట్‌ చేసుకుని, సాయంత్రానికి మళ్లీ వేయి రూపాయలు తీసుకునే పరిస్థితులు ఉండేవి. అలాంటి వారికి వ్యాపారాలు చేసుకోవడం చాలా ఇబ్బందిగా ఉండేది. పెట్టుబడి వారికి పుట్టేది కాదు. రూ. 10ల వడ్డీకి కూడా రుణాలు తీసుకోవాల్సిన పరిస్థితులు ఉండేవి. ఈ పరిస్థితులన్నీ మార్చాలన్న ఉద్దేశంతో జగనన్న తోడు పథకం పుట్టింది. జగనన్న తోడు ద్వారా లబ్ధిపొందిన వారిలో 80శాతం అక్క చెల్లెమ్మలే. లబ్ధిదారుల్లో 80 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన వారే ఉన్నారు. సామాజికంగా అట్టడుగున్న ఉన్న వారికి ఈ పథకం ఉపయోగపడుతుంది. ఈ కార్యక్రమం ద్వారా మంచి జరగాలని మనసారా కోరుకుంటున్నాను. ఎవరికైనా ఈ పథకం వర్తించని పరిస్థితి ఉంటే.. వెంటనే సచివాలయ వ్యవస్థను సంప్రదించండి. అక్కడున్న సిబ్బంది మీకు తోడుగా నిలుస్తారు. వాలంటీర్లను కోరినా.. వారు దరఖాస్తు చేయడంలో మీకు తోడుగా నిలుస్తారు. ఏ ఒక్కరూ కూడా మిగిలిపోకూడదు, ప్రతి ఒక్కరికీ మంచి జరగాలనే ప్రభుత్వం తపన పడుతోంది' అని వ్యాఖ్యానించారు.

టాప్ హెడ్ లైన్స్

YS Jagan Kurnool Tour: కర్నూలులో వైఎస్ జగన్ పర్యటన! ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్టుపై నిప్పులు! జైల్లో తనను అవమానించారని కామెంట్స్!
కర్నూలులో వైఎస్ జగన్ పర్యటన! ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్టుపై నిప్పులు! జైల్లో తనను అవమానించారని కామెంట్స్!
Breaking News:
"నన్ను జైల్లో అవమానించారు" కర్నూలు పర్యటనలో జగన్ విమర్శలు 
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Breaking News: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adilabad Latest News: నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Embed widget