By: ABP Desam | Updated at : 20 Apr 2022 07:46 AM (IST)
విచిత్ర హోలీ
కర్నూలు జిల్లా ఆస్పరి మండలం చిన్నహోతూర్ గ్రామంలో జరిగే హంపయ్య పుణ్యం రోజు జరిగే రథోత్సవం చాలా స్పెషల్. ఈ వేడుకలో రెండు రోజులు పార్వతి పరమేశ్వరుని కళ్యాణత్సోవం ఉంటుంది. అనంతరం పూజారికి పూనకం వచ్చి వీరభద్ర స్వామి వేషధారణలో ఊగిపోతాడు.
పూనకం వచ్చిన పూజారి భక్తుల సముహంలోకి వచ్చి ఎవరని పడితే వాళ్ళను కాలితో తంతాడు. ఎవరికైతే పూజారి కాలి తగులుతుందో వాళ్లకు తిరుగు ఉండదని భక్తుల విశ్వాసం. ఎడాది పాటు మంచి జరుగుతుందని భావిస్తారు.
ఈ తతంగం తర్వాత గ్రామ ప్రజలు మొత్తం హోలీ ఆడుతారు. అయితే ఇందులో రంగులన్నీ వాడరు. ఏదో ఒక రంగును మాత్రమే ఉపయోగిస్తారు. ఈసారి ఎరుపు రంగుతో హోలీ ఆడారు ఆ గ్రామ ప్రజలు. ముందు రంగు కలిపిన నీళ్లతో నీటి కుండలు ఇంటి ముందు పెడతారు. మనమంతా ఒక్కడే అన్న భావన కలిగించేందుకు ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నట్టు గ్రామస్తులు చెప్తున్నారు.
ఇలా గ్రామం మొత్తం ఎరుపు రంగుతో తడిసి ప్రజలు ఆనందత్సోవంలో మునిగి తెలుతారు. ఈ కార్యక్రమాన్ని చూడడానికి చుట్ట పక్కల గ్రామాలు వేల సంఖ్యలో వస్తారు. అయితే కరోనా నేపథ్యంలో ఈసారి చాలా తక్కువ మందినే పోలీసులు అనుమతి ఇచ్చారు.
స్త్రీ వేషధారణలో కుంభ హారతి
అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటిగా విరాజిల్లుతున్న శ్రీశైలం మహక్షేత్రంలో శ్రీ భ్రమరాంబాదేవి వార్షిక కుంబోత్సవ వేడుక వైభవంగా జరిగింది కుంభోత్సవంలో భాగంగా అమ్మవారికి నిమ్మకాయలు గుమ్మడి,కొబ్బరికాయలు,పసుపు,కుంకుమలతో అలానే అన్నాన్ని కుంభరాశిగా పోసి శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారికి సాత్వికబలిగా సమర్పించారు.
ఉదయం నుంచి అమ్మవారి గర్భాలయంలో అర్చకులు వేదపండితులు ప్రత్యేక పూజలను నిర్వహించారు సాయంత్రం ఈవో లవన్న,ట్రస్ట్ బోర్డు సభ్యులు కొబ్బరికాయలు,నిమ్మ,గుమ్మడికాయలతో సాత్విక బలులను ప్రారంభించారు అలానే మహామంగళహారతి అనంతరం అమ్మవారి ఉగ్రరూపం స్వామివారిపై పడకుండా స్వామివారి ఆలయ ద్వారాలు మూసివేశారు.
మూసేవేతకు ముందు మల్లికార్జునస్వామి లింగరూపాన్ని పెరుగన్నం,ఉల్లిపాయలు,జీలకర్ర శోంటి భక్షాలతో కప్పేశారు. అనంతరం స్వామివారి అలయంలో పనిచేసే ఉద్యోగి 'స్త్రీ' వేషధారణలో అలంకరించి చేతిలో హారతితో వేదమంత్రోత్చారణల మద్య మంగళవాయిద్యాల నడుమ అమ్మవారి ఆలయానికి తరలిరాగా అమ్మవారి ప్రధానార్చకులు ఆలయద్వారలు తెరచి కుంబహారతినిచ్చారు.
ఆలయ ద్వారాలు తెరచిన వెంటనే అమ్మవారిచూపు శ్రీచక్రం వెనుకున్న కుంభరాశిపై పడి అనంతరం హారతి తెచ్చిన 'స్త్రీ' వేషధారిపై పడుతుందని భక్తుల నమ్మకం కుంభహారతి అనంతరం శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి దర్శనానికి భక్తులు,స్థానికులు బారులు తీరారు. ఈ కుంభోత్సవంలో స్థానిక శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి,ఆలయ ఈవో లవన్న,ట్రస్ట్ బోర్డు సభ్యులు పాల్గొన్నారు
Chandrababu: కొత్తగా రాజకీయాల్లోకి వచ్చేవారికీ ఛాన్స్, ఈసారి 40 శాతం సీట్లు వారికే : చంద్రబాబు
Chandrababu Kurnool Tour: భూలోకంలో ఎక్కడ దాక్కున్నా లాక్కొచ్చి లోపలేయిస్తా: చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Chandrababu In Kadapa: జగన్ పులివెందులలో బస్టాండ్ కట్టలేదు, కానీ 3 రాజధానులు కడతారా: చంద్రబాబు
Minister Gherao: మంత్రి జయరాంను అడ్డుకునేందుకు జనసేన, సీపీఐ లీడర్ల యత్నం- సత్యసాయి జిల్లాలో కబ్జాదారులపై చర్యలకు డిమాండ్
Anantapuram Politics: ఉమ్మడి అనంతలో పొలిటికల్ హీట్- జేసీ ప్రభాకర్‌రెడ్డి వర్సెస్ పల్లె రఘునాథ్
RR Vs CSK Highlights: రెండో స్థానానికి రాయల్స్ - చెన్నైపై ఐదు వికెట్ల తేడాతో విజయం!
Disha Accused Encounter Case: దిశ నిందితుల ఎన్కౌంటర్ కేసులో పోలీసులు చెప్పింది నిజం కాకపోతే, అసలు జరిగింది ఏంటి ?
Nikhat Zareen Parents: దెబ్బలు తగిలితే పెళ్లి అవడం కష్టం, బాక్సింగ్ వద్దమ్మా అని చెప్పేదాన్ని : నిఖత్ జరీన్ తల్లి
Honour Killing: హైదరాబాద్‌లో మరో పరువు హత్య - యువకుడిపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి దారుణం