అన్వేషించండి

Hindupuram: హిందూపురం మున్సిపాలిటీ టిడిపి కైవసం - ఛైర్‌పర్శన్ రాజీనామా

Hindupuram Municipality: హిందూపురం మన్సిపాలిటీ వైసీపీ చేజారిపోయింది. ఆ పార్టీ నుంచి విజయం సాధించిన ఛైర్‌పర్శన్ ఇంద్రజాతోపాటు మెజార్టీ సభ్యులు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిపోయారు.

Balakrishna: రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత తన బలాన్ని కోల్పోతూ వస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయంతో ఆ పార్టీ నేతలు ప్రత్యామ్నాయ పార్టీలవైపు తొంగి చూస్తూ ఉన్నారు. తమ రాజకీయ భవిష్యత్తు కాపాడుకునేందుకు వైఎస్ఆర్సిపి పార్టీలో ఉంటే కనుమరుగవుతామని మరో పార్టీలోకి వలసలు వెళ్తున్న పరిస్థితి ప్రస్తుతం రాష్ట్రంలో కనిపిస్తోంది. 

తెలుగుదేశం వైపు మొగ్గు : 
గత వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక మున్సిపల్ ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తన ఆధిపత్యాన్ని చలాయించింది. రాష్ట్రంలో ఉన్న ఒక్క తాడిపత్రి మున్సిపాలిటీ తప్ప దాదాపు అన్ని మున్సిపల్ కార్పొరేషన్ లను క్లీన్ స్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం 2024 ఎన్నికల్లో తమ ప్రభుత్వాన్ని కోల్పోయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంటేనే ఎవరైనా పార్టీలో ఉంటారని ఆ పార్టీ నేతలు మరోసారి రుజువు చేసినట్లు అయింది. వైసీపీలో వారి క్యాడర్‌కు ఈక్వల్ గా తెలుగుదేశం పార్టీలో నాయకులతో చర్చించి అనంతరం తెలుగుదేశం పార్టీలోకి చేరుతున్న వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. 

హిందూపురం మున్సిపల్ చైర్మన్ ఇంద్రజ టిడిపిలోకి : 
తెలుగుదేశం పార్టీ కంచుకోటగా ఉన్న హిందూపురం నియోజకవర్గంలో గత వైసిపి ప్రభుత్వం పురపాలక సంఘాన్ని కైవసం చేసుకుంది. గత ప్రభుత్వంలో సత్యసాయి జిల్లా ఇన్చార్జ్ మంత్రి గా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కంచుకోట హిందూపురాన్ని వైసిపి వశం చేసుకోవాలని గతంలో అనేక వ్యూహాలు రచించారు. అందులో భాగంగా మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఓడించి చైర్మన్ పీఠాన్ని వైసిపి దక్కించుకుంది.

హిందూపురం మున్సిపాలిటీలో మొత్తం 38 మంది కౌన్సిలర్లు ఉండగా ఆ ఎన్నికల్లో 30 మంది వైసీపీ కౌన్సిలర్లు గెలుపొందారు. 6 మంది తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు, ఒకరు బిజెపి, మరొకరు ఎంఐఎం పార్టీ నుంచి గెలుపొందారు. ప్రస్తుతం టిడిపి సంఖ్యాబలం 6 ఉండగా వైసిపి మున్సిపల్ చైర్‌పర్శన్ ఇంద్రజతో పాటు మరో ఎనిమిది మంది ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు. 

దీంతో పురపాలికలో తెలుగుదేశం సంఖ్యాబలం 18కి చేరింది. మరో ఇద్దరు తెలుగుదేశం పార్టీలోకి చేరితే మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని తెలుగుదేశం పార్టీ ఖాతాలో వేసుకొని ఉంది. ఇదే నెలలోనే అత్యవసర మున్సిపల్ సమావేశం నిర్వహించి చైర్మన్ పదవిని చేజిక్కించుకునేందుకు తెలుగుదేశం పార్టీ ప్రయత్నాలు ఇప్పటికే మొదలుపెట్టింది. 

టీడీపీలో చేరిన తర్వాత మున్సిపల్ ఛైర్మన్ తన పదవికి రాజీనామా చేశారు. దీంతో ఈ మున్సిపాలిటీ టీడీపీ కైవశం చేసుకునేందుకు పార్టీ వ్యక్తిని ఛైర్మన్ పదవిలో కూర్చోబెట్టేందుకు రంగం సిద్ధమైందని లోకల్‌గా టీడీపీ లీడర్లు చెబుతున్నారు. ఆమె స్థానంలో రమేష్‌ను నియమించనున్నారని తెలుస్తోంది. 

మున్సిపాలిటీ మీద దృష్టి పెట్టిన తెలుగుదేశం: 
అధికారం కోల్పోయిన అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మున్సిపాలిటీలో ఆ పార్టీ సంఖ్యాబలం రోజురోజుకీ తగ్గుతూ వస్తుంది. నంద్యాల జిల్లా నందికొట్కూరు మున్సిపాలిటీలో ఇప్పటికే వైఎస్ఆర్సిపి కౌన్సిలర్లు టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. నందమూరి ఖిల్లాగా ఉన్న హిందూపురం పురపాలక సంఘంలోనూ వైఎస్ఆర్సిపి చేతిలో ఉన్న పురపాలక సంఘం మరికొద్ది రోజుల్లోనే తెలుగుదేశం హస్తగతం చేసుకొనుంది ఇప్పటికే ఆ పార్టీ నుంచి చైర్మన్ ఇంద్రజతోపాటు మరో ఎనిమిది మంది కౌన్సిలర్లు టిడిపిలోకి చేరడమే ఇందుకు కారణం. దీంతో రాష్ట్రంలో మున్సిపాలిటీల్లో తన బలాన్ని వైఎస్ఆర్సిపి కోల్పోతూ వస్తుంది. ఇంకా ఎన్ని మున్సిపాలిటీల్లో ఈ విధంగా జరుగుతుందో అని రాష్ట్రవ్యాప్తంగా చర్చ కొనసాగుతోంది.

టాప్ హెడ్ లైన్స్

AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Allagadda Politics: ఆళ్లగడ్డలో రాజుకుంటున్న రాజకీయం - గంగుల వర్సెస్ భూమా వరుస సవాళ్లు - ఇంతకూ ఎవరిది అవినీతి?
ఆళ్లగడ్డలో రాజుకుంటున్న రాజకీయం - గంగుల వర్సెస్ భూమా వరుస సవాళ్లు - ఇంతకూ ఎవరిది అవినీతి?
Thalliki Vandanam Status: ఆంధ్రప్రదేశ్‌లో 22న తల్లికి వందనం డబ్బులు! అర్హుల జాబితాలో మీ పేరు ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి!
ఆంధ్రప్రదేశ్‌లో 22న తల్లికి వందనం డబ్బులు! అర్హుల జాబితాలో మీ పేరు ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి!
Re-NEET UG 2026 Result: నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
Embed widget