అన్వేషించండి

Srisailam Water : శ్రీశైలంలో నీటిని దొంగలెత్తుకెళ్లారట - పోలీసులకు ఫిర్యాదు ! ఎవరి పని ?

శ్రీశైలం డ్యాంలో నీటిని దొంగలెత్తుకెళ్లారని పోలీసులకు రైతులు ఫిర్యాదు చేశారు. ఇంతకీ ఆ నీరు ఏమయ్యాయి ?

 

Srisailam Water :   వర్షాకాలం వచ్చినా వానలు పడటం లేదు. రిజర్వాయర్లలో నీళ్లు లేవు. శ్రీశైలం పూర్తిగా వట్టిపోయింది. అయితే హఠాత్తగా  శ్రీశైలం రిజర్వాయర్లో నీటి దొంగతనం జరిగిందని  కొంత మంది పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఇప్పుడీ అంశం హాట్ టాపిక్ అవుతోంది. ఎవరు శ్రీశైలం నీటిని దొంగతనం చేశారు ? ఎందుకు చేశారు ? పోలీసులు కనిపెట్టగలరా అన్న చర్చ ప్రారంభమయింది. 

శ్రీశైలంలో అడుగంటిన నీరు 

నంద్యాల ఎస్పి రఘువీరారెడ్డికి రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథ రామిరెడ్డి అద్వర్యంలో రాయలసీమ సాగునీటి సాధన సమితి కార్యవర్గ సభ్యులు  శ్రీశైలం లో నీటి చోరీ జరిగిందని  ఫిర్యాదు చేశారు.ఈ సందర్భంగా బొజ్జా దశరథ రామిరెడ్డి నీటి దొంగతనం గురించి ఎస్పికి వివరించారు.‌ కృష్ణా, తుంగభద్ర నదుల ద్వారా సుమారు 2017 టిఎంసి ల నీరు గత నీటి సంవత్సరం అనగా జూన్ 1, 2022 నుండి మే 31, 2023 వరకు శ్రీశైలం రిజర్వాయర్ కు చేరిందని బొజ్జా ఎస్ పికి తెలిపారు. నీటి కేటాయింపులకు అదనంగా శ్రీశైలం రిజర్వాయర్ కు నీరు చేరిన సందర్భంలో కనీస నీటిమట్టం 854 అడుగుల పైన 60 టి ఎం సీ ల క్యారీ ఓవర్ రిజర్వుగా నీరు నిలువ ఉంచాలని చట్టం ఉందన్న విషయాన్ని వివరించారు. 

చట్టప్రకారం ఉండాల్సిన నీటి నిల్వలేదు ! 

రాబోయే నీటి సంవత్సరంలో వర్షాలు ఆలస్యమైనా, నీరు తక్కువగా వచ్చినా త్రాగునీటి అవసరాలకు ఇబ్బంది లేకుండా, వ్యవసాయ పనులకు అవాంతరాలు కలుగకుండా ఉండటానికి   చట్టం చేసారు.  ఈ చట్టం ప్రకారం మే 31, 2023 నాటికి శ్రీశైలం రిజర్వాయర్ లో 873 అడుగులు స్థాయిలో సుమారు 150 టి ఎం సీ ల నీరు నిలువ ఉండాలని గుర్తు చేసారు. కానీ మే 31, 2023 నాటికి రిజర్వాయర్ 808 అడుగుల స్థాయిలో 34 టి ఎం సీ ల నీరు ఉన్న వాస్తవ పరిస్థితిని పోలీసులకు వారు తెలియజేశారు. రిజర్వాయర్ లో ఈ స్థాయిలో నీరు ఉంటే రాయలసీమ నీటిని పొందడానికి అవకాశం ఉండదన్న విషయాన్ని వివరించారు.చట్ట ప్రకారం ఉండాల్సిన నీటి నుండి సుమారు 120 టి ఎం సీ ల నీరు దొంగతనం జరిగిందని ఎస్పీ కి   ఫిర్యాదు చేశారు. 

ఈ నీరు ఎవరు దొంగతనం చేశారు ?

ఈ నీరు దొంగ తనం జరగకుండా కాపాడటానికి సర్వోన్నత అధికారుల ఆధ్వర్యంలో సాగునీటి శాఖ పర్యవేక్షణ చేస్తున్నప్పటికీ, ఈ నీటి దొంగతనం జరిగిందని తెలిపారు. ఈ నీరు ఎవరు దొంగతనం చేశారు? ఎలా చేసారు అని తేల్చడంలో సాగునీటి శాఖ సర్వోన్నత అధికారులు అయోమయంలో పడినట్టున్నారని తెలిపారు. కావున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు శాఖ ఆ దొంగలను కనిపెట్టి, నీటి దొంగతనాలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టి, జీవన హక్కైన త్రాగునీరు రాయలసీమ ప్రజానీకం పొందేలాగా చేయాలని ఎస్పీకి విజ్ఞప్తి చేసారు.‌ అదేవిధంగానే భవిష్యత్తులో నీటి దొంగతనాలు జరగకుండా జాగ్రత్తగా ఉండడానికి జలవనరుల శాఖ సర్వోన్నత అధికారులకు తగిన సూచనలు చేయాలని విజ్ఞప్తి చేసారు. ఈ ఫిర్యాదు ఇప్పుడు వైరల్ అవుతోంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR Enquiry: ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
RRR Documentary On Netflix: సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
One Nation One Election: రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
Love Jihad Fack Check: హైదరాబాద్‌లో లవ్‌ జిహాద్ నుంచి ముగ్గురు అమ్మాయులను రక్షించారా..? వైరల్ అవుతున్న వీడియో వాస్తవమేనా...?
హైదరాబాద్‌లో లవ్‌ జిహాద్ నుంచి ముగ్గురు అమ్మాయులను రక్షించారా..? వైరల్ అవుతున్న వీడియో వాస్తవమేనా...?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Allu Arjun Case Sritej Health Update | 13 రోజుల తర్వాత శ్రీతేజ్ హెల్త్ పై పోలీసుల అప్డేట్ | ABP Desamటీమిండియా పరువు కాపాడిన బౌలర్లుత్వరలోనే టెస్ట్‌ మ్యాచ్‌లకి రోహిత్ శర్మ గుడ్‌బై!జమిలి ఎన్నికలపై జేపీసీ, ప్రతిపక్షాల డిమాండ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Enquiry: ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
RRR Documentary On Netflix: సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
One Nation One Election: రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
Love Jihad Fack Check: హైదరాబాద్‌లో లవ్‌ జిహాద్ నుంచి ముగ్గురు అమ్మాయులను రక్షించారా..? వైరల్ అవుతున్న వీడియో వాస్తవమేనా...?
హైదరాబాద్‌లో లవ్‌ జిహాద్ నుంచి ముగ్గురు అమ్మాయులను రక్షించారా..? వైరల్ అవుతున్న వీడియో వాస్తవమేనా...?
KTR vs Revanth: నువ్వు మగాడివైతే అసెంబ్లీ సమావేశాలు 15 రోజులు నిర్వహించు - రేవంత్ రెడ్డికి కేటీఆర్ ఛాలెంజ్
నువ్వు మగాడివైతే అసెంబ్లీ సమావేశాలు 15 రోజులు నిర్వహించు - రేవంత్ రెడ్డికి కేటీఆర్ ఛాలెంజ్
Rains: అల్పపీడనం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, తెలంగాణలో ఇదీ పరిస్థితి
అల్పపీడనం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, తెలంగాణలో ఇదీ పరిస్థితి
Tirumala News: తిరుమలలో వైకుంఠ ఏకాదశి - టికెట్లు ఎప్పుడు విడుదల చేస్తారంటే?, టీటీడీ కీలక నిర్ణయాలివే!
తిరుమలలో వైకుంఠ ఏకాదశి - టికెట్లు ఎప్పుడు విడుదల చేస్తారంటే?, టీటీడీ కీలక నిర్ణయాలివే!
Telangana Assembly: విపక్షాల నిరసనల మధ్య 3 కీలక బిల్లులకు తెలంగాణ శాసనసభ ఆమోదం
విపక్షాల నిరసనల మధ్య 3 కీలక బిల్లులకు తెలంగాణ శాసనసభ ఆమోదం
Embed widget