అన్వేషించండి

Chandrababu Comments: జగన్ మాట చంద్రబాబు నోట, తీవ్ర సంచలనం రేపుతున్న కామెంట్స్ - షాక్ లో పార్టీ లీడర్స్

ఇవే తనకు చివరి ఎన్నికలు అని చంద్రబాబు కర్నూలు పర్యటనలో ప్రకటించారు. దీంతో బాబు సభకు వచ్చిన వారంతా అవాక్కయ్యారు.

టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు కర్నూలు జిల్లాలో మూడు రోజుల పర్యటనలో ఉన్నారు. మూడు నియోజకవర్గాలు మూడు రోజులపాటు కర్నూలు జిల్లాలో పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలతో మమేకమై జిల్లాలో ఉన్న సమస్యల పట్ల రానున్న రోజుల్లో పార్టీ చేయవలసిన కార్యక్రమాల గురించి నాయకులు ప్రజలతో మమేకమై జిల్లాలో ఉన్న సామాన్య ప్రజలను మొదలుకొని రైతులు నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ప్రభుత్వ అమలు చేస్తున్న పథకాల ఇస్తూ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు నిత్యవసర వస్తువులైన వాటిపై ధరలను బాదడం వంటి వాటిని ప్రభుత్వం చేస్తున్న మోసాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించడంపై పత్తికొండలో నిర్వహించిన బాదుడే బాదుడు కార్యక్రమంలో ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవే తనకు చివరి ఎన్నికలు అని ప్రకటించారు. దీంతో బాబు సభకు వచ్చిన వారంతా అవాక్కయ్యారు. క్షేత్రస్థాయిలో తేల్చుకోనే అసెంబ్లీకి వెళ్తానని చంద్రబాబు చెప్పడంతో కార్యకర్తలు, నాయకులు షాకయ్యారు.  

బాబు పర్యటన ఇలా!
ఓర్వకల్ ఎయిర్పోర్ట్ లో విద్యార్థులతో మమేకమైన చంద్రబాబు గతంలో తమ ప్రభుత్వ హాయంలో ప్రభుత్వ ఉద్యోగాలు నిరుద్యోగ సమస్య నిరుద్యోగ భృతి సాఫ్ట్ వేర్ వంటి రంగాలలో యువతకు ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉండేవని.. జాబు కావాలంటే బాబు రావాలి అని పెద్ద ఎత్తున నిరుద్యోగ యువత బాబుకు తమ సమస్యలను వేడుకున్నారు. బాబు విద్యార్థులకు దీటుగా తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిరుద్యోగులకు తగిన న్యాయం చేస్తామని రానున్న రోజుల్లో జాబ్ క్యాలెండర్ ద్వారా పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తామని నిరుద్యోగ యువతకు హామీనిచ్చారు.

జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులు అంటూ ప్రజల పాలనను పట్టించుకోకుండా మూడు ముక్కలాటగా రాజధాని పేరుతో ఆటలాడుతున్నారని వైఎస్ఆర్ సీపీ నాయకుల తీరుపై మండిపడ్డారు. విశాఖ ప్రాంతంలో ప్రభుత్వ భూములతో పాటు విజయసాయిరెడ్డి సంబంధిత నాయకుల భూములు ఉండడంతో అమరావతిలో ఉన్నటువంటి రాజధాని మార్చి విశాఖకు తరలించడం సరైన చర్య కాదని ఇప్పటికైనా తమ అవసరాల కోసం రాజధాని మార్చుకుంటూ వెళ్తామనడం సరైనది కాదని.. రాష్ట్రంలో ఉన్న రహదారులను బాగు చేయలేని ముఖ్యమంత్రి మూడు రాజధానులు కడతాడంట అంటూ వారిని ఎద్దేవా చేశారు.

కోడుమూరులోనూ పర్యటన
అనంతరం కోడుమూరులో జరిగిన రోడ్ షోలో చంద్రబాబు మాట్లాడుతూ... రాష్ట్రంలో రాచరిక పాలన కొనసాగుతుందని వైసీపీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ పాలన ప్రభుత్వ సంక్షేమం కొరవడిందని కొనియాడారు.. కోడుమూరులో ఇటీవల కాలంలో పత్తి నకిలీ విత్తనాలతో నష్టపోయినటువంటి రైతులు చంద్రబాబుకు తమ గోడును తెలిపారు.

పత్తికొండకు వస్తున్న సందర్భంగా వైసీపీ నాయకులు చంద్రబాబును అడ్డుకున్నారు.. చంద్రబాబు రాయలసీమ ద్రోహి అంటూ కర్నూల్ లో న్యాయ రాజధాని ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారని వారి తీరును మార్చుకొని రాయలసీమ కేంద్ర బిందువు అయినటువంటి కర్నూలు నగరంలో న్యాయ రాజధాని కచ్చితంగా ఏర్పాటు చేయాలని ఫ్లాకార్డులతో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. నిరసనకారులు బాబు కాన్వాయ్ ని అడ్డుకోబోతుండగా పోలీసులు అక్కడ ఉన్న కార్యకర్తలను అదుపు చేసి వారిని అక్కడి నుండి అదుపు చేసి రోడ్ షో ను ముందుకు తీసుకెళ్లారు.
 
ఇవే చివరి ఎన్నికలు అంటూ షాక్
గతంలో ఎన్నడూ లేని విధంగా భావోద్వేగంగా మాట్లాడారు. ‘‘ఇవే నాకు చివరి ఎన్నికలు. మీరు గెలిపించి అసెంబ్లీకి పంపితే సరే లేదంటే ఇక మీ ఇష్టం. అసెంబ్లీలో నన్ను అవమానించారు. నా భార్యను కూడా అవమానించారు.’’ అని అన్నారు. 

గతంలో సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు చంద్రబాబు కూడా అలాంటి మాటలే మాట్లాడడం ప్రాధాన్యం సంతరించుకుంది.

కర్నూలు పర్యటనలో మరొకసారి తన మనసులో ఉన్న మాటను బయటకు పెట్టేశారు.. ఇప్పుడున్నది కౌరవ సభ. ఆ కౌరవ సభను నేను గౌరవ సభగా మారుస్తా అని అన్నారు. ఇవే కాకుండా ఇంకా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. 2003లో తనపై 23 మందు పాతరలు పేలిస్తే వేంకటేశ్వరస్వామి కాపాడారని అన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోందని.. ఆ ఆరాచక శక్తుల్ని తుదముట్టించాలని అన్నారు. పోలీస్ శాఖలో కొందరి వల్ల అందరికీ చెడ్డపేరు వస్తుందని అన్నారు. తప్పులు చేస్తే జగన్ కాపాడలేరని చంద్రబాబు హెచ్చరించారు. ఇవే తనకు చివరి ఎన్నిక అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో హీట్‌ పెంచాయనే పార్టీ వర్గాలు చెప్తున్నారు. చంద్రబాబు ఇలా ఎందుకు మాట్లాడారని సొంత పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

PM Modi AP Tour: ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
Chevireddy vs. Balineni :  చెవిరెడ్డి వర్సెస్ బాలినేని - వీళ్ల పరస్పర ఆరోపణల్లో ఎన్ని కొత్త విషయాలు బయటకు వస్తున్నాయంటే ?
చెవిరెడ్డి వర్సెస్ బాలినేని - వీళ్ల పరస్పర ఆరోపణల్లో ఎన్ని కొత్త విషయాలు బయటకు వస్తున్నాయంటే ?
Best Budget 9 Seater SUV: చవకైన 9 సీటర్లలో బెస్ట్ కారు ఇదే - పెద్ద ఫ్యామిలీకి పర్‌ఫెక్ట్ ఆప్షన్!
చవకైన 9 సీటర్లలో బెస్ట్ కారు ఇదే - పెద్ద ఫ్యామిలీకి పర్‌ఫెక్ట్ ఆప్షన్!
Revanth Reddy: తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆర్‌జీవీ ఇంటికి పోలీసులు, అరెస్ట్‌కి రంగం సిద్ధంపుష్ప 2 మూవీలోని కిస్సిక్ సాంగ్‌పై విపరీతమైన ట్రోల్స్యూపీలోని షాహీ మసీద్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తతవిజయ్‌తో రిలేషన్‌షిప్‌పై ఓపెన్ అయిన రష్మిక

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi AP Tour: ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
Chevireddy vs. Balineni :  చెవిరెడ్డి వర్సెస్ బాలినేని - వీళ్ల పరస్పర ఆరోపణల్లో ఎన్ని కొత్త విషయాలు బయటకు వస్తున్నాయంటే ?
చెవిరెడ్డి వర్సెస్ బాలినేని - వీళ్ల పరస్పర ఆరోపణల్లో ఎన్ని కొత్త విషయాలు బయటకు వస్తున్నాయంటే ?
Best Budget 9 Seater SUV: చవకైన 9 సీటర్లలో బెస్ట్ కారు ఇదే - పెద్ద ఫ్యామిలీకి పర్‌ఫెక్ట్ ఆప్షన్!
చవకైన 9 సీటర్లలో బెస్ట్ కారు ఇదే - పెద్ద ఫ్యామిలీకి పర్‌ఫెక్ట్ ఆప్షన్!
Revanth Reddy: తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
iPhone 15 Pro Max Offer: ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ధర అంత తక్కువా - భారీ డిస్కౌంట్ ఇచ్చిన యాపిల్!
ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ధర అంత తక్కువా - భారీ డిస్కౌంట్ ఇచ్చిన యాపిల్!
Bengalore: సినిమా బిచ్చగాడు కాదు రియల్ - బెంగళూరు రోడ్లపై కనిపించే ఈ బెగ్గర్ లైఫ్ స్టోరీ వింటే కన్నీళ్లాగవు !
సినిమా బిచ్చగాడు కాదు రియల్ - బెంగళూరు రోడ్లపై కనిపించే ఈ బెగ్గర్ లైఫ్ స్టోరీ వింటే కన్నీళ్లాగవు !
Pawan Kalyan to Delhi : హఠాత్తుగా ఢిల్లీకి పవన్ కల్యాణ్ - ఎవరెవరితో భేటీలో సస్పెన్స్ !
హఠాత్తుగా ఢిల్లీకి పవన్ కల్యాణ్ - ఎవరెవరితో భేటీలో సస్పెన్స్ !
Rain Alert: బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీలోని ఈ జిల్లాలో భారీ వర్షాలు, ఐఎండీ బిగ్ అలర్ట్
బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీలోని ఈ జిల్లాలో భారీ వర్షాలు, ఐఎండీ బిగ్ అలర్ట్
Embed widget