By: ABP Desam | Updated at : 25 Jan 2023 05:39 PM (IST)
మరోసారి అవినాష్‌రెడ్డికి సీబీఐ నోటీసులు
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. జనవరి 28న విచారణ రావాలని పిలుపునిచ్చింది. ఆయనకు 41 ఏ కింద నోటీసులు ఇచ్చారు. సాధారణంగా అనుమానితులకు ఈ నోటీసులు ఇస్తారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన అవినాష్ రెడ్డి.. సీబీఐకి సహకరిస్తామన్నారు. మరోసారి నోటీసు జారీ చేస్తే విచారణకు వెళ్తామన్నారు.
తన ఇంట్లోనే హత్యకు గురైన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో ఇప్పటికే ఎంపీ అవినాష్ రెడ్డి రెండు రోజుల క్రితం నోటీసు ఇచ్చింది. దానిపై స్పందించిన అవినాష్ రెడ్డి... తాను ఇప్పటికిప్పుడంటే రాలేనంటూ సమాధానం ఇచ్చారు. తనకు ఐదు రోజుల పాటు ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాలు ఉన్నాయని రిప్లై ఇచ్చారు. 24వ తేదీ విచారణ రాలేనంటూ తేల్చేశారు. దీంతో మరోసారి సీబీఐ నోటీసులు జారీ చేసింది. 28న విచారణ హాజరుకావాలని సూచించారు.
రెండోసారి నోటీసు ఇచ్చిన సీబీఐ ఇచ్చిన గడువు నాటికి అవినాష్ చెప్పిన ఐదు రోజుల షెడ్యూల్ పూర్తవుతుంది. అందుకే 28న విచారణకు రావాలని సీబీఐ కాల్ చేసినట్టు తెలుస్తోంది. ఇప్పుడు విచారణకు ఆయన వెళ్తారా లేకుంటే మరేదైనా కారణం చెప్తారా అనే సస్పెన్స్ నెలకొంది.
ఈ సీబీఐ ఎంక్వయిరీపై స్పందించిన అవినాష్ రెడ్డి... గత రెండున్నర సంవత్సరాలుగా తనపై, తన కుటుంబంపై ఒక సెక్షన్ ఆఫ్ మీడియా అసత్యపు ఆరోపణలు చేస్తోందని అన్నారు. తనపై వచ్చిన అభియోగాలను జీర్ణించుకోలేకపోతున్నానని అన్నారు. తన గురించి, తన వ్యవహార శైలి ఏంటో ఈ జిల్లా ప్రజలు అందరికీ బాగా తెలుసని అన్నారు. ‘‘న్యాయం గెలవాలి. నిజం వెల్లడి కావాలి అన్నదే నా ధ్యేయం. నిజం తేలాలని నేను కూడా భగవంతుడిని కోరుకుంటున్నా. ఆరోపణలు చేసేవారు మరొకసారి ఆలోచించాలి ఇలాంటి ఆరోపణ చేస్తే మీ కుటుంబాలు కూడా ఎలా ఫీల్ అవుతారో ఒకసారి ఊహించుకోండి’’ అని అన్నారు.
జనవరి 23న మధ్యాహ్నం సీబీఐ అధికారులు పులివెందులకు వచ్చి సీబీఐ నోటీసులు ఇచ్చారు. జనవరి 24న మధ్యాహ్నం సీబీఐ విచారణకు రావాలని ఆదేశించారు. కానీ, ముందే ఖరారైన కార్యక్రమాలు ఉన్నందున విచారణకు నాలుగైదు రోజులు గడువు కావాలని సమయం కోరాను. మళ్లీ వారు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్లి, అధికారులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్తాను. గడిచిన రెండున్నర సంవత్సరాలుగా విపరీతంగా నాకు, నా కుటుంబానికి పరువు నష్టం కలిగింది. ఇంకా కోర్టులో విచారణ మొదలు కాకపోయినా ఒక సెక్షన్ మీడియా నన్ను విపరీతంగా డీఫేమ్ చేసింది. నన్ను నా వాళ్లను విపరీతంగా బాధపెట్టారు. కానీ, నేను ఏమీ మాట్లాడలేదు. ఈ సబ్జెక్ట్ పైన మాట్లాడాలంటేనే నా మనస్సు ఒప్పుకోవడం లేదు. నేను ఏంటో నా వ్యక్తిత్వం ఏంటో ఈ జిల్లా ప్రజలకు బాగా తెలుసు. న్యాయం గెలవాలి, నిజం ఏంటో బయటకు రావాలి. నిజం బయటకు రావాలని అందరూ దేవుణ్ని కోరుకోండి. మీడియాకు కూడా ఇదే చెప్తున్నా. అంతేకానీ, సొంత వ్యాఖ్యానాలు రాయొద్దని కోరుతున్నా.’’ అని వైఎస్ అవినాష్ రెడ్డి అన్నారు.
Vivekananda Reddy Case: విచారణకు హాజరవుతా కానీ ఆ పని చేయండి- సీబీఐకి ఎంపీ అవినాష్ రెడ్డి లేఖ!
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంచారా!
AP News Developments Today: కుప్పంలో పాదయాత్ర హడావుడి- విశాఖలో శారదాపీఠం వార్షికోత్సవం
Weather Latest Update: తెలుగు రాష్ట్రాల్లో పొడి వాతావరణం- చలి సాధారణం!
నేడు సీబీఐ ముందుకు అవినాష్ రెడ్డి- వివేకా హత్య కేసులో ఇంకెన్ని ట్విస్ట్‌లు!
Taraka Ratna Health Update: తారకరత్నను గిచ్చితే రెస్పాండ్ అయ్యారు, ఇంకా టైం పడుతుంది: బాలకృష్ణ
Chiranjeevi - Ram Charan: రామ్ చరణ్ స్థానంలో నేనే ఉన్నంత గర్వంగా ఉంది: చిరంజీవి
BRS Parliamentary Meetings: నేడు BRS పార్లమెంటరీ పార్టీ సమావేశం, ఫోకస్ అంతా దాని గురించే
Smitha Sabarwal Issue: స్మితా సబర్వాల్ ఇంటికి అందుకే వెళ్లా, అసలు కారణం చెప్పిన డిప్యూటీ తహసీల్దార్