By: ABP Desam | Updated at : 26 Jul 2022 07:42 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
కర్నూలులో ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్
Kurnool News : కర్నూలు జిల్లా పత్తికొండ మండలం చక్కరాళ్ల గ్రామంలోని ప్రభుత్వం పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయింది. మధ్యాహ్న భోజనంలో పెట్టిన గుడ్లు తిని 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైయ్యారు. అస్వస్థతకు గురైన విద్యార్థులను పత్తికొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఉడికీ ఉడకని బియ్యం, కుళ్లిన కోడిగుడ్లు
రాష్ట్ర ప్రభుత్వం జగనన్న గోరుముద్ద పేరుతో విద్యార్థులకు పౌష్టికాహారం అందిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటోందని కానీ కర్నూలు జిల్లాలో చాలా పాఠశాలలో విద్యార్థులకు పౌష్టికాహారం పెట్టకుండా ఉడికీ ఉడకని బియ్యం, కుళ్లిన కోడిగుడ్లు పెడుతున్నారని ఎస్ఎఫ్ఐ నేతలు ఆరోపించారు. పత్తికొండ మండలంలో చక్కరాళ్ల గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో చెడిపోయిన గుడ్లు పెట్టడం వల్లే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని ఆరోపించారు. వారం రోజుల క్రితం కోడుమూరులో ఇలాంటి ఘటనే జరిగిందన్నారు. అయినా అధికారులు మాత్రం పట్టి పట్టినట్టు వ్యవహరిస్తున్నారన్నారు. మధ్యాహ్న భోజనం నాణ్యత లేకుండా పోతుందని విమర్శించారు. ఇప్పటికైనా ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే ఫుడ్ ఇన్స్పెక్టర్లు, డీఈఓలు పాఠశాలలను తరచూ పరిశీలించాలని కోరుతున్నారు. కుళ్లిపోయిన గుడ్లు, ఉడికీ ఉడకని బియ్యం, పురుగులతో ఉన్న కూరగాయలు ఇలాంటివి పెట్టకుండా జాగ్రత్తలు తీసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు.
కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం చక్కరాళ్ల గ్రామంలోని పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో నాసిరకం కోడిగుడ్లను పెట్టడంతో 30 మందికి పైగా విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు. (1/2) pic.twitter.com/ZUzUYDArRo
— Telugu Desam Party (@JaiTDP) July 26, 2022
బాధ్యులపై చర్యలకు టీడీపీ డిమాండ్
ఈ ఘటనపై టీడీపీ కూడా స్పందించింది. ఆ పార్టీ నాయకులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించారు. ప్రభుత్వం ఈ ఘటనపై స్పందించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
చిక్కీలో పురుగులు
పత్తికొండ బాలుర ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జగనన్న గోరుముద్ద కింద పంపిణీ చేసిన చిక్కీలలో పురుగులు ఉన్నట్లు విద్యార్థులు గుర్తించారు. చిక్కీలో పురుగులు చూసి విద్యార్థులు ఉపాధ్యాయులకు తెలియజేశారు. దీనిపై పాఠశాల హెడ్ మాస్టర్ స్పందించారు. కొన్ని చిక్కీలలో పురుగులు ఉన్న విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. ఆ చిక్కీలను బదులుగా వేరే చిక్కీలను విద్యార్థులకు ఇచ్చామన్నారు. అయితే డేట్ ఎక్స్‌పైర్ అయిన చిక్కీలు ఇస్తున్నారని, మధ్యాహ్నం భోజనంలో కూడా పురుగులు వస్తున్నాయని విద్యార్థులు అంటున్నారు.
Also Read : KA Paul : చంద్రబాబు ప్రధాని అయ్యేందుకు ఏపీని నాశనం చేశారు, కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు
Cyclone Michaung: తుపాను సహాయక చర్యలపై సీఎం జగన్ సమీక్ష- ప్రజలకు ఇబ్బంది రావద్దని చంద్రబాబు సూచన
JC Prabhakar Reddy: తాడిపత్రిలో హై టెన్షన్! జేసీని అడ్డుకున్న పోలీసులు
Tirumala News: తిరుమల కొండపై వారం నుంచి ఆగని వర్షం - భక్తులు తీవ్ర ఇబ్బందులు
TDP News: యువగళం ముగింపు సభ భారీగా ప్లాన్ - చంద్రబాబు, పవన్ హాజరు
Petrol-Diesel Price 04 December 2023: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి
CLP Meeting News: గచ్చిబౌలిలో సీఎల్పీ మీటింగ్, సీఎం ఎంపికపై తీర్మానాలు, ప్రమాణ స్వీకారం నేడే ఉంటుందా?
Mizoram Election Result 2023: మిజోరంలో ఎగ్జిట్ పోల్ అంచనాలు తలకిందులు, అధికార ప్రభుత్వానికి షాక్!
First Time MLAs In Telangana: ఈ ఎమ్మెల్యేలు స్పెషల్ వేరే లెవల్- ఒకరిద్దరు కాదు ఏకంగా 50 మంది
Revanth Reddy Astrology 2023 : ఇదీ రేవంత్ రెడ్డి జాతకం - అందుకే అఖండ విజయం- రాజయోగం!
/body>