అన్వేషించండి

Kuppam Krishna Water: కుప్పంలో పండుగ వాతావరణం - కృష్ణా జలాల రాకతో సంతోషం - శనివారం చంద్రబాబు జలహారతి

Kuppam Krishna Water: 738 కి.మీ ప్రయాణించి కుప్పానికి కృష్ణమ్మ చేరుకుంది. 10 రిజర్వాయర్లను నింపుతూ శ్రీశైలం నుంచి నదీ జలాలు కుప్పం వచ్చాయి. శనివారం చంద్రబాబు జలహారతి ఇవ్వనున్నారు.

Kuppam Krishna Water People happiness:   రాయలసీమను సస్యశ్యామలం చేసేందుకు నాడు ఎన్టీఆర్ వివిధ ప్రాజెక్టులకు శ్రీకారం చుడితే...ఆయన కలను చంద్రబాబు సాకారం చేస్తున్నారు. సీమ పల్లెల్లోకి నీళ్లు పారించారు. సీమకు పూర్తి స్థాయిలో కృష్ణా జలాలు అనేవి ఇన్నేళ్లూ కల.. కానీ ఇప్పుడు అది నిజం. ఈ కలను చంద్రబాబు నిజం చేశారు.  అతి తక్కువ వర్ష పాతం ఉండే సీమ జిల్లాల్లో నీళ్లతోనే సీమ ప్రజల స్థితిగతులు మారుతాయని ఇరిగేషన్ కు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. ఈ క్రమంలో హంద్రీ నీవాకు ఉమ్మడి రాష్ట్రంలో 1999 జులై 9 చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఈ రోజు బీడు భూముల్లో నీళ్లు పారేలా చేశారు. ఇదంతా రాత్రికి రాత్రి ఇది జరగలేదు. 2014 నుంచి నేటి వరకు ప్రభుత్వం భారీ ఎత్తున సాగునీటి ప్రాజెక్టులపై నిధుల ఖర్చు చేయడం వల్ల  నేడు హంద్రీనీవా నీళ్లు చిత్తూరు జిల్లాలో చివరి ఆయకట్టు భూములకు చేరాయి.

 హెచ్ఎన్ఎస్ఎస్ కు నాడు అత్యంత ప్రాధాన్యం 

హంద్రీనీవా ప్రాజెక్టుపై 2014-19 మధ్య రూ.4,183 కోట్లు ఖర్చు పెట్టి చంద్రబాబు ప్రాజెక్టును పరుగులు పెట్టించారు. 2019లో అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు గ్రహణం పట్టించింది. మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ సీజన్‌లో ఎలాగైనా నీళ్లు ఇవ్వాలని లక్ష్యంతో పనుల్లో వేగం పెంచారు. రికార్డు స్థాయిలో కేవలం 100 రోజుల్లో మెయిన్ కెనాల్ విస్తరణ, లైనింగ్ పనులు పూర్తి చేసి ప్రధాన కాలువ సామర్థ్యాన్ని 3850 క్యూసెక్కులకు పెంచారు. 

 

 సాగు బాగుంటేనే... రాష్ట్రం బాగుంటుంది 

సాగు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పుడూ చెబుతారు. చెప్పడమే కాదు.. దాన్ని చేసి చూపించాలన్న సంకల్పంతోనే రికార్డు స్థాయిలో చేపట్టిన హంద్రీ-నీవా కాల్వ విస్తరణ పనులతో సీమకు జలకళ వచ్చింది.  ఈ ప్రాజెక్టు ద్వారా మొత్తంగా 6 లక్షల ఎకరాలకు సాగునీరు, 33 లక్షల మందికి తాగునీరు అందుతోంది. విస్తరించిన కాల్వల ద్వారా పరుగులు పెడుతున్న కృష్ణమ్మ 19 నియోజకవర్గాలను తాకింది. 10 రిజర్వాయర్‌లను నింపుతోంది. కర్నూలు జిల్లాలో కృష్ణగిరి, పత్తికొండ, అనంతపురం జిల్లాలో జీడిపల్లి, పెన్నా అహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లు నిండాయి. సత్యసాయి జిల్లాలో మారాల, గొల్లపల్లి, చెర్లోపల్లి... అన్నమయ్య జిల్లాలోని శ్రీనివాసాపురం, అడవిపల్లి రిజర్వాయర్లు నిండుతున్నాయి. అలాగే గాజుల దిన్నెకు నీరు చేరింది. 

 చిత్తూరు సస్యశ్యామలం 

హంద్రీనీవా ఆయకట్టులో చిట్ట చివరి జిల్లా చిత్తూరు. చిత్తూరు జిల్లాలో 16 లక్షల ఎకరాల సాగుభూమి ఉన్నా... కేవలం 6 లక్షల ఎకరాలకే సాగునీరు అందుతోంది. మిగిలిన 10 లక్షల ఎకరాలకు సాగునీరిస్తే...రైతన్నకు నీటి కొరతే ఉండదు. హంద్రీనీవా రెండో దశ పనులు పూర్తి చేసి జిల్లాలోని 2.20 లక్షల ఎకరాలకు సాగునీరు ప్రభుత్వం ఇవ్వనుంది.  చిత్తూరు జిల్లాలో సాగు అంతా బోర్లపైనే ఆధారపడి ఉంది. 565 కి.మీ. మేర ఉన్న పుంగనూరు, నీవా, తంబళ్లపల్లి, కుప్పం, చింతపర్తి, ఎల్లుట్ల, వాయల్పాడు, సదుం బ్రాంచ్ కాలువలతో 1,86,500 ఎకరాలకు సాగునీరు అందుతుంది. పీలేరు, పుంగనూరు, చంద్రగిరి, పూతలపట్టు, చిత్తూరు, జీడీ నెల్లూరు నియోజకవర్గాల ప్రజలకు దీంతో ప్రయోజనం కలుగుతుంది.  

 

 పరమ సముద్రానికి కృష్ణా జలాలు 

గత నెల 17వ తేదీన కర్నూలు జిల్లా మల్యాల ఎత్తిపోతల నుంచి నీటిని విడుదల చేశారు. నాటి నుంచి హంద్రీనీవా కాలువల్లో ప్రవహించిన కృష్ణమ్మ 738 కి.మీ ప్రయాణించి కుప్పానికి చేరింది. పరమ సముద్రంలో సిఎం చంద్రబాబు కృష్ణా జలాలకు హారతి ఇవ్వనున్నారు. తరలి వచ్చిన కృష్ణమ్మ కుప్పం నియోజకవర్గంలో ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. జల హారతి కార్యక్రమం కోసం కుప్పం వెళుతున్న సిఎం వారి సంతోషాన్ని పంచుకోనున్నారు.

*కుప్పం బ్రాంచ్ కెనాల్* 

215 క్యూసెక్కుల సామర్ధ్యంతో 123 కి.మీ. పొడవున కుప్పం బ్రాంచ్ కెనాల్ నిర్మించారు. రూ.197 కోట్లతో కాలువ లైనింగ్ పనులు పూర్తి చేశారు. పలమనేరు, కుప్పం నియోజకవర్గాల్లోని 8 మండలాల్లో ఈ కాలువ వెళ్తుంది. ఈ కాలువ ద్వారా 4 లక్షల జనాభాకు తాగునీరు ఇవ్వడమే కాకుండా...110 చెరువులు నింపడం ద్వారా 6,300 ఎకరాల స్థిరీకరణ జరుగుతుంది. ప్రభుత్వ చిత్తశుద్ది సంకల్పంతో  40 టిఎంసిల నీటిని ఒక్క హంద్రీనీవా ప్రాజెక్టు ద్వారా రాయల సీమ జిల్లాలు వినియోగించుకోనున్నాయి. చెరువుల అన్ని నింపే కార్యక్రమాన్ని ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించింది. దీంతో సీమలో భూగర్భ జలాలు పెరగనున్నాయి. ఉద్యాన పంటల ఉత్పత్తులు పెంచేందుకు సాగునీటి సౌకర్యం ఎంతో దోహదం చేయనుంది. ఈ ప్రాంత రైతులు, ప్రజల జీవన ప్రమాణాలు కూడా పెరగనున్నాయి.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు
ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు
Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
Vijaya Sai Reddy New Political Party: కొత్త పార్టీ పెడుతున్నా! తిరుమలలో విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! 
కొత్త పార్టీ పెడుతున్నా! తిరుమలలో విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! 
AP Local Body Elections 2026: స్థానిక సంస్థల సమరానికి ఏపీ సిద్ధం - సెప్టెంబర్-అక్టోబర్ ఎన్నికల వేడి - ఎవరిది పైచేయి?
స్థానిక సంస్థల సమరానికి ఏపీ సిద్ధం - సెప్టెంబర్-అక్టోబర్ ఎన్నికల వేడి - ఎవరిది పైచేయి?

వీడియోలు

Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
NTR Trivikram Movie Title: గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
Prabhas: ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
Embed widget