Krishna District MLA Candidates 2024: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల 2024 ఫలితాల్లో కూటమి వరదకు కృష్ణాలో కొట్టుకుపోయిన వైసీపీ
AP Assembly Election Results 2024:కృష్ణా జిల్లాలో వైసీపీ కృష్ణా నదిలో కొట్టుకుపోయింది. సైకిల్ జోరులో ఫ్యాన్ బేజారెత్తిపోయింది. బీజేపీ, జనసేన ప్రభంజనం ముందు వైసీపీ వెలవెల బోయింది.
Krishna District MLA Candidates Winner List 2024: మూడు రాజధానుల ప్రభావం కృష్ణాజిల్లాపై తీవ్రంగా చూపినట్టు కనిపిస్తోంది. అమరావతి ప్రాంతంలోని అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ కొట్టుకుపోయింది. టీడీపీ జనసేన, బీజేపీ కూటమి దిగ్విజయంగా దూసుకెళ్లింది.
నియోజకవర్గం |
అభ్యర్థి |
పార్టీ |
గన్నవరం |
యార్లగడ్డ వెంకట్రావు |
టీడీపీ |
గుడివాడ |
వెనిగండ్ల రాము |
టీడీపీ |
పెడన |
కాగిత కృష్ణ ప్రసాద్ |
టీడీపీ |
మచిలీపట్నం |
కొల్లు రవీంద్ర |
టీడీపీ |
అవనిగడ్డ |
మండలి బుద్దప్రసాద్ |
|
పామర్రు |
వర్ల కుమార రాజా |
టీడీపీ |
పెనమలూరు |
బోడె ప్రసాద్ |
టీడీపీ |
దివంగత ముఖ్యమంత్రి...తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరాముడి సొంత జిల్లా కృష్ణాజిల్లా(Krishna)లో...ఆ పార్టీ ఆవిర్భావం నుంచి టీడీపీ(Telugudesam)కి కంచుకోటగా మారింది. రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉండే ఈ జిల్లాలో ఓటర్ల నాడి పట్టుకోవడం అంత ఈజీకాదు..అన్నిరకాల సమీకరణాలు చూసుకున్న తర్వాతే పార్టీలను ఆదరిస్తారు. ఈ జిల్లాలో సామాజిక సమీకరణాలు గెలుపోటములపై అత్యంత ప్రభావం చూపుతాయి. 2009లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్(Congress) నాలుగుచోట్ల విజయం సాధించగా....తెలుగుదేశం పార్టీ మూడుచోట్ల గెలుపొందింది. రాష్ట్ర విభజన అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో ఐదుచోట్ల తెలుగుదేశం జెండా ఎగురవేయగా....వైసీపీ(YCP) రెండుచోట్ల ప్రభావం చూపింది. తెలుగుదేశం నుంచి కాంగ్రెస్ అటు నుంచి వైసీపీలో చేరిన కొడాలి నాని(Kodali Nani) గుడివాడ(Gudiwada) నుంచి గెలుపొందారు. జిల్లావ్యాప్తంగా తెలుగుదేశం గాలి వీచినా... ఎన్టీఆర్(NTR) సొంత నియోజకవర్గం గుడివాడలో మాత్రం వైసీపీ గెలవడం విశేషం. 2019 లో జరిగిన ఎన్నికల్లో గన్నవరం(Gannavaram) మినహా కృష్ణా జిల్లాలోని సీట్లన్నీ వైసీపీ వశమయ్యాయి. ఆ తర్వాత గన్నవరం నుంచి గెలుపొందిన వల్లభనేని వంశీ(Vallabaneni Vamsi) సైతం వైసీపీలో చేరిపోవడంతో..జిల్లాలో తెలుగుదేశానికి ప్రాతినిధ్యమే లేకుండా పోయింది. తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత...ఎన్టీఆర్ సొంత జిల్లాలో ఇంత ఘోర పరాభవం ఎప్పుడూ చవిచూడలేదు. అసెంబ్లీ సీట్లతోపాటు మచిలీపట్నం ఎంపీ సీటు సైతం వైసీపీ గెలుచుకుంది. అయితే గత ఎన్నికలతో పోల్చితే పోలింగ్‌శాతం స్వల్పంగా తగ్గింది. గత ఎన్నికల్లో 84.31 శాతం ఓట్లు పోలవ్వగా...ఈసారి 84.05 శాతం ఓటింగ్ నమోదైంది.
కృష్ణా జిల్లా
|
2009 |
2014 |
2019 |
గన్నవరం |
టీడీపీ |
టీడీపీ |
టీడీపీ |
గుడివాడ |
టీడీపీ |
వైసీపీ |
వైసీపీ |
పెడన |
కాంగ్రెస్ |
టీడీపీ |
వైసీపీ |
మచిలీపట్నం |
కాంగ్రెస్ |
టీడీపీ |
వైసీపీ |
అవనిగడ్డ |
టీడీపీ |
టీడీపీ |
వైసీపీ |
పామర్రు |
కాంగ్రెస్ |
వైసీపీ |
వైసీపీ |
పెనమలూరు |
వైసీపీ |