Kodali On Chiru : పకోడిగాళ్లకూ సలహాలివ్వండి - చిరంజీవికి కొడాలి నాని కౌంటర్ !
చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై కొడాలి నాని మండిపడ్డారు. ఉచిత సలహాలు పకోడి గాళ్లకూ ఇవ్వాలని సలహా ఇచ్చారు.
Kodali On Chiru : వాల్తేరు వీరయ్య రెండు వందల రోజుల వేడుకలో ఏపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి చిరంజీవి చేసిన వ్యాఖ్యల విషయంలో వైఎస్ఆర్‌సీపీ నేతలు ఘాటుగా స్పందిస్తున్నారు. గుడివాడ సమస్యలపై చర్చించేందుకు మచిలీపట్నం కలెక్టరేట్‌కు వచ్చిన ఆయన అక్కడ మీడియతో మాట్లాడారు. ఈ సందర్భంగా చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. తమ ప్రభుత్వానికి ఇచ్చే ఉచిత సలహాలు సినీ పరిశ్రమలో ఉన్న పకోడి గాళ్లకి కూడా చెబితే బాగుంటుందన్నారు. చిరంజీవి వ్యాఖ్యలను వైఎస్ఆర్‌సీపీ సీరియస్‌గా తీసుకుంది. ఈ వరుసగా పవన్ కల్యాణ్ ఎప్పుడైనా విమర్శలు చేస్తే.. వరుసగా ప్రెస్ మీట్లు పెట్టి విరుచుకుపడే అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్‌లు ప్రెస్మీట్లు పెట్టి చిరంజీవి చేసిన కామెంట్లకు కౌంటర్ ఇవ్వనున్నారు.
అసలు చిరంజీవి ఏమన్నారంటే ?
వాల్తేరు వీరయ్య మూవీ 200 రోజుల ఈవెంట్‌లో ముఖ్యఅతిథిగా హాజరైన మెగాస్టార్ చిరంజీవి ఏపీ ప్రభుత్వ తీరుపై స్పందించారు. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలాగా సినీ ఇండస్ట్రీపై పడ్డారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా, ప్రాజెక్టులు, రాష్ట్ర అభివృద్ధి, రోడ్ల నిర్మాణంపై దృష్టి పెట్టాలని సూచించారు. పేదల కడుపు నింపే పథకాలపై ఫోకస్ పెట్టాలని మెగాస్టార్ చిరంజీవి సూచించారు. రాష్ట్రంలో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించినప్పుడు ప్రజలు మెచ్చుకుంటారు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందించే విషయంలో ప్రత్యేక ఫోకస్ పెట్టాలన్నారు.
గతంలో తాను తలవంచి నమస్కారం పెట్టిన అంశంపైనా పరోక్ష స్పందన
గతంలో ఏపీ ప్రభుత్వం టిక్కెట్ల ధరలు , ఇతర విషయాల్లో సినీ పరిశ్రమను టార్గెట్ చేసినప్పుడు చిరంజీవి సినీ బృందంతో వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడ జరిగిన ఘటనల వీడియోలను ప్రభుత్వం లీక్ చేసింది. ఇందులో చిరంజీవి ... సీఎం జగన్ ను చేతులు కట్టుకుని వేడుకుంటున్న దృశ్యాలు ఉన్నాయి. వీటిని గుర్తుకు తెచ్చేలా.. ప్రజలు కోరిన విధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందిస్తే అంతా తలవంచి నమస్కరిస్తారంటూ మెగాస్టార్ చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేశారు. మెగాస్టార్ చిరంజీవి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయంగా దుమారం రేపుతున్నాయి.
హీరోల రెమ్యూనరేషన్లపై మాట్లాడుతున్న విజయసాయిరెడ్డి, అంబటి రాంబబు
ఇటీవల ఎంపీ విజయసాయిరెడ్డి హీరోల రెమ్యూనరేషన్ల గురించి మాట్లాడుతున్నారు. ఏకంగా పార్లమెంట్ లోనూ సినిమ బడ్జెట్‌లో 70 శాతం హీరోలే తీసుకుంటున్నారని ఇలాంటి పరిస్థితి్ మారాలన్నారు. అంబటి రాంబాబు కూడా అదే అంటున్నారు. బ్రో సినిమా నిధులు , పవన్ కల్యాణ్ రెమ్యునరేషన్ .. పై విమర్శలు చేశారు. అంతేకాదు ఏ ప్రెస్‌మీట్ అయినా ఏ కార్యక్రమంలో అయినా మంత్రి అంబటి రాంబాబు బ్రో సినిమాపైనా సినీ ఇండస్ట్రీపైనా విమర్శలు చేయడంతో చిరంజీవి ఇప్పటి వరకూ మౌనంగానే ఉన్నా.. స్పందించారన్న అభిప్రాయం ఇండస్ట్రీలో వినిపిస్తోంది.