News
News
X

Vizag Summit Kishan Reddy : ఏపీ అభివృద్ధికి పూర్తి సహకారం - సమ్మిట్‌లో కేంద్ర మంత్రుల భరోసా !

ఏపీ అభివృద్ధికి కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందని కిషన్ రెడ్డి ప్రకటించారు. మరో కేంద్రమంత్రి సోనోవాల్‌ కూడా సమ్మిట్‌లో ప్రసంగించారు.

FOLLOW US: 
Share:

Vizag Summit Kishan Reddy :  కేంద్ర ప్రభుత్వం 14 కీలక రంగాల్లో అభివృద్ధి కోసం.. రెండు లక్షల కోట్ల రూపాయలను బడ్జెట్‌లో కేటాయించిందని విశాఖ పెట్టుబడుల సదస్సులో పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు.   మెబైల్ తయారీ, ఎలక్ట్రానిక్స్, ఫుడ్ ప్రొడక్ట్స్, ఫార్మా స్యూటికల్ ఏపీఐ,  మెడికల్ డివైసెస్,  బ్యాటరీస్, ఆటోమోబైల్స్ కంపోనెన్స్,  టెక్నికల్ టెక్స్ టైల్స్ వంటి వరంగాల్లో ఈ పెట్టుబడులను కేంద్రం మంజూరు చేస్తుందన్నారు. ఇవన్నీ ఇండియాను గ్లోబల్ మాన్యూఫ్యాక్చరింగ్ హబ్‌గా తయారు చేస్తాయని .. అరవై లక్షలకుపైగాఉద్యోగాలు సృష్టిస్తాయని కిషన్ రెడ్డి తెలిపారు.                                               
 
ఏపీకి కేంద్రం పూర్తి సహకారం : కిషన్ రెడ్డి 

ఆంధ్రప్రదేశ్‌కు  ఈ విషయంలో కాంపీటీటవ్  ఎడ్వాంటేజ్ ఉందని.. ఈ రంగాల్లో పెట్టుబడులు ఆకర్షించే అవకాశం ఉందన్నారు. ఫ్యార్మా స్యూటికల్, మెరైనా ప్రొడక్ట్స్, అక్వా,  ఎలక్ట్రానిక్స్, పెెట్రోలియం, ఇంజినరింగ్ తదితర రంగాల్లో ఏపీకి  మంచి అవకాశాలు ఉన్నాయన్నారు. ఏపీ అభివృద్ధి కోసం.. కేంద్రం, ఏపీ ప్రభుత్వం కలిసి పని చేస్తున్నాయన్నారు. పోటీ తత్వ  ఫెడరలిజంలో ఇది చాలా ముఖ్యమని. అన్ని రాష్ట్రాలు ఆరోగ్యకరమైన వాతారణంలో పోటీ పడి  పెట్టుబడులు సాధించుకోవడం ఆహ్వానించదగ్గ పరిణామం అన్నారు. పారిశ్రామిక వేత్తలకు అవసరమైన  మౌలిక సదుపాయాలు కల్పించి.. రాష్ట్రాలు పెట్టుబడులను ఆకర్షించాలన్నారు. 

విశాఖ స్మార్ట్ సిటీ ప్రాజెక్టుకు రూ. 3 వేల కోట్లు                

కేంద్ర ప్రభుత్వం ఏపీకి పూర్తి స్థాయిలో సహకరిస్తోందన్నారు.  రైల్వేబడ్జెట్‌లో కేంద్రం రా్ట్రానికి రూ. 8406 కోట్లు కేటాయించిందని.. ఇది గత ఏడాది కన్నా ఎనిమిది రెట్లు ఎక్కువన్నారు. 72 రైల్వేస్టేషన్లను ప్రపంచ స్థాయి రైల్వే స్టేషన్లుగా మారుసుతున్నామన్నారు.  మూడు ఇండస్ట్రియల్ కారిడార్లు ఉన్న ఏకైక రాష్ట్రంగా ఏపీ ఉందన్నారు. విశాఖఫట్నం స్మార్ట్ సిటీ ప్రాజెక్టు కోసం రూ. మూడు వేల కోట్లు పెట్టుబడి పెట్టామన్నారు.                             

విశాఖ పోర్టు అభివృద్ధి కోసం కృషి చేస్తామన్న పోర్ట్ అండ్ షిప్పింగ్ మంత్రి                    

ఇదే సమావేశంలో మరో కేంద్ర మంత్రి షర్బానంద సోనోవాల్ కూడా మాట్లాడారు. పోర్టులు, షిప్పింగ్శాఖ మంత్రి అయిన ఆయన దేశంలోనే విశాఖ ప్రత్యేకనగరంగా నిలిచిందన్నారు. విశాఖ కేంద్రంగా పలు కార్యక్రమాలు నిర్వహించడం సంతోషమని..శతాబ్దాలుగా భారత్‌లో విశాఖ కలకంగా ఉందన్నారు. ప్రధానమంత్రి మోదీ నేతృత్వంలో అంతర్జాతీయంగా ఇండియా అభివృద్ధి జరుగుతోందన్నారు. ఏపీ వేగంగా  అభివృద్ధి చెందడానికి కేంద్రం సహకారం ఎప్పుడూ ఉంటుందన్నారు. విశాఖ  పోర్టు అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామన్నారు.                   

Published at : 04 Mar 2023 01:37 PM (IST) Tags: Kishan Reddy Visakha Investment Conference Visakha Conference

సంబంధిత కథనాలు

Swaroopanandendra: తెలుగు రాష్ట్రాల సీఎంల జాతకాలు బాగున్నాయి, ప్రధానిది కూడా - స్వరూపానందేంద్ర స్వామి

Swaroopanandendra: తెలుగు రాష్ట్రాల సీఎంల జాతకాలు బాగున్నాయి, ప్రధానిది కూడా - స్వరూపానందేంద్ర స్వామి

Amaravati News : ఆర్ - 5 జోన్ ఏర్పాటుపై అమరావతి రైతుల ఆగ్రహం - అసలు వివాదం ఏంటి ? కోర్టు ఏం చెప్పింది?

Amaravati News : ఆర్ - 5 జోన్ ఏర్పాటుపై అమరావతి రైతుల ఆగ్రహం - అసలు వివాదం ఏంటి ? కోర్టు ఏం చెప్పింది?

Narasarao pet News : కోటప్పకొండ అభివృద్ధిపై చర్చకు సవాళ్లు - నర్సరావుపేటలో టీడీపీ నేత అరెస్ట్ !

Narasarao pet News : కోటప్పకొండ అభివృద్ధిపై చర్చకు సవాళ్లు - నర్సరావుపేటలో టీడీపీ నేత అరెస్ట్ !

CM Jagan Ugadi: ఉగాది వేడుకల్లో జగన్ దంపతులు, తెలుగుదనం ఉట్టిపడేలా సీఎం వస్త్రధారణ

CM Jagan Ugadi: ఉగాది వేడుకల్లో జగన్ దంపతులు, తెలుగుదనం ఉట్టిపడేలా సీఎం వస్త్రధారణ

TTD Budget: 2023-24 ఏడాదికి బడ్జెట్ విడుదల చేసిన టీటీడీ, కీలక నిర్మాణాలకు బోర్డు ఆమోదం

TTD Budget: 2023-24 ఏడాదికి బడ్జెట్ విడుదల చేసిన టీటీడీ, కీలక నిర్మాణాలకు బోర్డు ఆమోదం

టాప్ స్టోరీస్

Panchanga Sravanam 2023: పంచాంగ శ్రవణం: ఈఏడాది ఈ రంగాల్లో అన్నీ శుభాలే, వీటిలో ప్రత్యేక శ్రద్ధ అవసరం! వర్షాలెలా ఉంటాయంటే

Panchanga Sravanam 2023: పంచాంగ శ్రవణం: ఈఏడాది ఈ రంగాల్లో అన్నీ శుభాలే, వీటిలో ప్రత్యేక శ్రద్ధ అవసరం! వర్షాలెలా ఉంటాయంటే

IND Vs AUS 3rd ODI: మెల్లగా బ్యాటింగ్ చేస్తున్న ఆస్ట్రేలియా - సగం ఓవర్లు ముగిసేసరికి స్కోరు ఎంతంటే?

IND Vs AUS 3rd ODI: మెల్లగా బ్యాటింగ్ చేస్తున్న ఆస్ట్రేలియా - సగం ఓవర్లు ముగిసేసరికి స్కోరు ఎంతంటే?

Minister KTR: ఒక్క ట్వీట్ చేస్తే అక్కడ అరెస్ట్ - ఇక్కడ మేం అన్నీ భరిస్తున్నాం: మంత్రి కేటీఆర్

Minister KTR: ఒక్క ట్వీట్ చేస్తే అక్కడ అరెస్ట్ - ఇక్కడ మేం అన్నీ భరిస్తున్నాం: మంత్రి కేటీఆర్

Cars Price Hike: ఏప్రిల్ 1 నుంచి మరింత పెరగనున్న కార్ల ధరలు - ఎందుకు? ఎంత?

Cars Price Hike: ఏప్రిల్ 1 నుంచి మరింత పెరగనున్న కార్ల ధరలు - ఎందుకు? ఎంత?