అన్వేషించండి

Andhra Cabinet: కృష్ణా నదీ తీరంలో మెరీనా ప్రాజెక్టు - పర్యాటకమే గేమ్ ఛేంజర్ - ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

AP cabinet: పర్యాటక, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో పెట్టుబడులకు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పర్యాటక రంగమే గేమ్ ఛేంజర్ అని చంద్రబాబు అన్నారు.

Andhra Cabinet meeting:  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. దాదాపు 35 అంశాలతో కూడిన అజెండాపై చర్చించిన కేబినెట్, రాష్ట్ర పారిశ్రామిక మరియు మౌలిక సదుపాయాల రంగాల్లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా  ఏపీ లాజిస్టిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే ఎంఎస్‌ఎంఈ (MSME)ల బలోపేతానికి ఏపీ క్లస్టర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాంకు ఆమోదముద్ర వేసింది.
  
రాష్ట్రంలోని పాఠశాల విద్యార్థుల కోసం భారీ కేటాయింపులు చేసింది. 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు పాఠశాల కిట్‌ల పంపిణీ నిమిత్తం రూ. 944.53 కోట్ల పరిపాలన అనుమతులు ఇచ్చింది. అలాగే శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళిలో కొత్త ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో 'జల్ జీవన్ మిషన్' ద్వారా నీటి సరఫరా మెరుగుపరచడానికి రూ. 5,000 కోట్ల రుణం పొందేందుకు ప్రభుత్వ గ్యారెంటీ ఇవ్వాలని నిర్ణయించింది.                     

 
రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతిని పరుగులు పెట్టించేలా రూ. 19,391 కోట్ల విలువైన పెట్టుబడుల ప్రతిపాదనలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీని ద్వారా సుమారు 11,753 మందికి కొత్తగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అంచనా. పరిశ్రమలు, పర్యాటకం, ఫుడ్ ప్రాసెసింగ్ మరియు ఇంధన రంగాల్లో మొత్తం 14 సంస్థల ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేసింది. అమరావతిలో కృష్ణా నదీ తీరంలో ప్రతిష్టాత్మకమైన  మెరీనా ప్రాజెక్టు  ఏర్పాటుకు కూడా మంత్రివర్గం అంగీకరించింది.పర్యాటక రంగాన్ని రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే  గేమ్ ఛేంజర్ గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివర్ణించారు.  పర్యాటక రంగంలో భారీగా పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా స్థానిక యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం కొత్త వ్యూహాలను ఖరారు చేసింది.                                             

 ఎక్సైజ్ రంగంలో సంస్కరణల్లో భాగంగా బార్లలో అదనపు రిటైల్ ఎక్సైజ్ పన్నును ఉపసంహరించుకోవాలని కేబినెట్ నిర్ణయించింది. అలాగే మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో మైక్రో బ్రూవరీల ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది. సంప్రదాయేతర ఇంధన , విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రాధాన్యతనిస్తూ, రాష్ట్రవ్యాప్తంగా వివిధ అభివృద్ధి పనులకు ఈ భేటీలో మార్గం సుగమం చేశారు.             

టాప్ హెడ్ లైన్స్

Fishermen Missing: విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
MLC Duvvada Srinivas: భయపడటం, పారిపోవడం నా బ్లడ్‌లోనే లేదు.. జైలుకు వెళ్లడానికైనా రెడీ: దువ్వాడ శ్రీనివాస్
భయపడటం, పారిపోవడం నా బ్లడ్‌లోనే లేదు.. జైలుకు వెళ్లడానికైనా రెడీ: దువ్వాడ శ్రీనివాస్
Nalgonda Road Accident: హైదరాబాద్- విజయవాడ హైవేపై కారును ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు.. నలుగురు మృతి
హైదరాబాద్- విజయవాడ హైవేపై కారును ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు.. నలుగురు మృతి
Ongole Crime News: టూర్‌కు వెళ్లిన ఫ్యామిలీ ఇంట్లో భారీ చోరీ.. 700 గ్రాముల బంగారం, 8 కేజీల కేజీల వెండి మాయం!
ఒంగోలులో ఓ ఇంట్లో భారీ చోరీ.. 700 గ్రాముల బంగారం, 8 కేజీల కేజీల వెండి మాయం!

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
Prashna Ravan Arrest: నేనంటే అంత భయమెందుకు? సాయికృష్ణ లాగే పీఎస్‌లోనే చంపేయండి: 5వ అరెస్టుపై ప్రశ్న రావణ్
నేనంటే అంత భయమెందుకు? సాయికృష్ణ లాగే పీఎస్‌లోనే చంపేయండి: 5వ అరెస్టుపై ప్రశ్న రావణ్
Parliament Monsoon Session 2026: జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
Monsoon Foods To Avoid : వర్షాకాలంలో తినకూడని ఫుడ్స్ లిస్ట్.. చేపలు, రొయ్యలు, పీతలు, ఆకుకూరలు తినకూడదా?
వర్షాకాలంలో తినకూడని ఫుడ్స్ లిస్ట్.. చేపలు, రొయ్యలు, పీతలు, ఆకుకూరలు తినకూడదా?
Sai Krishna Case: ఆ భూములు నాకొద్దు.. నా కొడుకు బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా: సాయికృష్ణ తల్లి ఆవేదన
ఆ భూములు నాకొద్దు.. నా కొడుకు బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా: సాయికృష్ణ తల్లి ఆవేదన
టైర్‌పై 91, 94, XL అని ఎందుకు ఉంటుంది? టైర్ లోడ్ రేటింగ్ గురించి ప్రతి డ్రైవర్ తెలుసుకోవాల్సిన విషయాలు
మీ కారు టైర్‌పై ఉన్న లోడ్ రేటింగ్‌ను ఎప్పుడైనా గమనించారా? దీని అర్థం తెలిస్తే షాక్ అవుతారు!
CM Revanth Reddy Midjil Speech: మళ్లీ దోపిడీ రాజ్యం రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలి - మిడ్జిల్ సభలో రేవంత్ పిలుపు
మళ్లీ దోపిడీ రాజ్యం రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలి - మిడ్జిల్ సభలో రేవంత్ పిలుపు
Ongole Crime News: టూర్‌కు వెళ్లిన ఫ్యామిలీ ఇంట్లో భారీ చోరీ.. 700 గ్రాముల బంగారం, 8 కేజీల కేజీల వెండి మాయం!
ఒంగోలులో ఓ ఇంట్లో భారీ చోరీ.. 700 గ్రాముల బంగారం, 8 కేజీల కేజీల వెండి మాయం!
Embed widget