అన్వేషించండి

Kasu Mahesh Reddy Controversial Comments: అధికారంలోకి వచ్చాక ప్రతీకారం ఫస్ట్ - ప్రజలు నెక్ట్స్ - కాసు మహేష్ రెడ్డి వ్యాఖ్యలతో దుమారం !

Kasu Mahesh Reddy Revenge First: అధికారంలోకి వచ్చాక మొదట పగ సాధిస్తాం..తర్వాతే అభివృద్ధి అంటూ వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి.

 Palnadu Politics Gurazala:  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పల్నాడు ప్రాంతానికి ఒక ప్రత్యేకమైన చరిత్ర, శైలి ఉన్నాయి. అక్కడ సాగే ఫ్యాక్షన్, రాజకీయ సవాళ్లు ఎప్పుడూ కాకరేపుతుంటాయి. అయితే, తాజాగా గురజాల నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి చేసిన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సామాజిక మాధ్యమాల్లో దావానలంలా వ్యాపించాయి. పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు ప్రజాస్వామ్య విలువలను, రాజకీయ నైతికతను ప్రశ్నించేలా ఉన్నాయంటూ నెటిజన్లు, విపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి.                      

 కాసు మహేష్ రెడ్డి ఏమన్నారంటే.. "మనం మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. మొదట అభివృద్ధి గురించి ఆలోచించం. మనల్ని ఇబ్బంది పెట్టిన వారిపై, మన కార్యకర్తలను వేధించిన వారిపై పగ సాధిస్తాం, ప్రతీకారం తీర్చుకుంటాం. ఆ తర్వాతే ఏ అభివృద్ధైనా, పనైనా చూసుకుంటాం" అంటూ బహిరంగంగానే వ్యాఖ్యానించారు. కార్యకర్తల్లో జోష్ నింపేందుకు ఆయన ఈ తరహా ‘ఫ్యాక్షన్’ డైలాగులు చెప్పినప్పటికీ, ఒక బాధ్యతాయుతమైన మాజీ ప్రజాప్రతినిధి నోటి నుంచి ఇలాంటి మాటలు రావడం రాజకీయ వర్గాలను సైతం ముక్కున వేలేసుకునేలా చేసింది.      


ఈ వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కూటమి నేతలు దీనిని తీవ్రంగా ఖండిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నేతలు ఈ వీడియోను విస్తృతంగా షేర్ చేస్తూ..   ఐదేళ్ల వైఎస్సార్సీపీ వినాశకర పాలనలో రాష్ట్రం ఎందుకు వెనకబడిందో చెప్పడానికి కాసు మహేష్ రెడ్డి మాటలే ప్రత్యక్ష సాక్ష్యం అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. అధికారంలోకి వస్తే ప్రజలకు సేవ చేయాలి, ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి అనే ఆలోచన కాకుండా, కేవలం ప్రత్యర్థులపై కక్షసాధింపు చర్యలకే ప్రాధాన్యత ఇస్తామని చెప్పడం వారి రాక్షస మనస్తత్వానికి  అద్దం పడుతోందని మండిపడుతున్నారు.   

 ప్రస్తుతం కూటమి ప్రభుత్వ హయాంలో పల్నాడు వ్యాప్తంగా వైఎస్సార్సీపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులు, వేధింపుల కారణంగా .. నైరాశ్యంలో ఉన్న క్యాడర్‌లో ధైర్యం నింపడానికే ఆయన అలా మాట్లాడాల్సి వచ్చిందని, దాన్ని ప్రతిపక్షాలు కావాలనే వక్రీకరిస్తున్నాయని కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, ఒక వైపు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై బురదజల్లుతున్నారంటూ తాడేపల్లిలో ప్రెస్ మీట్లు పెడుతుంటే.. క్షేత్రస్థాయిలో ఇలాంటి 'పగ, ప్రతీకారం' వ్యాఖ్యలు చేయడం పార్టీ ఇమేజ్‌ను మరింత పాతాళానికి నెడుతోందని  భావిస్తున్నారు.  

టాప్ హెడ్ లైన్స్

Dasara Festival Rush: పండుగ రద్దీతో స్తంభించిన హైదరాబాద్- విజయవాడ హైవే.. పంతంగి వద్ద రికార్డు స్థాయిలో వాహనాలు
పండుగ రద్దీతో స్తంభించిన హైదరాబాద్- విజయవాడ హైవే.. పంతంగి వద్ద రికార్డు స్థాయిలో వాహనాలు
Vangaveeti Radhakrishna: విజయవాడ మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ నామినేషన్.. అనంతరం చిరంజీవికి స్పెషల్ థ్యాంక్స్
విజయవాడ మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ నామినేషన్.. చిరంజీవికి స్పెషల్ థ్యాంక్స్
YS Jagan: ఏపీ స్థానిక ఎన్నికల్లో ఎన్నో అరాచకాలు..! కూటమి ప్రభుత్వం, ఎస్ఈసీపై వైఎస్ జగన్ ఆరోపణలు
ఏపీ స్థానిక ఎన్నికల్లో ఎన్నో అరాచకాలు..! కూటమి ప్రభుత్వం, ఎస్ఈసీపై వైఎస్ జగన్ ఆరోపణలు
Tirupati Municipal Elections: తిరుపతి మేయర్ ఎన్నికల్లో చిల్లర నామినేషన్లు.. సంచులతో వచ్చిన అభ్యర్థులు
తిరుపతి మేయర్ ఎన్నికల్లో చిల్లర నామినేషన్లు.. సంచులతో వచ్చిన అభ్యర్థులు

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao: భార్యకు ఫ్రీ టికెట్.. భర్తకు డబుల్ టికెట్, ఇదేనా మీ ప్రజాపాలన?: మాజీ మంత్రి హరీష్ రావు
భార్యకు ఫ్రీ టికెట్.. భర్తకు డబుల్ టికెట్, ఇదేనా మీ ప్రజాపాలన?: మాజీ మంత్రి హరీష్ రావు
Hyderabad Water Board: నీళ్లు వృథా చేస్తే రూ.20 వేల ఫైన్.. వాటర్ కనెక్షన్ కట్, కఠిన చర్యలు
నీళ్లు వృథా చేస్తే రూ.20 వేల ఫైన్.. వాటర్ కనెక్షన్ కట్, కఠిన చర్యలు
Vangaveeti Radhakrishna: విజయవాడ మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ నామినేషన్.. అనంతరం చిరంజీవికి స్పెషల్ థ్యాంక్స్
విజయవాడ మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ నామినేషన్.. చిరంజీవికి స్పెషల్ థ్యాంక్స్
Thella Kagitham Nakshatra : టాలీవుడ్ యంగ్ బ్యూటీ గ్లామరస్ లుక్ - చూపులతోనే మ్యాజిక్ చేసిన తెల్లకాగితం హీరోయిన్
టాలీవుడ్ యంగ్ బ్యూటీ గ్లామరస్ లుక్ - చూపులతోనే మ్యాజిక్ చేసిన తెల్లకాగితం హీరోయిన్
YS Jagan: ఏపీ స్థానిక ఎన్నికల్లో ఎన్నో అరాచకాలు..! కూటమి ప్రభుత్వం, ఎస్ఈసీపై వైఎస్ జగన్ ఆరోపణలు
ఏపీ స్థానిక ఎన్నికల్లో ఎన్నో అరాచకాలు..! కూటమి ప్రభుత్వం, ఎస్ఈసీపై వైఎస్ జగన్ ఆరోపణలు
Mahindra XUV 3XO ZNG పేరుకే CNG కారు- అధిక మైలేజ్,పెట్రోల్ లాంటి పవర్ దీని సొంతం
Mahindra XUV 3XO ZNG పేరుకే CNG కారు- అధిక మైలేజ్,పెట్రోల్ లాంటి పవర్ దీని సొంతం
NATS: తెలుగు సంస్కృతి పరిరక్షణ కోసం 'నాట్స్' మిషిగన్ చాప్టర్‌ ప్రారంభం... హరినాథ్ పొలిచర్లకు సత్కారం
తెలుగు సంస్కృతి పరిరక్షణ కోసం 'నాట్స్' మిషిగన్ చాప్టర్‌ ప్రారంభం... హరినాథ్ పొలిచర్లకు సత్కారం
Punganur Elections: ఎంపీ మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పోలీసుల నోటీసులు.. హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్!
ఎంపీ మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పోలీసుల నోటీసులు.. హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్!
Embed widget