X
Super 12 - Match 13 - 23 Oct 2021, Sat up next
AUS
vs
SA
15:30 IST - Sheikh Zayed Stadium, Abu Dhabi
Super 12 - Match 14 - 23 Oct 2021, Sat up next
ENG
vs
WI
19:30 IST - Dubai International Cricket Stadium, Dubai

Dhulipalla : డ్రగ్స్ స్కాంపై చేసిన ఆరోపణలకు ఆధారాలివ్వండి ..ధూళిపాళ్లకు కాకినాడ పోలీసుల నోటీసులు !

డ్రగ్స్ వ్యవహారంలో ఏపీలో జరుగుతున్న ఆరోపణలు, ప్రత్యారోపణల పర్వంలో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. ఆరోపణలకు ఆధారాలు ఇవ్వాలని ధూళిపాళ్ల నరేంద్రకు కాకినాడ పోలీసులు నోటీసులు ఇచ్చారు.

FOLLOW US: 

డ్రగ్స్ కేసులో చేసిన ఆరోపణలకు సాక్ష్యాలు ఇవ్వాలని కాకినాడ పోలీసులు తెలుగుదేశం పార్టీ నేత ధూళిపాళ్ల నరేంద్రకు నోటీసులు ఇచ్చారు. శుక్రవారం ఉదయమే కాకినాడ పోలీసులు పొన్నూరు మండలం చింతలపూడిలోని నరేంద్ర ఇంటికి వచ్చారు. నరేంద్ర మీడియా సమావేశంలో చేసిన ఆరోపణలను వివరించి వాటికి ఆధారాలను తమ వద్దకు వచ్చి ఇవ్వాలని గడువు విధించారు. నోటీసులను ధూళిపాళ్ల నరేంద్ర తీసుకున్నారు. 

Also Read : ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ దంపతులపై సీబీఐ విచారణ కొనసాగింపు.. సుప్రీంకోర్టు ఆదేశం !

కాకినాడ తీరంలో బోటు తగలబడినప్పుడు మాదకద్రవ్యాల వాసన వచ్చిందని సమాచారం ఉందని అందుకే తాను అలా మాట్లాడానని ధూళిపాళ్ల నరేంద్ర నోటీసులు తీసుకున్న తర్వాత మీడియాకు చెప్పారు. డ్రగ్స్ కేసును ఎన్‌ఐఏ దర్యాప్తు చేస్తోందని అయితే ఈ విషయంలో తనకు ఏపీ పోలీసులు నోటీసులు ఇవ్వడం ఏమిటని ఆయన ప్రశ్నించారు.  పోలీసులు ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. వేల కోట్ల డ్రగ్స్ దొరికితే ముఖ్యమంత్రి తీరిగ్గా స్పందించారని మండిపడ్డారు. విద్యాసంస్థల్లో మత్తు మందులు ఉండరాదని ముఖ్యమంత్రి చెప్పటం అనుమానాలకు తావిస్తోందన్నారు. ఇప్పటి వరకూ విద్యాసంస్థల్లో మత్తు మందులు ఉన్నట్లే అనిపిస్తోందని ధూళిపాళ్ల అనుమానం వ్యక్తం చేశారు. 

Also Read : హెటిరో డ్రగ్స్ సంస్థపై ఐటీ దాడులు.. 100 కోట్ల నగదు స్వాధీనం!

గుజరాత్‌లోని ముంద్రా పోర్టులో పెద్ద ఎత్తున డ్రగ్స్ పట్టుపడ్డాయి. ఆ డ్రగ్స్‌ను విజయవాడలో నమోదైన ఆషీ ట్రేడింగ్ కంపెనీ దిగుమతి చేసుకుంది. ఆ కంపెనీ అంతకు ముందు కూడా పెద్ద ఎత్తున డ్రగ్స్ దిగుమతి చేసుకుంది. దీనికి సంబంధించిన జీఎస్టీ రికార్డులను తెలుగుదేశం పార్టీ నేతలు బయట పెట్టారు. అయితే పోలీసులు, ప్రభుత్వం మాత్రం కంపెనీ ఇక్కడ రిజిస్టర్ అయింది తప్పితే ఇక .. ఏపీకి ఎలాంటి సంబంధం లేదని చెబుతూ వస్తున్నారు. అయితే టీడీపీ నేతలు మాత్రం ఆరోపణలు ఆపలేదు. 

Also Read : దుగ్గిరాల ఎంపీపీ ఎన్నిక వాయిదా ! లోకేష్ - ఆళ్ల హోరాహోరీలో పైచేయి ఎవరిది ?

కొద్ది రోజుల కిందట కాకినాడ తీరంలో ఓ బోటు తగలబడిపోయింది.  ఆ బోటులో హెరాయిన్ ఉందని.. అందుకే వాసన వచ్చిందని ధూళిపాళ్ల నరేంద్ర ప్రెస్‌మీట్ పెట్టి ఆరోపించారు. ఆ తర్వాత మరో  నేత పట్టాభి కూడా ఈ అంశంపై ఆరోపణలు చేశారు. కాకినాడ పోర్టుకు వెళ్లి నేతలంతా పరిశీలించారు. అక్కడ వారిపై దాడికి ప్రయత్నం జరిగింది ఈ పరిణామాల నేపధ్యంలో చేసిన ఆరోపణలకు ఆధారాలివ్వాని కాకినాడ పోలీసులు ధూళిపాళ్ల నరేంద్రకు నోటీసులు ఇవ్వడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశం అయింది. 

Also Read : "దుర్గమ్మ గుడి మొత్తం వైఎస్ఆర్‌సీపీ రంగుల లైట్లు..." నిజం కాదు ! ఫేక్ !

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: Drugs Case andhra drugs Dhulipalla Narendra kakinada police drugs smuggling andhra drugs scam

సంబంధిత కథనాలు

Babu Delhi : చంద్రబాబు ఢిల్లీ టూర్‌ బీజేపీకి దగ్గరవడానికా ? ఏపీలో రాజకీయాలు మారుతున్నాయా ?

Babu Delhi : చంద్రబాబు ఢిల్లీ టూర్‌ బీజేపీకి దగ్గరవడానికా ? ఏపీలో రాజకీయాలు మారుతున్నాయా ?

Breaking News Live: హుజూరాబాద్ లో దద్దమ్మ గెలవాలా? అసెంబ్లీని దద్దరిల్లించే వాళ్ళు గెలవాలా?: కిషన్ రెడ్డి

Breaking News Live: హుజూరాబాద్ లో దద్దమ్మ గెలవాలా? అసెంబ్లీని దద్దరిల్లించే వాళ్ళు గెలవాలా?: కిషన్ రెడ్డి

Tirupati: తిరుపతిలో విషాదం.. వర్షపు నీటిలో మునిగిన వాహనం.. నవ వధువు దుర్మరణం

Tirupati: తిరుపతిలో విషాదం.. వర్షపు నీటిలో మునిగిన వాహనం.. నవ వధువు దుర్మరణం

Corona Vaccination: ఏపీలో ఆ జిల్లాలోనే వ్యాక్సినేషన్ రికార్డు.. ఎన్ని డోసులు కంప్లీట్ అయ్యాయంటే?

Corona Vaccination: ఏపీలో ఆ జిల్లాలోనే వ్యాక్సినేషన్ రికార్డు.. ఎన్ని డోసులు కంప్లీట్ అయ్యాయంటే?

Happy Birthday Prabhas: డార్లింగ్ ప్రభాస్ కి ఇలాంటి బర్త్ డే గిఫ్ట్ ఎవ్వరూ ఇచ్చి ఉండరు..

Happy Birthday Prabhas: డార్లింగ్ ప్రభాస్ కి ఇలాంటి బర్త్ డే గిఫ్ట్ ఎవ్వరూ ఇచ్చి ఉండరు..
SHOPPING
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

T20 World Cup 2021: పదేళ్ల తర్వాత ప్రపంచకప్‌ గెలిచే సత్తా కోహ్లీసేనకు ఉందా? ధోనీ మెంటారింగ్‌తో లాభం ఏంటి?

T20 World Cup 2021: పదేళ్ల తర్వాత ప్రపంచకప్‌ గెలిచే సత్తా కోహ్లీసేనకు ఉందా? ధోనీ మెంటారింగ్‌తో లాభం ఏంటి?

Corona virus: కరోనా కారణంగా భారతీయుల ఆయుర్ధాయం తగ్గిపోయిందా? కొత్త అధ్యయనంలో కలవరపెట్టే నిజాలు

Corona virus: కరోనా కారణంగా భారతీయుల ఆయుర్ధాయం తగ్గిపోయిందా? కొత్త అధ్యయనంలో కలవరపెట్టే నిజాలు

Happy Birthday Prabhas: భారతీయ సినిమాకే బాహుబలి.. కానీ మనిషి మాత్రం డార్లింగే..

Happy Birthday Prabhas: భారతీయ సినిమాకే బాహుబలి.. కానీ మనిషి మాత్రం డార్లింగే..

WhatsApp: వాట్సాప్ విదేశి సంస్థ.. భారత చట్టాలను సవాలు చేయలేదు.. అడిగితే సమాచారం ఇవ్వాల్సిందే.. కేంద్రం

WhatsApp: వాట్సాప్ విదేశి సంస్థ.. భారత చట్టాలను సవాలు చేయలేదు.. అడిగితే సమాచారం ఇవ్వాల్సిందే.. కేంద్రం