అన్వేషించండి

Hyderabad common capital Issue : ఉమ్మడి రాజదాని కోసం జేడీ లక్ష్మినారాయణ పోరాటం - పట్టించుకోని ఇతర ఏపీ పార్టీలు !

Andhra News : హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కోసం జేడీ లక్ష్మినారాయణ పదే పదే డిమాండ్ చేస్తున్నారు. అయితే ఏపీ నుంచి ఆయన ఒక్కరే ఈ డిమాండ్ చేస్తున్నారు. ఇతర పార్టీల్ని తనతో పాటు డిమాండ్ చేయాలని కోరుతున్నారు.

Hyderabad  common capital News  :  జూన్ రెండో తేదీతో విభజన చట్టం ప్రకారం హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అనే హోదాను కోల్పోతుంది. పూర్తి స్థాయిలో తెలంగాణకు రాజధానిగా మారుతుంది. అయితే మరో పదేళ్లు ఉమ్మడి రాజధానిగా కొనసాగించేలా చూడాలని జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు వీవీ లక్ష్మినారాయణ డిమాండ్ చేస్తున్నారు. సమయం ముంచుకొస్తున్నందున అందరూ స్పందించాలని కోరుతున్నారు. హైదరాబాద్ ను ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా పదేళ్లకు మించి కొనసాగించాలనే అంశాన్ని ఏపీలోని అన్ని రాజకీయ పార్టీలు వెంటనే లేవనెత్తాలని పిలుపునిచ్చారు.  ఇదే అంశంపై లక్ష్మీనారాయణ కొన్ని రోజుల కిందట కూడా స్పందించారు. ఏపీకి ఇంత వరకు రాజధాని ఏర్పడనందున, హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా మరో పదేళ్లు పొడిగిస్తూ  భారత రాష్ట్రపతి ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకురావాలని కోరారు.

 

 

అయితే ఉమ్మడి రాజధాని కొనసాగింప అంశంపై ఏపీలో మరి ఏ ఇతర రాజకీయ పార్టీ కూడా స్పందించడం లేదు. ప్రధన పార్టీలైన టీడీపీ, వైసీపీ, జనసేన ఈ విషయంలో మౌనంగా ఉంటున్నాయి. గతంలో వైసీపీకి చెందిన కొంత మంది నేతలు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను కొనసాగించాలన్న ప్రస్తావన తెచ్చారు. తర్వాత మళ్లీ మాట్లాడలేదు. ఇప్పుడు అసలు పట్టించుకోవడం లేదు. తెలుగుదేశం, జనసేన నేతలు అసలు ఈ టాపిక్ పై ఆసక్తి లేనట్లుగా ఉన్నారు. 

మరో వైపు జూన్ రెండో తేదీ తర్వాత ఏపీ అధీనంలో ఉన్న భవనాలను తెలంగాణ ప్రభుత్వం  స్వాధీవం చేసుకోనుంది. ప్రస్తుతం లేక్ వ్యూ గెస్ట్ హౌస్ తో పాటు మరికొన్ని భవనాలు మాత్రమే ఏపీ అధీనంలో ఉన్నాయి. విభజన చట్టం ప్రకారం వాటిని ఏపీకి కేటాయించినందున.. ఆటోమేటిక్ గా అవి పదేళ్ల తర్వాత అంటే జూన్ రెడో తేదీన  తెలంగాణ పరం అవుతాయి. ఏపీ అధికారులు తాము స్వాధీనం  చేయబోమని నిరాకరించే అవకాశం ఉండదు. ప్రదాన పార్టీలు ఉమ్మడి రాజధానిపై సైలెంట్ గా ఉండాటనికి కారణం... ఎలాంటి వ్యవహారాలు ప్రస్తుతం హైదరాబాద్ నుంచి జరగకపోవడమేనని భావిస్తున్నారు. 

ఉమ్మి రాజధానిగా ఉన్నప్పటికీ గత ఆరేడేళ్లుగా ఏపీ పాలన పూర్తిగా ఏపీ నుంచే జరుగుతోంది. హైదరాబాద్ నుంచి చిన్న అధికారిక కార్యక్రమం కూడా జరగడం లేదు. ఇలాంటి ఉమ్మడి రాజధాని అనే ప్రస్తావన తీసుకు వస్తే.. సొంత రాజధాని విషయంలో మరింత గందరగోళం అవుతుందన్న ఉద్దేశంతో ఏపీ రాజకీయ పార్టీలు సైలెంట్ గా ఉంటున్నాయి. పైగా ప్రస్తతం ఎన్నికల ఫలితాల హడావుడిలో అక్కడి రాజకీయ పార్టీలు ఉన్నాయి. అందుకే పెద్దగా పట్టించుకోవడం లేదు.                                   

టాప్ హెడ్ లైన్స్

Anakapalle Mines Surveyor ACB: ఒక్క సారే రూ.5 లక్షల క్యాష్ లంచం - రెడ్ హ్యాండెడ్‌గా చిక్కిన అనకాపల్లి మైన్స్ సర్వేయర్
ఒక్క సారే రూ.5 లక్షల క్యాష్ లంచం - రెడ్ హ్యాండెడ్‌గా చిక్కిన అనకాపల్లి మైన్స్ సర్వేయర్
AP Cabinet Decisions Ease: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు - రూ.1,000 కోట్ల క్వాంటమ్ వ్యాలీ, దిశా బిల్లు రద్దు!
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు - రూ.1,000 కోట్ల క్వాంటమ్ వ్యాలీ, దిశా బిల్లు రద్దు!
Banakacherla Project: పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుకు కేంద్రం షాక్ - పర్యావరణ అనుమతుల ప్రతిపాదన వెనక్కి!
పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుకు కేంద్రం షాక్ - పర్యావరణ అనుమతుల ప్రతిపాదన వెనక్కి!
Chiranjeevi AP Brand Ambassador Rumors: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా చిరంజీవి? క్లారిటీ ఇచ్చిన మెగాస్టార్ టీమ్!
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా చిరంజీవి? క్లారిటీ ఇచ్చిన మెగాస్టార్ టీమ్!

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
రూ.2.87 లక్షల నుంచి రూ.4.05 లక్షల వరకు KTM 390 అడ్వెంచర్.. ఒక్కో వేరియంట్‌ది ఒక్కో ప్రత్యేకత
KTM 390 అడ్వెంచర్‌లో ఏ వేరియంట్ బెస్ట్? నాలుగు మోడళ్ల మధ్య పూర్తి తేడాలు ఇవే
YSRCP Protest In Vijayawada: విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
Tarun Tejpal Judgement: అత్యాచారం కేసులో దోషిగా తేలిన తరుణ్ తేజ్‌పాల్! సుప్రీంకోర్టుకు వెళ్లనున్న జర్నలిస్ట్!
అత్యాచారం కేసులో దోషిగా తేలిన తరుణ్ తేజ్‌పాల్! సుప్రీంకోర్టుకు వెళ్లనున్న జర్నలిస్ట్!
Pregnancy Test : పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
భువీకి ఛాన్స్.. పంత్కి నో వన్డే వరల్డ్ కప్ 2027 టీమ్ ఇదేనా ?
భువీకి ఛాన్స్.. పంత్కి నో వన్డే వరల్డ్ కప్ 2027 టీమ్ ఇదేనా ?
ప్లెమింగ్ మాస్టర్ ప్లాన్ తో సీఎస్ కే కి డబుల్ షాక్
ప్లెమింగ్ మాస్టర్ ప్లాన్ తో సీఎస్ కే కి డబుల్ షాక్
Embed widget