News
News
వీడియోలు ఆటలు
X

TDP News : శైలజానాథ్ తో జేసీ చర్చలు - టీడీపీలో చేరికకు ముహుర్తం ఖరారయిందా ?

మాజీ మంత్రి శైలజానాథ్ తో జేసీ దివాకర్ రెడ్డి చర్చలు జరిపారు. టీడీపీలోకి ఆహ్వానించినట్లుగా ప్రచారం జరుగుతోంది.

FOLLOW US: 
Share:

TDP News :  పీసీసీ మాజీ అధ్యక్షుడు , కాంగ్రెస్ పార్టీ కీలక నేత సాకే శైలజానాథ్ తో  మాజీ  ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సమావేశమయ్యారు.  సాకే శైలజానాథ్ ను టీడీపీలోకి ఆహ్వానించినట్లుగా చెబుతున్నారు. శింగనమల నంచి గతంలో రెండు సార్లు గెలిచిన శైలజానాథ్ మంత్రిగా కూడా పని చేశారు. ప్రస్తుతం శింగనమలలో టీడీపీ గ్రూపు రాజకీయాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ కారణంగా ఇంకా ఇంచార్జిని కూడా నియమించలేదు. బలమైన అభ్యర్థి ఉండాలని.. తాము సూచించిన వారికే టిక్కెట్ ఇవ్వాలని జేసీ బ్రదర్స్ పట్టుబడుతున్నారు. దీంతో టీడీపీ హైకమాండ్ అక్కడ అభ్యర్థిత్వం ఎవరికి అన్నది ఖరారు చేయలేదు. ఈ క్రమంలో జేసీ .. శైలజానాథ్ తో చర్చలు జరపడం హాట్ టాపిక్ గా మారింది.                                  

శైలజానాథ్ టీడీపీలో చేరుతారని కొంత కాలంగా ప్రచారం

కొంత కాలంగా శైలజానాథ్ టీడీపీలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. పీసీసీ చీఫ్‌గా పదవి కాలం పూర్తయిన తర్వాత శైలజానాథ్ కాంగ్రెస్ రాజకీయాల్లో యాక్టివ్ గా లేరు. వచ్చే ఎన్నికల్లో తాను శింగనమల నుంచే పోటీ చేయాలనుకుంటున్నానని  శైలజానాధ్ ప్రకటించారు. అయితే, ఏ పార్టీ నుంచి అనేది మాత్రం త్వరలో చెబుతానంటూ వెల్లడించారు. ఇప్పటికే శైలజానాద్ టీడీపీ ముఖ్య నాయకత్వం తో టచ్ లోకి వెళ్లినట్లు సమాచారం. శైలజానాద్ 2004, 2009 ఎన్నికల్లో అప్పటి టీడీపీ సీనియర్ నేత శమంతమణి పైన విజయం సాధించారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత శమంతకమణికి ఎమ్మెల్సీగా  అవకాశం ఇచ్చారు. 2014 ఎన్నికల్లో శంమతకమణి కుమార్తె యామినీ బాల టీడీపీ నుంచి ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి పైన విజయం సాధించారు.

శింగనమల నియోజకవర్గంలో బలమైన అభ్యర్థి కోసం వెదుకుతున్న టీడీపీ

2019 ఎన్నికల్లో ప్రస్తుత టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ బండారు శ్రావణి పైన జొన్నలగడ్డ పద్మావతి గెలుపొందారు. వచ్చే ఎన్నికల్లో బండారు శ్రావణి టీడీపీ నుంచి తిరిగి సీటు ఆశిస్తున్నారు. నియోజకవర్గంలో కొంత కాలంగా టీడీపీలో విభేదాలు నెలకొన్నాయి. ఇప్పుడు శైలజానాద్ కు సీటు పైన హామీ దక్కుతుందా లేదా అనేది కీలకంగా మారింది.వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే టిక్కెట్లు ఇస్తామని టీడీపీ నేతలు అంటున్నారు. అందుకే  బలమైన నేతల్ని చేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అనంతపురం పార్లమెంట్ నుంచి జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు పోటీ చేసే అవకాశం ఉంది. బలమైన అభ్యర్థులు అసెంబ్లీ పరిధిలో ఉండాలని ఆయన కోరుతున్నారు. శైలజానాథ్ బలమైన అభ్యర్థి అవుతారని ఆయన అనుకుంటున్నారు. 

వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం ఇరు పార్టీల ప్రయత్నాలు

అనంతపురం జిల్లా ప్రజలు మద్దతిస్తే మొత్తం ఏకపక్షంగా ఒకే పార్టీకి మద్దతుగా నిలుస్తారు. 2014 ఎన్నికల్లో వైసీపీకి కేవలం రెండు సీట్లు మాత్రమే దక్కాయి. అదే 2019 ఎన్నికల్లో టీడీపీ రెండు సీట్లకే పరిమితం అయింది. వచ్చే ఎన్నికల్లో తిరిగి పార్టీ బలోపేతం దిశగా నియోజకవర్గాల వారీగా చంద్రబాబు కొన్నాళ్లుగా కసరత్తు చేస్తున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో లోకేష్ పాదయాత్ర విజయవంతం కావడంతో ఆ పార్టీ నేతలు సంతృప్తిగా ఉన్నారు. 

Published at : 26 Apr 2023 03:07 PM (IST) Tags: JC Diwakar Reddy Anantapur News Shailajanath senior leader in TDP

సంబంధిత కథనాలు

Breaking News Live Telugu Updates: ఏపీ కేబినెట్‌ సమావేశం ప్రారంభం- సీపీఎస్‌పై కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్

Breaking News Live Telugu Updates: ఏపీ కేబినెట్‌ సమావేశం ప్రారంభం- సీపీఎస్‌పై కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్

Top 10 Headlines Today: నేటి నుంచి ఆసీస్‌, ఇండియా మధ్య గదా యుద్ధం, ఇది సినిమా కాదు ఎమోషన్ అంటున్న ప్రభాస్‌

Top 10 Headlines Today: నేటి నుంచి ఆసీస్‌, ఇండియా మధ్య గదా యుద్ధం, ఇది సినిమా కాదు ఎమోషన్ అంటున్న ప్రభాస్‌

Kriti Sanon Om Raut : తిరుమలలో వివాదాస్పదంగా మారిన కృతి సనన్, ఓం రౌత్ ప్రవర్తన

Kriti Sanon Om Raut : తిరుమలలో వివాదాస్పదంగా మారిన కృతి సనన్, ఓం రౌత్ ప్రవర్తన

Top 10 Headlines Today: నేడు ఏపీ మంత్రి మండలి సమావేశం, ఐసీసీ ట్రోఫీ అందుకోవాలని ఇండియా, ఆసీస్‌ మధ్య ఫైట్

Top 10 Headlines Today: నేడు ఏపీ మంత్రి మండలి సమావేశం, ఐసీసీ ట్రోఫీ అందుకోవాలని ఇండియా, ఆసీస్‌ మధ్య ఫైట్

AP Cabinet : ముందస్తుపై కీలక ఆలోచనలు చేస్తారా ? ఏపీ కేబినెట్ భేటీపై ఉత్కంఠ !

AP Cabinet : ముందస్తుపై కీలక ఆలోచనలు చేస్తారా ? ఏపీ కేబినెట్ భేటీపై ఉత్కంఠ !

టాప్ స్టోరీస్

Modi Telangana Tour: మరోసారి తెలంగాణకు మోదీ, ఈసారి రోడ్‌ షోకి కూడా ప్లాన్!

Modi Telangana Tour: మరోసారి తెలంగాణకు మోదీ, ఈసారి రోడ్‌ షోకి కూడా ప్లాన్!

Odisha Train Accident: ఒడిశాలోని ఓ మార్చురీలో హర్రర్ సినిమాను తలపించే సీన్‌- రక్తంలా కనిపిస్తున్న నీళ్లు!

Odisha Train Accident: ఒడిశాలోని ఓ మార్చురీలో హర్రర్ సినిమాను తలపించే సీన్‌- రక్తంలా కనిపిస్తున్న నీళ్లు!

YS Viveka Case : అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్‌ రద్దు చేయండి - సుప్రీంకోర్టులో సునీత పిటిషన్

YS Viveka Case :  అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్‌ రద్దు చేయండి -   సుప్రీంకోర్టులో సునీత పిటిషన్

WTC Final 2023: ఓవల్ ఎవరికి అనుకూలం - భారత్, ఆసీస్‌ల రికార్డులు ఎలా ఉన్నాయి?

WTC Final 2023: ఓవల్ ఎవరికి అనుకూలం - భారత్, ఆసీస్‌ల రికార్డులు ఎలా ఉన్నాయి?