Janasena Gift: పవన్ గెలిస్తే ఊరంతా పార్టీ ఇస్తానన్న నిరుపేద బామ్మ - ఆ ఒక్క డైలాగ్‌తో ఫేట్ మారిపోయింది
Andhrapradesh News: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాలతో జనసేన పార్టీ ఓ నిరుపేద కుటుంబానికి సాయం అందించింది. వారి జీవనోపాధి మెరుగుపడేలా ఆటోను బహూకరించింది.
![Janasena Gift: పవన్ గెలిస్తే ఊరంతా పార్టీ ఇస్తానన్న నిరుపేద బామ్మ - ఆ ఒక్క డైలాగ్‌తో ఫేట్ మారిపోయింది Janasena presents auto to rickshaw puller family with pawan kalyan orders Janasena Gift: పవన్ గెలిస్తే ఊరంతా పార్టీ ఇస్తానన్న నిరుపేద బామ్మ - ఆ ఒక్క డైలాగ్‌తో ఫేట్ మారిపోయింది](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/08/7a366f0006140ca697825e8ece8600f81720426568055876_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Janasena Presents Auto To Poor Family In Pithapuram: 'పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే మా ఆయన రిక్షా తొక్కగా వచ్చిన డబ్బులతో ఊరంతా పార్టీ ఇచ్చేస్తా' ఇదీ పిఠాపురంలో మరియమ్మ అనే మహిళ ఎగిరి గంతేస్తూ సంతోషంతో అన్న మాటలు. ఈ కామెంట్స్ అప్పట్లో నెట్టింట వైరల్‌గా మారాయి. తాజాగా, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఆదేశాలతో జనసేన పార్టీ ఆ కుటుంబానికి స్పెషల్ గిఫ్ట్ అందించింది. నిరుపేద కుటుంబానికి వారి జీవనోపాధి మెరుగుపరిచేలా ఓ ఆటోను బహూకరించింది. దీనిపై మరియమ్మ, ఆమె భర్త హర్షం వ్యక్తం చేశారు. నిన్నటి వరకూ మరియమ్మ భర్త రిక్షా తొక్కుతూ కుటుంబాన్ని పోషించేవారు. ఇప్పుడు ఆటో అందించడంతో ఆయన ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఈ ఆటోతో తమ ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుందని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమకు ఆటో అందించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్,, జనసేన పార్టీకి కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Also Read: Nara Lokesh: మంత్రి నారా లోకేశ్ చొరవ - 25 మంది దివ్యాంగ విద్యార్థులకు ఐఐటీ, ఎన్ఐటీల్లో సీట్లు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)