News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Janasena Digital Politics : 'జగనన్న ఇళ్లు - పేదలందరికీ కన్నీళ్లు' - డిజిటల్ పొలిటికల్ వార్‌కి జనసేన రెడీ

జగనన్న కాలనీల్లో అతి పెద్ద స్కాం జరిగిందని జనసేన ఆరోపించింది. సోషల్ ఆడిట్ చేసి.. డిజిటల్ క్యాెంపైన్ నిర్వహించాలని నిర్ణయించుకుంది.

FOLLOW US: 
Share:

 

Janasena Digital Politics : జనసేన మరోసారి జగన్ సర్కార్‌పై డిజిటల్ సమరం ప్రారంభించింది.  జగనన్న కాలనీల్లో అతి పెద్ద స్కాం దాగి ఉందని  దాన్ని బయట పెట్టాలని నిర్ణయించుకుంది. జగనన్న ఇళ్ళ పేరుతో అదికార పార్టికి చెందిన నాయకులు కోట్ల రూపాయలు దోచుకున్నారని.. .సోషల్ మీడియా వేదిక గా జగనన్న కాలనీల్లో అవినీతి పై పోరాటం చేయాలని  ఆ పార్టీ నేతల నాదెండ్ల మనోహర్ పార్టీ కార్యకర్తలకు పిలుపునచ్చారు.  రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇళ్ల పేరుతో చేపడుతున్న జగనన్న కాలనీలు అతి పెద్ద స్కాం అని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. భూమి కొనుగోలు, మౌలిక వసతులు పేరిట వేల కోట్లు అవినీతి చేశారని ఆయన ఆరోపించారు. 

మూడు రోజుల పాటు డిజిటల్ క్యాంపెయిన్ 

జగనన్న కాలనీల పేరిట పేదవాడికి జరిగిన అన్యాయాన్ని ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశంతో జనసేన అధ్యక్షులు  పవన్ కళ్యాణ్  ఆదేశాల మేరకు ఈ నెల 12, 13, 14 తేదీల్లో 'జగనన్న ఇళ్లు - పేదలందరికీ కన్నీళ్లు' అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో భాగంగా తీసిన ఫోటోలు, వీడియోలను #Jagananna Mosam హ్యాష్ ట్యాగ్ ద్వారా సోషల్ మీడియాలో పోస్టు చేసి ప్రభుత్వ తీరును ఎండగట్టాలని  నాదెండ్ల పిలుపునిచ్చారు. పవన్ కళ్యాణ్ కూడ  రాష్ట్రంలో ఒక చోట అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న జగనన్న కాలనీలను పరిశీలిస్తారని తెలిపారు. పేదలందరికీ ఇళ్లు పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 28 లక్షల 30వేల మందికి ఇళ్లు నిర్మించి ఇస్తామని ముఖ్యమంత్రి జగన్ రెడ్డి  హామీ ఇచ్చారని నాదెండ్ల మనోహర్  గుర్తు చేశారు. అందులో భాగంగా తొలి విడతలో 18,63,552 గృహాలు 2022 జూన్ నాటికి నిర్మించి పేదలకు అందిస్తామని చెప్పారని, చెప్పిన గడువు ముగిసి ఐదు నెలలు కావొస్తోందన్నారు. రాష్ట్రంలో ఎక్కడా కూడా ఒక్క ఇల్లు కూడా పేదలకు ఇచ్చిన దాఖలాలు లేవని మండిపడ్డారు.

పేదలకు ఇళ్ల పేరుతో వేల కోట్ల దోపిడి !

జగనన్న కాలనీల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 68,677 ఎకరాలను ప్రభుత్వం కొనుగోలు చేసింది. రూ.10 నుంచి రూ.20 లక్షలు విలువ చేసే ఎకరా భూమిని రూ. 70 లక్షలు నుంచి కోటి రూపాయలు పెట్టి కొనుగోలు చేశారని.. సుమారు  23,500 కోట్లు వెచ్చించి ఈ భూములు కొన్నారని జనసేన చెబుతోంది.  ఇందులో వందల కోట్లు చేతులు మారాయని ఆరోపించారు.అలాగే మౌలిక సదుపాయాలు కోసం మరో రూ.34 వేల కోట్లు ప్రభుత్వం కేటాయించిందని,ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేసినా జగనన్న కాలనీల్లో తాగునీరు, రోడ్లు వంటి కనీసం మౌలిక సదుపాయాలు లేవని నాదెండ్ల మనోహర్ గుర్తు చేశారు.  గృహ నిర్మాణ పధకానికి నిధులన్నీ కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నవేనని, ఈ ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఇసుకను మాత్రమే ఉచితంగా అందిస్తోందని తెలిపారు.అది కూడా ఇసుక రవాణాకు అయ్యే ఖర్చు లబ్ధిదారుడే భరించాలని కండీషన్ కూడ పెట్టారని మండిపడ్డారు.  

మూడున్నరేళ్లుగా ఒక్క ఇళ్లూ పేదలకు ఇవ్వని వైనం !

జగనన్న ఇళ్లు పేరిట గత మూడున్న రేళ్లుగా జరుగుతున్న దోపిడీని ప్రపంచానికి తెలియజేయాల్సిన బాధ్యత ప్రతిపక్ష పార్టీగా జనసేన పై ఉందని, 2020లో పులివెందుల, కాకినాడ, విజయనగరంలో జగనన్న కాలనీలకు ముఖ్యమంత్రి శంకుస్థాపనలు చేశారని,  జూన్ 2022 కల్లా తొలి విడత ఇళ్లను పూర్తి చేస్తామని చెప్పి,గడువు దాటినా దీని గురించి ముఖ్యమంత్రి మాట్లాడటం లేదన్నారు. ఈ నెల 12, 13 తేదీల్లో స్థానికంగా ఉన్న జగనన్న కాలనీలను సందర్శించి ఇళ్ల నిర్మాణాన్ని పరిశీలించి, 14వ తేదీన పథకం లబ్ధిదారుల జాబితా, వారికి ఏ మేరకు నిధులు విడుదల చేశారు,మౌలిక సదుపాయాల కల్పన ఖర్చులు లాంటి అంశాలపై సోషల్ ఆడిట్ చేస్తామని అన్నారు.

సోషల్ ఆడిట్ చేసి సోషల్ మీడియాలో ఫోటోలు ! 

గతంలో రహదారుల దుస్థితిపై గుడ్ మార్నింగ్ సీఎం సార్ హ్యాష్ ట్యాగ్ తో సోషల్ మీడియాలో ఏ విధంగా ఫోటోలు, వీడియోలు అప్ లోడ్ చేశామో,అదే విధంగా #jagananna Mosam అనే హ్యాష్ ట్యాగ్ తో ఇళ్ల దుస్థితి, కాలనీల పరిస్థితి, గృహనిర్మాణ లబ్దిదారుల బాధలను తెలియజేసే ఫోటోలు, వీడియోలు అప్ లోడ్ చేయాలని ఆయన పిలుపునిచ్చారు.స్థానిక నాయకులు, జనసైనికులు, వీరమహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొని, ప్రభుత్వ మోసాలను ఎండగట్టాలని నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. 

Published at : 09 Nov 2022 06:56 PM (IST) Tags: Jana sena Nadendla Manohar Jana Sena Digital Campaign Corruption in Jagananna Houses

ఇవి కూడా చూడండి

APPSC Group 2 Recruitment: ఏపీపీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల, 897 ఖాళీల భర్తీకి డిసెంబరు 21 నుంచి దరఖాస్తులు

APPSC Group 2 Recruitment: ఏపీపీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల, 897 ఖాళీల భర్తీకి డిసెంబరు 21 నుంచి దరఖాస్తులు

Income Tax: మీ పాత ఇంటిని అమ్ముతున్నారా?, ఎంత టాక్స్‌ కట్టాలో ముందు తెలుసుకోండి

Income Tax: మీ పాత ఇంటిని అమ్ముతున్నారా?, ఎంత టాక్స్‌ కట్టాలో ముందు తెలుసుకోండి

Vizag Pawan Kalyan : ఏపీ భవిష్యత్ కోసమే టీడీపీ, జనసేన కూటమి - విశాఖలో పవన్ కీలక వ్యాఖ్యలు !

Vizag Pawan Kalyan :  ఏపీ భవిష్యత్ కోసమే టీడీపీ, జనసేన కూటమి - విశాఖలో పవన్ కీలక వ్యాఖ్యలు !

Anantapur News: అనంతపురంలో సైబర్ క్రైమ్! రూ.300 కోట్లకు పైగా లావాదేవీలు?

Anantapur News: అనంతపురంలో సైబర్ క్రైమ్! రూ.300 కోట్లకు పైగా లావాదేవీలు?

andhra Caste Census Postpone : ఏపీలో కులగణన మళ్లీ వాయిదా - భారీ వర్షాలే కారణం !

andhra Caste Census Postpone : ఏపీలో కులగణన మళ్లీ వాయిదా - భారీ వర్షాలే కారణం  !

టాప్ స్టోరీస్

Revanth Reddy Secretariat: ముఖ్యమంత్రి ఛాంబర్‌లో రేవంత్ రెడ్డి, బాధ్యతల స్వీకరణ - వేద పండితుల ఆశీర్వచనం

Revanth Reddy Secretariat: ముఖ్యమంత్రి ఛాంబర్‌లో రేవంత్ రెడ్డి, బాధ్యతల స్వీకరణ - వేద పండితుల ఆశీర్వచనం

Vadhuvu Web Series Review - వధువు వెబ్ సిరీస్ రివ్యూ: అవికా గోర్‌కి పెళ్లి - ఎందుకు మళ్ళీ మళ్ళీ?

Vadhuvu Web Series Review - వధువు వెబ్ సిరీస్ రివ్యూ: అవికా గోర్‌కి పెళ్లి - ఎందుకు మళ్ళీ మళ్ళీ?

Telangana Cabinet : హోంమంత్రిగా ఉత్తమ్ - భట్టి, సీతక్కలకు ఇచ్చిన శాఖలు ఏమిటంటే ?

Telangana Cabinet :  హోంమంత్రిగా ఉత్తమ్  - భట్టి, సీతక్కలకు ఇచ్చిన శాఖలు ఏమిటంటే ?

Jio New Plans: సోనీలివ్, జీ5 సబ్‌స్క్రిప్షన్లు అందించే కొత్త ప్లాన్ లాంచ్ చేసిన జియో - రోజుకు 2 జీబీ డేటా కూడా!

Jio New Plans: సోనీలివ్, జీ5 సబ్‌స్క్రిప్షన్లు అందించే కొత్త ప్లాన్ లాంచ్ చేసిన జియో - రోజుకు 2 జీబీ డేటా కూడా!