NagaBabu: 'పులివెందుల ఎమ్మెల్యే జగన్‌కు న్యాయం చేయాలి' - కూటమి ప్రభుత్వానికి జనసేన నేత నాగబాబు విజ్ఞప్తి
Andhrapradesh News: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌పై జనసేన నేత నాగబాబు సెటైరికల్ ట్వీట్ చేశారు. కోడికత్తి కేసుకు సంబంధించి అమాయకుడైన జగన్‌కు న్యాయం చేయాలంటూ ప్రభుత్వాన్ని కోరారు.
![NagaBabu: 'పులివెందుల ఎమ్మెల్యే జగన్‌కు న్యాయం చేయాలి' - కూటమి ప్రభుత్వానికి జనసేన నేత నాగబాబు విజ్ఞప్తి janasena leader naga babu satirical tweet on ys jagan in kodikathi issue NagaBabu: 'పులివెందుల ఎమ్మెల్యే జగన్‌కు న్యాయం చేయాలి' - కూటమి ప్రభుత్వానికి జనసేన నేత నాగబాబు విజ్ఞప్తి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/29/e9d009d0107107610c44158767518dec1722239545987876_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Janasena Leader Nagababu Satirical Tweet: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌కు న్యాయం చేయాలంటూ జనసేన నేత నాగబాబు కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. 2019కి ముందు జగన్‌పై జరిగిన కోడికత్తి దాడికి సంబంధించిన అంశాలను ప్రస్తావిస్తూ ఆయన సెటైర్లు వేశారు. అప్పటి ఆయనకు ఉన్న బిజీ షెడ్యూల్ వల్ల కుదర్లేదని.. ఇప్పుడు కూటమి ప్రభుత్వం దీనిపై విచారించి అమాయకుడైన జగన్‌కు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ట్వీట్‌లో ఏం చెప్పారంటే.?
2019 కి ముందు అప్పటి ఎమ్మెల్యేగా ఉండి తదనంతరం అంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మారి ప్రస్తుతం పులివెందుల ఎమ్మెల్యేగా మిగిలినటువంటి జగన్ మోహన్ రెడ్డి గారికి కూటమి ప్రభుత్వం న్యాయం చేయాలి.
— Naga Babu Konidela (@NagaBabuOffl) July 29, 2024
ఎందుకంటే 2019 లో శ్రీను అనే వ్యక్తి ఆయన మీద కోడికత్తితో దాడి చేసాడు. 5 ఏళ్లు అయిన…
'2019కి ముందు అప్పటి ఎమ్మెల్యేగా ఉండి అనంతరం ఏపీకి ముఖ్యమంత్రిగా మారి ప్రస్తుతం పులివెందుల ఎమ్మెల్యేగా మిగిలిన జగన్ మోహన్ రెడ్డి గారికి కూటమి ప్రభుత్వం న్యాయం చేయాలి. ఎందుకంటే 2019లో శ్రీను అనే వ్యక్తి ఆయన మీద కోడికత్తితో దాడి చేశాడు. 5 ఏళ్లైనా కూడా ఆ కేసు ఇంకా కొలిక్కి రాలేదు. అప్పుడంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న బిజీ షెడ్యూల్ వల్ల ఆయనకి కుదర్లేదు. ఇపుడు ఆయన ఖాళీగానే ఉన్నారు. కాబట్టి కూటమి ప్రభుత్వం ఆయనకి న్యాయం చెయ్యాల్సిన అవసరం అత్యవసరంగా ఉంది. కాబట్టి అతని మీద హత్యాయత్నం చేసిన నేరస్థుడికి సరైన శిక్ష విధించాలి కదా! కాబట్టి ఈ కేసుని తక్షణమే విచారించి అమాయకుడైన శ్రీ జగన్ గారికి న్యాయం చెయ్యాల్సిందిగా కూటమి ప్రభుత్వాన్ని, సీఎం గారిని, డిప్యూటీ సీఎం గారిని, హోంమంత్రి గారిని కోరుకుంటున్నాను.' అంటూ ట్వీట్‌లో నాగబాబు పేర్కొన్నారు.
Also Read: JC Prabhakar Reddy: వైఎస్ విజయమ్మతో జేసీ ప్రభాకర్ రెడ్డి భేటీ - ఏపీ రాజకీయాల్లో సంచలన పరిణామం
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)