అన్వేషించండి

Jagan: సూపర్ సిక్స్ ఎగ్గొట్టేందుకే బడ్జెట్ - చంద్రబాబుపై జగన్ కీలక వ్యాఖ్యలు

Andhra Pradesh: బడ్జెట్‌లో పథకాలకు నిధులుకేటాయించలేదని జగన్ ఆరోపించారు. వైసీపీ హయాంలో అప్పులపై తప్పుడు ప్రచారం చేశారన్నారు.

Jagan alleged that funds were not allocated for the schemes in the budget: ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం  మభ్యపెట్టే బడ్జెట్ ప్రవేశపెట్టిందని వైసీపీ అధినేత జగన్ విమర్శించారు. 8 నెలల పాటు బడ్జెట్‌ పెట్టకుండా ఎందుకు సాగదీశారని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం నాలుగు నెలల కిందటే ఏర్పడింది. అయినా ఎనిమిది నెలల పాటు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించిన జగన్ బడ్జెట్‌ పెడితే మోసాలు బయటపడతాయని అందుకే ఇంతకాలం బడ్జెట్‌ పెట్టలేదన్నారు.  బడ్జెట్‌ చూస్తే బాబు ఆర్గ్‌నైజ్డ్‌ క్రైమ్‌  చేస్తున్నారని అర్థమైపోతుందన్నారు. 

చంద్రబాబుకు అప్పురత్న అవార్డివ్వాలి !

వైసీపీ హయాంలో అప్పులపై తప్పుడు ప్రచారాన్ని చేశారని జగన్ ఆరోపించారు.  అప్పుల విషయంలో ఏపీ శ్రీలంక అయిపోతుందని దుష్ప్రచారం చేశారన్నారు.  ఎన్నికల ముందు రాష్ట్ర అప్పులు రూ. 14 లక్షల కోట్లు అని దుష్ప్రచారం చేశారు ..గవర్నర్‌తో కూడా అబద్ధాలు చెప్పించారన్నారు.  2018-19 నాటికి రూ.3 లక్షల 13 వేల కోట్ల అప్పు. మా ప్రభుత్వం దిగిపోయే నాటికి 6 లక్షల 46 వేల కోట్లు అప్పు ఉందన్నారు.  చంద్రబాబు హయాంలో 19 శాతం అప్పులు పెరిగితే.. మా హయాంలో 15 శాతమే అప్పులు పెరిగాయన్నారు. అప్పు రత్న బిరుదు ఎవరికివ్వాలని జగన్ ప్రశ్నించారు.                                   

Also Read:     సోషల్‌ మీడియాలో పెట్టే అసభ్యకర పోస్టులపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు- కేసులు పెడితే తప్పేంటని ప్రశ్న

మా హయాంలోనే అభివృద్ధి  !

సూపర్‌ సిక్స్‌ ఎగ్గొట్టేందుకు అన్నీ అబద్ధాలే చెప్పారని జగన్ ఆరోపించారు.  చంద్రబాబు హయాంలో జీడీపీ 4.47 శాతం మాత్రమే ఉందన్నారు.  రెండేళ్లు కోవిడ్‌ ఉన్నా మా హయాంలో జీడీపీ 4.83 శాతం ఉందన్నారు.   తయారీ రంగంలో  చంద్రబాబు  హయాంలో రాష్ట్రం వాటా 2.86. రెండేళ్ల కోవిడ్‌ ఉన్నా మా హయాంలో 4.07 శాతం ఉందన్నారు.  పవర్‌ డిస్కంల నష్టాలు చంద్రబాబు హయాంలో రూ.22 వేల కోట్లు ఉన్నాయన్నారు.  మా హయాంలో కేవలం రూ.395 కోట్లు మాత్రమేనని తెలిపారు.  చంద్రబాబు అధికారంలోకి వచ్చాక కరెంటు బిల్లులు తగ్గిస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే రూ.17 వేల 899 కోట్లు భారం వేశారన్నారు. 

Also Read: వైసీపీ ఏదీ కలసి రావడం లేదు - జగన్‌ను సలహాదారులు ముంచేస్తున్నారా ?

పెట్టుబడులకు మా హయాంలోనే పునాదులు 

మా హయాంలోనే అంబానీ, అదానీ రాష్ట్రానికి వచ్చారు. మా హయాంలోనే రిలయన్స్‌ ప్రాజెక్ట్‌కు పునాది పడిందని జగన్ తెలిపారు.,  8 కీలక ప్రాజెక్ట్‌లకు కీలక అడుగులు అడుగులు పడ్డాయని ఇప్పుడు  వీళ్లే అన్ని తీసుకొచ్చినట్లు బిల్డప్‌ ఇచ్చుకుంటున్నారని విమర్శించారు.  స్టీల్‌ప్లాంట్‌ పెట్టనివ్వకుండా జిందాల్‌ను బెదిరిస్తున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.   గతంలో సంక్షేమ క్యాలెండర్‌ ద్వారా పథకాలన్నీ క్రమబద్ధంగా అందించామని.. . వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఉండి ఉంటే ఈ పథకాలన్ని అందేవన్నారు.  రాష్ట్రంలో ఇసుక దందా, పేకాట క్లబులు నడుపుతున్నారని ఆరోపించారు.      

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Legislative Council: ఏపీ శాసనమండలిలో లోకేష్ ఉగ్రరూపం - సైలెంట్ అయిపోయిన వైసీపీ ఎమ్మెల్సీలు - ఇదీ జరిగింది !
ఏపీ శాసనమండలిలో లోకేష్ ఉగ్రరూపం - సైలెంట్ అయిపోయిన వైసీపీ ఎమ్మెల్సీలు - ఇదీ జరిగింది !
Crime News: సంగారెడ్డి జిల్లాలో దారుణం - నడిరోడ్డుపైనే తల్లీకొడుకులను పొడిచి చంపేశాడు
సంగారెడ్డి జిల్లాలో దారుణం - నడిరోడ్డుపైనే తల్లీకొడుకులను పొడిచి చంపేశాడు
Chandrababu: మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు - శుక్రవారం ఢిల్లీలో మోదీ, షాతో భేటీ అయ్యే చాన్స్
మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు - శుక్రవారం ఢిల్లీలో మోదీ, షాతో భేటీ అయ్యే చాన్స్
Unstoppable With NBK S4: 'అన్ స్టాపబుల్ 4'లో పవన్ గురించి బాలయ్య పవర్ ఫుల్ క్వశ్చన్ - అల్లు అర్జున్ ఐకానిక్ ఆన్సర్
'అన్ స్టాపబుల్ 4'లో పవన్ గురించి బాలయ్య పవర్ ఫుల్ క్వశ్చన్ - అల్లు అర్జున్ ఐకానిక్ ఆన్సర్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్‌పై కేటీఆర్ ఫైర్వికారాబాద్ వివాదంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ట్రోఫీ మ్యాచ్‌లపై ఐసీసీకి లెటర్ రాసిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్పెద్దపల్లిలో అదుపు తప్పిన గూడ్స్, 11 బోగీలు బోల్తా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Legislative Council: ఏపీ శాసనమండలిలో లోకేష్ ఉగ్రరూపం - సైలెంట్ అయిపోయిన వైసీపీ ఎమ్మెల్సీలు - ఇదీ జరిగింది !
ఏపీ శాసనమండలిలో లోకేష్ ఉగ్రరూపం - సైలెంట్ అయిపోయిన వైసీపీ ఎమ్మెల్సీలు - ఇదీ జరిగింది !
Crime News: సంగారెడ్డి జిల్లాలో దారుణం - నడిరోడ్డుపైనే తల్లీకొడుకులను పొడిచి చంపేశాడు
సంగారెడ్డి జిల్లాలో దారుణం - నడిరోడ్డుపైనే తల్లీకొడుకులను పొడిచి చంపేశాడు
Chandrababu: మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు - శుక్రవారం ఢిల్లీలో మోదీ, షాతో భేటీ అయ్యే చాన్స్
మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు - శుక్రవారం ఢిల్లీలో మోదీ, షాతో భేటీ అయ్యే చాన్స్
Unstoppable With NBK S4: 'అన్ స్టాపబుల్ 4'లో పవన్ గురించి బాలయ్య పవర్ ఫుల్ క్వశ్చన్ - అల్లు అర్జున్ ఐకానిక్ ఆన్సర్
'అన్ స్టాపబుల్ 4'లో పవన్ గురించి బాలయ్య పవర్ ఫుల్ క్వశ్చన్ - అల్లు అర్జున్ ఐకానిక్ ఆన్సర్
Kanguva Review: కంగువా రివ్యూ: సూర్య రెండేళ్ల కష్టం - ‘కంగువా’ కనెక్ట్ అయిందా? - హిట్ కొట్టారా?
కంగువా రివ్యూ: సూర్య రెండేళ్ల కష్టం - ‘కంగువా’ కనెక్ట్ అయిందా? - హిట్ కొట్టారా?
Matka Review - మట్కా రివ్యూ: వరుణ్ తేజ్ బాగా చేశారు - మరి సినిమా? గ్యాంగ్‌స్టర్ డ్రామా బావుందా? లేదా?
మట్కా రివ్యూ: వరుణ్ తేజ్ బాగా చేశారు - మరి సినిమా? గ్యాంగ్‌స్టర్ డ్రామా బావుందా? లేదా?
Sravanthi Chokarapu : ఆసుపత్రి బెడ్‌పై స్రవంతి- మీ ఆశీస్సులు కావాలని విజప్తి- ఇలాంటి పోస్ట్ పెడతానని అనుకోలేదంటూ ఎమోషనల్‌
ఆసుపత్రి బెడ్‌పై స్రవంతి- మీ ఆశీస్సులు కావాలని విజప్తి- ఇలాంటి పోస్ట్ పెడతానని అనుకోలేదంటూ ఎమోషనల్‌
Andhra Pradesh News: సజ్జల భార్గవ్‌, వర్రా రవీందర్‌పై మరో కేసు- నిందితుల కోసం పోలీసుల గాలింపు
సజ్జల భార్గవ్‌, వర్రా రవీందర్‌పై మరో కేసు- నిందితుల కోసం పోలీసుల గాలింపు
Embed widget