IAS Karthikeya Mishra: సీఎం చంద్రబాబు అదనపు కార్యదర్శిగా కార్తికేయ మిశ్రా - సీఎస్ ఉత్తర్వులు
AP News: ఏపీ సీఎం చంద్రబాబు అదనపు కార్యదర్శిగా కార్తికేయ మిశ్రాను నియమిస్తూ సీఎస్ నీరభ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్ర సర్వీసుల్లో ఉన్న ఆయన్ను సీఎం విజ్ఞప్తి మేరకు కేంద్రం రిలీవ్ చేసింది.
Karthikeya Mishra As AP CM Additional Secretary: ఏపీ సీఎం చంద్రబాబు (CM Chandrababu) అదనపు కార్యదర్శిగా కార్తికేయ మిశ్రా (Karthikeya Mishra) నియమితులయ్యారు. ఈ మేరకు సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ (Neerabhkumar Prasad) ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఆయన కేంద్ర ఆర్థిక శాఖలో డైరెక్టర్‌గా ఉన్నారు. దీంతో ఆయన్ను ఏపీ సర్వీసుకు పంపాలని సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన డీవోపీటీ.. కార్తికేయ మిశ్రాను ఏపీ క్యాడర్‌కు పంపిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో కేంద్ర సర్వీసుల నుంచి రిలీవ్ అయిన ఆయన.. ఏపీ ప్రభుత్వానికి రిపోర్ట్ చేశారు.
కాగా, కేంద్ర సర్వీసుల్లో ఉన్న పలువురు ఏపీ కేడర్ ఐఏఎస్ అధికారులను రిలీవ్ చేయాల్సిందిగా కోరుతూ సీఎం లేఖ రాశారు. దీంతో ఇప్పటికే కేంద్ర సర్వీసుల నుంచి ఐఏఎస్ పీయుష్, ఐపీఎస్ మహేష్ చంద్ర లడ్హా రిలీవ్ అయ్యారు. తాజాగా, కార్తికేయ మిశ్రా రిలీవ్ అయ్యారు. ఈయన 2009 ఏపీ కేడర్ ఐఏఎస్ అధికారి. సీఎంగా బాధ్యతలు చేపట్టిన అనంతరం చంద్రబాబు పాలనపై పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. ఈ క్రమంలోనే సీఎంవో కార్యాలయం సహా అన్ని విభాగాల్లోనూ సమర్థులైన అధికారులను నియమిస్తున్నారు.
Also Read: CM Chandrababu: 'సీఎం చంద్రబాబును కలిసి వినతులు ఇవ్వొచ్చు' - టోల్ ఫ్రీ నెంబర్ ఇదే!