News
News
X

Viveka Murder Case : వివేకా హత్య కేసు, సునీల్ బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ

Viveka Murder Case : వివేకా హత్య కేసులో ఏ2 గా ఉన్న నిందితుడు సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టింది. సునీల్ కు బెయిల్ ఇవ్వొద్దని వివేకా సతీమణి ఇంప్లీట్ పిటిషన్ దాఖలు చేశారు.

FOLLOW US: 
Share:

Viveka Murder Case : మాజీ ఎంపీ వివేకానంద రెడ్డి హత్య కేసు నిందితుడు సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. వివేకా హత్య కేసులో A2గా ఉన్న సునీల్ యాదవ్ కు బెయిల్ ఇవ్వొద్దంటూ వివేకా కుటుంబం అభ్యంతరం వ్యక్తం చేశారు. హైకోర్టులో వివేకానందరెడ్డి భార్య సౌభాగ్యమ్మ ఇంప్లీడ్ పిటిషన్ వేశారు. కేసు విచారణ దశలో ఉన్నప్పుడు నిందితుడు సునీల్ యాదవ్ కు బెయిల్ మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని సౌభాగ్యమ్మ తెలిపారు. ఈ పిటిషన్ పై తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల 27కు వాయిదా వేసింది. ఈ నెల 27న సీబీఐ కూడా బెయిల్ పిటిషన్ పై తన వాదనలు వినిపించనున్నట్లు తెలుస్తోంది.  సీబీఐ కూడా అభ్యంతరాలు దాఖలు చేయనుంది. 

హైకోర్టులో సునీల్  బెయిల్ పిటిషన్ 

వైఎస్ వివేకా హత్య కేసులో ఏ2 నిందితుడు సునీల్ యాదవ్ బెయిల్‌ కోసం తెలంగాణ హైకోర్టులో ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు. పులివెందులకు చెందిన సునీల్ యాదవ్​ ను సీబీఐ 2021 ఆగస్టులో గోవాలో అరెస్టు చేసింది. ఈ కేసులో సునీల్ పై 2021 అక్టోబరులో సీబీఐ ఛార్జ్‌ షీట్‌ దాఖలు చేసింది. గతంలో సునీల్ యాదవ్ ​కు కడప జిల్లా కోర్టు, ఏపీ హైకోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. అనంతరం సుప్రీంకోర్టు వైఎస్ వివేకా హత్య కేసును హైదరాబాద్‌కు బదిలీ చేసింది. దీంతో తెలంగాణ హైకోర్టులో సునీల్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు. సునీల్ యాదవ్ ప్రస్తుతం చంచల్ గూడ జైలులో ఉన్నాడు. సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్‌పై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ తెలంగాణ హైకోర్టుకు బదిలీ కావడంతో నిందితులను ఇటీవల కడప నుంచి హైదరాబాద్‌  తీసుకొచ్చారు. నిందితులు సునీల్‌ యాదవ్‌, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, దస్తగిరితో పాటు మరో నిందితుడు ఉమాశంకర్‌రెడ్డిని సీబీఐ కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో తదుపరి విచారణను వచ్చే నెల 10వ తేదీకి వాయిదా వేసి నిందితుల్లో శివశంకర్‌రెడ్డి, ఉమాశంకర్‌రెడ్డి, సునీల్‌ యాదవ్‌లను చంచల్‌గూడ జైలుకు తరలించాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసులో భాగంగా నిందితుడు సునీల్ యాదవ్ బెయిల్‌ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.  

ఎవరీ సునీల్? 

పులివెందుల మండలం మోట్నూంతలపల్లి గ్రామానికి చెందిన సునీల్‌ యాదవ్‌ వైసీపీ కార్యకర్త. అతడి తల్లిదండ్రులు సావిత్రి, కృష్ణయ్య యాదవ్. అనంతపురం జిల్లాలోని ఓ లిక్కర్ పరిశ్రమలో కృష్ణయ్య పనిచేస్తూ..  అక్కడే ఉండేవాడు. కొన్ని రోజులపాటు ఆటోమెుబైల్ ఫైనాన్స్ సంస్థలో పని చేశారు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవడంతో 2017లో పులివెందులకు వచ్చారు. భాకరాపురంలోని అద్దె ఇంట్లో ఉండేవారు. వైసీపీ ప్రభుత్వం... అధికారంలోకి వచ్చాక.. ఇసుక రీచ్ లో పని చేశాడు సునీల్. కొన్ని రోజుల తర్వాత.. ఎర్రగంగిరెడ్డి, దస్తగిరి ద్వారా వివేకాకు సునీల్ యాదవ్ పరిచయమయ్యాడు. అప్పటి నుంచి తరచూ వివేకా ఇంటికి వెళ్లేవాడు. వారి నడుమ ఆర్థిక లావాదేవీలు ఉన్నట్లు సమాచారం. వివేకా హత్య కేసు విచారణలో భాగంగా సునీల్‌, ఆయన కుటుంబ సభ్యులను సీబీఐ అధికారులు పలుమార్లు విచారించారు. వాచ్‌మన్‌ రంగయ్యను చాలా సార్లు విచారించాక గత నెల 23న జమ్మలమడుగు జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు ఎదుట హజరు పరిచి వాంగ్మూలం ఇప్పించారు. వివేకా 2019 మార్చి 14న అర్ధరాత్రి తన ఇంట్లో దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. వివేకా కుమార్తె సునీత అభ్యర్థన మేరకు హైకోర్టు  మార్చి 11న సీబీఐకి దర్యాప్తు బాధ్యతలు అప్పగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. 

Published at : 16 Feb 2023 02:47 PM (IST) Tags: Hyderabad sunil yadav High Court Bail petition Viveka Murder Case

సంబంధిత కథనాలు

Breaking News Live Telugu Updates: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వినియోగించుకున్న సీఎం జగన్

Breaking News Live Telugu Updates: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వినియోగించుకున్న సీఎం జగన్

ఎమ్మెల్సీ ఎన్నికల్లో మైండ్‌ గేమ్‌తో ప్రచారం- ప్రత్యర్థులను పరుగులు పెట్టేంచేలా స్కెచ్‌

ఎమ్మెల్సీ ఎన్నికల్లో మైండ్‌ గేమ్‌తో ప్రచారం- ప్రత్యర్థులను పరుగులు పెట్టేంచేలా స్కెచ్‌

New Contraceptive Tool: గర్భనిరోధకానికి కొత్త సాధనం - తెలుగు రాష్ట్రాల్లో అమలుకు ప్రయత్నాలు

New Contraceptive Tool: గర్భనిరోధకానికి కొత్త సాధనం - తెలుగు రాష్ట్రాల్లో అమలుకు ప్రయత్నాలు

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన గంటా, టీడీపీ గెలుస్తుందంటూ ధీమా

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన గంటా, టీడీపీ గెలుస్తుందంటూ ధీమా

AP MLC Elections: ఆ 16 మంది వైసీపీ ఎమ్మెల్యేల ఓటు టీడీపీకే - గోరంట్ల, నిమ్మల కీలక వ్యాఖ్యలు

AP MLC Elections: ఆ 16 మంది వైసీపీ ఎమ్మెల్యేల ఓటు టీడీపీకే - గోరంట్ల, నిమ్మల కీలక వ్యాఖ్యలు

టాప్ స్టోరీస్

TSPSC Paper Leak: 'ఓఎంఆర్' విధానానికి టీఎస్‌పీఎస్సీ గుడ్‌బై? ఇక నియామక పరీక్షలన్నీ ఆన్‌లైన్‌లోనే!

TSPSC Paper Leak: 'ఓఎంఆర్' విధానానికి టీఎస్‌పీఎస్సీ గుడ్‌బై? ఇక నియామక పరీక్షలన్నీ ఆన్‌లైన్‌లోనే!

రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలుశిక్ష, పరువు నష్టం కేసులో దోషిగా తేల్చిన కోర్టు - వెంటనే బెయిల్

రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలుశిక్ష, పరువు నష్టం కేసులో దోషిగా తేల్చిన కోర్టు - వెంటనే బెయిల్

Hindenburg Research: మరో బాంబ్‌ పేల్చిన హిండెన్‌బర్గ్‌, కొత్త రిపోర్ట్‌పై సిగ్నల్‌

Hindenburg Research: మరో బాంబ్‌ పేల్చిన హిండెన్‌బర్గ్‌, కొత్త రిపోర్ట్‌పై సిగ్నల్‌

NTR 30 Muhurtham : మృగాలను భయపెట్టే మగాడిగా ఎన్టీఆర్ - స్టోరీలైన్ చెప్పేసిన కొరటాల

NTR 30 Muhurtham : మృగాలను భయపెట్టే మగాడిగా ఎన్టీఆర్ - స్టోరీలైన్ చెప్పేసిన కొరటాల