APSRTC : ఏపీఎస్ఆర్టీసీకి జాతీయ స్థాయిలో గుర్తింపు, పీపుల్స్ ఛాయిస్ అవార్డు ప్రదానం
APSRTC : ఏపీఎస్ఆర్టీసీకి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. హైదరాబాద్ లో జరిగిన ఓ సమావేశంలో అవార్డును ప్రదానం చేశారు.
APSRTC : ఏపీఎస్ఆర్టీసీకి జాతీయ స్థాయిలో అవార్డు లభించింది. బస్ అండ్ కార్ ఆపరేటర్స్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో హైదరాబాద్ లో జరిగిన వేడుకల్లో ఈ అవార్డు ప్రధానం చేశారు. బస్ అండ్ కార్ ఆపరేటర్స్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో హైటెక్స్‌లో ప్రవాస్ ఎక్సలెన్స్ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో ఏపీఎస్‌ఆర్టీసీకి రెడ్ బస్ పీపుల్స్ ఛాయిస్ అవార్డు ప్రదానం చేశారు. ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు ఈ అవార్డును అందుకున్నారు. సేఫ్, స్మార్ట్, స్థిరమైన ప్యాసింజర్ మొబిలిటీ అనే కార్యక్రమాన్ని ఏపీఎస్ఆర్టీసీ నిర్వహిస్తుంది. ఆర్టీసీ సేవలు గుర్తించినందుకు ఎండీ ద్వారకా తిరుమలరావు హర్షం వ్యక్తం చేశారు. ఈ అవార్డుల కార్యక్రమంలో దేశవ్యాప్తంగా 4 వేల మంది పబ్లిక్, ప్రైవేటు వాహనాల ఆపరేటర్లు, వ్యాపారులు పాల్గొన్నారు. ఏపీఎస్ఆర్టీసీకి ఈ అవార్డు రావడం ఆనందంగా ఉందని ద్వారకా తిరుమలరావు అన్నారు.
బస్సు ఆలస్యంగా వచ్చిందని ఫైన్
ఆర్టీసీ బస్సు ఆలస్యంగా వచ్చిందని.. తెలంగాణ ఆర్టీసీకి రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ జరిమానా విధించింది. లేటుగా రావడమే కాకుండా గమ్య స్థానానికి చేర్చడంలో చాలా ఆలస్యం చేశారు. దీంతో ఓ ప్రమాణికురాలు అస్వస్థతకు గురైంది. దీంతో ఓ వినియోగదారుడు రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ ను ఆశ్రయించగా.. తెలంగాణ ఆర్టీసీకి జరిమానా విధించింది. టికెట్ డబ్బు రూ.631, పరిహారంగా వెయ్యి రూపాయలు, కేసు ఖర్చుల కింద 500 రూపాయలు.. మొత్తం 2, 131 రూపాయలను నెలన్నర రోజుల్లో చెల్లించాలని ఆదేశించింది. 2019వ సంవత్సరం ఆగస్టులో హైదరాబాద్ కు చెందిన న్యాయవాది ఫహీమా బేగమ్.. దిల్‌సుఖ్ నగర్ నుంచి మణుగూరుకు టికెట్ బుక్ చేసుకున్నారు. ఆగస్టు 9వ తేదీన బస్టాండుకు వెళ్లారు. అయితే రాత్రి 7.15 గంటలకు రావాల్సిన బస్సు 11.15కు వచ్చింది. దాదాపు నాలుగు గంటలు ఆలస్యంగా వచ్చింది. ఎందుకు ఇంత ఆలస్యం అయిందని ఫహీమ ప్రశ్నించగా.. దురుసుగా మాట్లాడారు. అంతే కాకుండా మరుసటి రోజు ఉదయం 5.45 గంటలకు గమ్య స్థానానికి చేర్చాల్సి ఉండగా.. 9.45 కు చేర్చింది. అయితే బస్టాండులో నాలుగు గంటల పాటు వేచి ఉండటంతో ఫహీమ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఫహమీ రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ ను ఆశ్రయించారు.
వినియోగదారుల కమిషన్ కు ఫిర్యాదు
ఫిర్యాదుపై స్పందించిన వినియోగదారుల కమిషన్.. ఆర్టీసీని విచారించింది. అయితే ఫహీమ చేసే ఆరోపణలన్నీ నిరాధారమైనవని, ప్రయాణం రద్దయితేనే టికెట్ డబ్బు రీఫండ్ చేస్తామని ఫిర్యాధి దారులకు నష్టం కల్గించేలా ఆర్టీసీ ప్రవర్తించలేదని తమ సేవల్లో లోపం లేదని వివరించింది. సాక్ష్యాధారాలు పరిశీలించిన కమిషన్ అధ్యక్షురాలు చిట్నేని లతా కుమారి, సభ్యులు జీవీఎస్ ప్రసాద్ రావు, డీ మాధవీ లతతో కూడిన బెంచ్ తెలంగాణ ఆర్టీసీకి ఫైన్ విధించారు. నిజంగానే మణగూరుకు 2 గంటల 20 నిమిషాలు బస్సు ఆలస్యంగా చేరుకున్నట్లు బెంచ్ గుర్తించింది. ఆ సమయంలో ఆర్టీసీ బస్సు ఆలస్యంగా రావడం వల్ల ఫిర్యాదిదారు అస్వస్థతకు గురైనట్లు వైద్యుడు ధ్రువీకరించిన ప్రిస్కిప్షన్ సాక్ష్యంగా ఉందని, ఇది ముమ్మాటికీ సేవల్లో లోపమే అని తెలిపారు. అంతే కాకుండా టికెట్ డబ్బు రూ.631, పరిహారంగా మరో 1000 రూపాయలు, కేసు ఖర్చుల కింద 500 రూపాయలు.. మొత్తం 2, 131 రూపాయలను నెలన్నర రోజుల్లో ఆమెకు చెల్లించాలని సూచించింది.