అన్వేషించండి

AP Matsyakara Bharosa 2026: మత్స్యకారులకు రూ.20 వేల ఆర్థిక సాయం.. మత్స్యకార భరోసా పథకం అర్హతలు, దరఖాస్తు విధానం ఇదే

ఏపీ ప్రభుత్వం వేట నిషేధం సమయంలో మత్స్యకార భరోసా పథకం కింద అర్హులైన మత్స్యకారులకు రూ.20 వేలు ఆర్థిక సాయం అందిస్తుంది.

AP Matsyakara Bharosa 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమం కోసం 'మత్స్యకార భరోసా పథకం' అమలు చేస్తుంది. ప్రతి సంవత్సరం మత్స్యకార భరోసా పథకం కింద ప్రతి మత్స్యకారుడికి రూ.20,000 ఆర్థిక సాయం అందిస్తుంది. చేపల వేట నిషేధం సమయంలో మత్స్యకారులకు ఈ సాయం అందిస్తుంది.  రెండు నెలల పాటు చేపల వేట నిషేధం సమయంలో  మత్స్యకారులు జీవనోపాధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆర్థికసాయం చేస్తుంది.  

ఏటా వేసవిలో 61 రోజుల పాటు సముద్రంలో వేట నిషేధం ఉంటుంది. ఈ సమయంలో మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లడం చట్టరీత్యా నేరం. ఆదాయం లేని ఈ రెండు నెలలు మత్స్యకార కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు పడకుండా రాష్ట్ర ప్రభుత్వం నగదు సాయం అందిస్తోంది.  

మత్స్యకార భరోసా పథకం  

సీఎం చంద్రబాబు ఏప్రిల్ 2025లో మత్స్యకార భరోసా పథకాన్ని ప్రారంభించారు. మత్స్యకార భరోసా కింద చేపల వేట నిషేధ సమయంలో నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో రూ.20,000 జమ చేస్తారు.  ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు (61 రోజులు) పాటు వేట నిషేధం ఉంటుంది. ఈ సమయంలో మత్స్యకారులకు ఆర్థిక సాయం అందిస్తారు. 

అర్హతలు 

  • మత్స్యకారులకు వయోపరిమితి 18 నుంచి 60 సంవత్సరాలు
  • మత్స్యశాఖలో నమోదు అయిన బోట్లలో పనిచేసే వారు లేదా బోటు యజమానులు అర్హులు.
  • వేట నిషేధ సమయంలో సముద్రంలో వేటకు వెళ్లనివారు. 
  • వేట నిషేధ సమయంలో వేటకు వెళ్తే బోటు రిజిస్ట్రేషన్ రద్దు అవుతుంది. ఈ పథకానికి అనర్హులుగా ప్రకటిస్తారు.  
  • లబ్దిదారుడి బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింక్ (NPCI) అయి ఉండాలి. 
  • ఇతర పథకాల ద్వారా లబ్ధి పొందిన వారు ఈ పథకానికి అనర్హులు
  • మత్స్యకారుడు ఆంధ్రప్రదేశ్ నివాసి అయి ఉండాలి.  

కావాల్సిన డాక్యుమెంట్స్ 

మత్స్యకార గుర్తింపు కార్డు
ఆధార్ కార్డు
బ్యాంక్ పాస్‌బుక్ జిరాక్స్
బోటు యాజమానులైతే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ 
ఫిషింగ్ లైసెన్స్ ఫొటోకాపీ
 

దరఖాస్తు విధానం

  • ఏపీ మత్స్యకార భరోసా పథకం 2026 లబ్దిదారుల ఎంపిక విధానం ఇలా ఉంటుంది.  
  • ఏప్రిల్ 17 నుంచి గ్రామ,వార్డు సచివాలయాల ద్వారా మత్స్యకారుల వివరాల సేకరిస్తారు. 
  • మత్స్యశాఖ అధికారులు దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హులను గుర్తిస్తారు.
  • అర్హుల జాబితాను గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శిస్తారు.
  • తుది జాబితా ఖరారు చేసిన తర్వాత సీఎం చేతుల మీదుగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ ద్వారా నేరుగా ఖాతాల్లో డబ్బులు వేస్తారు.  

మరిన్ని ప్రయోజనాలు  

  1. సముద్రంలో వేట నిషేధం సమయంలో కుటుంబ అవసరాలకు, పిల్లల చదువులకు రూ. 20,000 ఆర్థిక భద్రత కల్పించనున్నాయి.  
  2. ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల దగ్గర అప్పులు చేయకుండా ఈ డబ్బులు ఉపయోగపడతాయి.  
  3. ఈ పథకం కింద నమోదు చేసుకున్న వారికి ‘ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన’ (PMMSY) ద్వారా ప్రమాద బీమా కల్పిస్తారు.  
  4. అర్హులైన వారికి ప్రభుత్వం నుంచి అదనంగా డీజిల్ సబ్సిడీ ప్రయోజనాలు అందిస్తారు.  
     

చెల్లింపు స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి? 

  • అర్హులైన లబ్ధిదారులు egsws.ap.gov.in వెబ్‌సైట్‌లో ఏపీ మత్స్యకార భరోసా పథకం స్టేటస్ ను చెక్ చేసుకోవచ్చు.  
  • మీ ఆధార్ నెంబర్‌, క్యాప్చా కోడ్‌ను నమోదు చేసి, వివరాలను సబ్‌మిట్ చేస్తే చెల్లింపు వివరాలు తెలుస్తాయి. 

 

Frequently Asked Questions

మత్స్యకార భరోసా పథకం కింద ఎంత ఆర్థిక సహాయం అందిస్తారు?

మత్స్యకార భరోసా పథకం కింద ప్రతి మత్స్యకారుడికి రూ. 20,000 ఆర్థిక సహాయం అందిస్తారు.

చేపల వేట నిషేధం ఎప్పుడు ఉంటుంది?

ఏటా ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు, అంటే 61 రోజుల పాటు చేపల వేట నిషేధం ఉంటుంది.

మత్స్యకార భరోసా పథకానికి అర్హతలు ఏమిటి?

18 నుంచి 60 సంవత్సరాల వయస్సు గల మత్స్యకారులు, మత్స్యశాఖలో నమోదైన బోట్లలో పనిచేసేవారు లేదా బోటు యజమానులు అర్హులు.

మత్స్యకార భరోసా పథకం కింద వచ్చే డబ్బు ఎప్పుడు జమ అవుతుంది?

చేపల వేట నిషేధ సమయంలో అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా రూ. 20,000 జమ చేస్తారు.

చెల్లింపు స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి?

egsws.ap.gov.in వెబ్‌సైట్‌లో మీ ఆధార్ నంబర్, క్యాప్చా కోడ్‌ను నమోదు చేసి చెల్లింపు వివరాలు తెలుసుకోవచ్చు.

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Naidu Meets PM Modi: ప్రధాని మోదీ, అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ - ఎన్నికల కమిషన్ అంశంపై చర్చించారా?
ప్రధాని మోదీ, అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ - ఎన్నికల కమిషన్ అంశంపై చర్చించారా?
Vijayawada Police: విదేశీయుల ఆశ్రయంపై పోలీసుల నిఘా.. నిబంధనలు అతిక్రమిస్తే భారీ జరిమానా, జైలు శిక్ష
విదేశీయుల ఆశ్రయంపై పోలీసుల నిఘా.. నిబంధనలు అతిక్రమిస్తే భారీ జరిమానా, జైలు శిక్ష
Chandrababu Naidu CII Partnership Summit: గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ హబ్‌గా ఏపీ - న్యూఢిల్లీ సీఐఐ సదస్సులో సీఎం చంద్రబాబు ప్రకటన!
గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ హబ్‌గా ఏపీ - న్యూఢిల్లీ సీఐఐ సదస్సులో సీఎం చంద్రబాబు ప్రకటన!
Vijayasai Reddy: జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chalo Lok Bhavan Congress Protest: టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
VC Sajjanar Junior NTR Fans: మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
Vijayasai Reddy: జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Ravindra Jadeja Viral Post: అగార్కర్ తప్పుకున్న వేళ జడ్డూ సెటైరికల్ పోస్ట్.. సెలెక్టర్ పదవి ప్రొసీజర్ ఏంటంటూ ప్రశ్న, జడేజా కామెంట్ వైరల్
అగార్కర్ తప్పుకున్న వేళ జడ్డూ సెటైరికల్ పోస్ట్.. సెలెక్టర్ పదవి ప్రొసీజర్ ఏంటంటూ ప్రశ్న, సోషల్ మీడియాలో జడేజా కామెంట్ వైరల్
Indian 3 Movie Release : సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
AP Local Elections: ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
Embed widget