![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Bail For Kothapalli Geeta : మాజీ ఎంపీ దంపతులకు ఊరట - బెయిల్ ఇచ్చిన హైకోర్టు !
కొత్తపల్లి గీత దంపతులకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. జైలు శిక్ష పడిన రెండు రోజుల్లోనే బెయిల్ రావడంతో జైలు నుంచి విడుదల కానున్నారు.
![Bail For Kothapalli Geeta : మాజీ ఎంపీ దంపతులకు ఊరట - బెయిల్ ఇచ్చిన హైకోర్టు ! High Court granted bail to Kothapally Geetha couple. Bail For Kothapalli Geeta : మాజీ ఎంపీ దంపతులకు ఊరట - బెయిల్ ఇచ్చిన హైకోర్టు !](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/16/a3d471c4dbfd0cbbee72a818675f35361663330864617228_original.webp?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Bail For Kothapalli Geeta : బ్యాంక్ రుణాల ఎగవేత కేసులో సీబీఐ కోర్టులో శిక్ష పడిన మాజీ ఎంపీ కొత్తపల్లి గీత దంపతులకు హైకోర్టులో ఊరట లభించింది. వీరికి బెయిల్ మంజూరు చేసింది. రూ.25 వేల వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలని గీత దంపతులను హైకోర్టు ఆదేశించింది. బ్యాంకును మోసం చేశారన్న కేసులో గీత, ఆమె భర్త రామకోటేశ్వరరావుకు న్యాయస్థానం ఐదేళ్ల జైలుశిక్ష విధించింది. చెరో రూ.లక్ష జరిమానా విధిస్తూ నాంపల్లి సీబీఐ కేసుల ప్రత్యేక కోర్టు మంగళవారం తీర్పు ఇచ్చింది. ఈ కేసులో బ్యాంకు అధికారులు బీకే జయప్రకాశం, కేకే అరవిందాక్షన్‌కు కూడా ఐదేళ్ల జైలుశిక్ష, నిందితుల జాబితాలో ఉన్న విశ్వేశ్వర ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్‌కు రూ.2 లక్షల జరిమానా విధించింది.
సీబీఐ కోర్టు విధించిన ఐదేళ్ల జైలు శిక్షను హైకోర్టులో సవాల్ చేసిన కొత్తపల్లి గీత
సీబీఐ కోర్టు తీర్పును కొత్తపల్లి గీత దంపతులు హైకోర్టులో సవాల్ చేశారు. సీబీఐ కోర్టు తీర్పు అమలు నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణ డిసెంబరు 16వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది.కొత్తపల్లి గీత, రామకోటేశ్వరరావు డైరెక్టర్లుగా ఉన్న ఆ విశ్వేశ్వర ఇన్‌ఫ్రా కంపెనీ 2008లో పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి రూ.42 కోట్ల రుణం పొందారు. తప్పుడు పత్రాలు సమర్పించడంతోపాటు కొందరు బ్యాంకు అధికారులతో కుమ్మక్కై బ్యాంకును మోసం చేశారని అభియోగం నమోదైంది. బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు 2015లో సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేసింది.
తప్పుడు డాక్యుమెంట్లతో రుణం.. నగదు దారి మళ్లింపు
సదరు రుణం ద్వారా పొందిన డబ్బును సొంత అవసరాలకు మళ్లించినట్లు బ్యాంకు గుర్తించి... సీబీఐకి అధారాలు ఇచ్చింది. వీరిని దోషులుగా గుర్తించి జైలుశిక్ష, జరిమానా విధించింది. తీర్పు వెలుపడినప్పటికీ అనారోగ్యం కారణంగా కొత్తపల్లి గీతకు పోలీసులు ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య చికిత్స చేయించి.. జైలుకు తీసుకెళ్లారు. రామకోటేశ్వరరావును, ఇద్దరు మాజీ బ్యాంకు అధికారులను కూడా బుధవారం రాత్రి చంచల్‌గూడ జైలుకు తరలించినట్లు అధికారులు తెలిపారు. బయిల్ లభించడంతో వారు జైలు నుంచి విడుదల కానున్నారు.
వచ్చే ఏడాది నుంచి విశాఖ కేంద్రంగా పాలన, మంత్రి అమర్ నాథ్ సంచలన కామెంట్స్
అరకు నుంచి వైఎస్ఆర్‌సీపీ తరపున గెలిచి ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన కొత్తపల్లి గీత
గ్రూప్ వన్ ఉద్యోగిగా ఉమ్మడి రాష్ట్రంలో పని చేసిన కొత్తపల్లి గీత తర్వాత స్వచ్చంద పదవీ విరమణ చేసి వ్యాపారరంగంలోకి వెళ్లారు. 2014 ఎన్నికల్లో వైసీపీ తరఫున అరకు (ఎస్‌టీ) నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. కొద్దికాలానికే ఆ పార్టీ అధిష్ఠానంతో విభేదాలు వచ్చాయి. దాంతో ఆమె ఎంపీగా ఉంటూనే 2018లో ‘జనజాగృతి’ పేరుతో కొత్త పార్టీ పెట్టారు. అనంతరం 2019 జూన్‌లో బీజేపీలో చేరారు.
ఈడీ నోటీసులు రాలేదు, ఢిల్లీ నుంచి మీడియాను తప్పుదోవ పట్టించారు-ఎమ్మెల్సీ కవిత !
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)