Minister Gudivada Amarnath : వచ్చే ఏడాది నుంచి విశాఖ కేంద్రంగా పాలన, మంత్రి అమర్ నాథ్ సంచలన కామెంట్స్
Minister Gudivada Amarnath : వచ్చే విద్యాసంవత్సరం నుంచి విశాఖ కేంద్రంగా పాలన ప్రారంభిస్తామని మంత్రి గుడివాడ అమర్ నాథ్ స్పష్టం చేశారు.
Minister Gudivada Amarnath : విశాఖ నుంచి పాలనపై ఏపీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన ఆయన వచ్చే విద్యాసంవత్సరం నుంచి విశాఖ రాజధానిగా పాలన చేస్తామని స్పష్టంచేశారు. దీనికి అందరూ సిద్ధంగా ఉండాలన్నారు. మంత్రి గుడివాడ అమర్ నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే విద్యాసంవత్సవరంలో విశాఖ నుంచి పాలన ప్రారంభం అవుతుందన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన ఆయన వికేంద్రీకరణపై త్వరలో బిల్లు పెడతామని స్పష్టం చేశారు. మూడు రాజధానులు ఏర్పాటు చేయాలన్నదే వైసీపీ ప్రభుత్వ విధానమన్నారు. ఆ నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని మంత్రి అమర్‌నాథ్ స్పష్టం చేశారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచే విశాఖ కేంద్రంగా పాలన ప్రారంభిస్తామన్నారు. అమరావతిలో రాజధాని పేరిట రూ.లక్షల కోట్లు ఖర్చు పెట్టే ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు. తక్కువ ఖర్చుతో విశాఖ నగరాన్ని అభివృధ్ధి చేస్తామని మంత్రి తెలిపారు. విశాఖలో భూఅక్రమాల ఆరోపణలపై టీడీపీ నేతలు ఆధారాలు చూపాలని ఆయన డిమాండ్ చేశారు. విశాఖలో రాజధానికి ఒక సెంటు ప్రైవేటు భూమి కూడా తీసుకోలేదని వెల్లడించారు. అమరావతిలో, విశాఖలో జరిగిన భూ క్రయవిక్రయాలు ఒక్కటేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి రైతుల పాదయాత్రలో ఏంజరిగినా అందుకు చంద్రబాబే బాధ్యత వహించాలన్నారు.
ప్రతిపక్షం ఈజ్ ఆఫ్ సెల్లింగ్ లో నం.1
కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేయాలనేది తమ ప్రభుత్వ విధానమని మంత్రి గుడివాడ అమర్ నాథ్ మరోసారి స్పష్టం చేశారు. కర్నూలు కేంద్రంగా హైకోర్టు ఏర్పాటు చేయాలని బీజేపీ రాయలసీమ డిక్లరేషన్‌లో చెప్పిందని గుర్తుచేశారు. రాజధాని విశాఖ తరలించేందుకు అవసరమైన బిల్లును త్వరలో అసెంబ్లీలో ప్రవేశపెడతామని మంత్రి అమర్ నాథ్ వెల్లడించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విశాఖలో ఇన్వెస్ట్‌మెంట్ మీట్ జరగనుందని మంత్రి స్పష్టం చేశారు. అసెంబ్లీలో పరిశ్రమలపై స్వల్ప చర్చ జరిగిందని మంత్రి అమర్ నాథ్ చెప్పారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని సీఎం చెప్పారన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ప్రథమ స్థానంలో ఏపీ ఉందన్నారు. 301 అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ ర్యాంకింగ్ ఇచ్చారని మంత్రి తెలిపారు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుకి అసెంబ్లీకి వచ్చే చిత్తశుద్ధి, గౌరవం లేదని విమర్శించారు. చంద్రబాబు ఆలోచనలను ఈజ్ ఆఫ్ సెల్లింగ్ లో మాత్రమే ప్రతిపక్షం నం.1 అని ఎద్దేవా చేశారు.
ఏపీకి రూ.1.50 లక్షల కోట్ల పెట్టుబడి
"మేం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నం.1 . రూ.1.50 లక్షల కోట్ల పెట్టుబడులు ఏపీకి రానున్నాయి. ఇన్పోసిస్ లాంటి సంస్థలు విశాఖ కేంద్రంగా పని చేస్తున్నాయి. త్వరలో విశాఖలో బిజినెస్ డెవలప్మెంట్ సమ్మిట్ ఉంటుంది. గతంలో లాగా డిప్లొమేటిక్ గా కాదు. రాష్ట్రంలో ప్రధానమైన నగరం విశాఖ. ప్రతిపక్ష నాయకుల మాటలకు రుజువులు చూపించాలి. విశాఖ రాజధానికి ఒక్క సెంటు కూడా ప్రైవేటు భూమి తీసుకోవడం లేదు. సిట్టింగులకే సీట్లిస్తాను అంటే ప్రతిపక్షంలో సగం మంది అసెంబ్లీకి రాలేదు. "- మంత్రి గుడివాడ అమర్ నాథ్
Also Read : CM Jagan : వృద్ధిరేటులో ఏపీ టాప్, ఆర్థిక వ్యవస్థకు ఎలాంటి ఢోకా లేదు - సీఎం జగన్
Also Read : AP Assembly Session : ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఎనిమిది కీలక బిల్లులకు ఆమోదం