అన్వేషించండి

AP Assembly Session : ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఎనిమిది కీలక బిల్లులకు ఆమోదం

AP Assembly Session : ఏపీ శాసనసభలో ఎనిమిది బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి, ఆమోదం తెలిపింది.

AP Assembly Session : ఏపీ శాససభ సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. రెండో సమావేశాల్లో ఎనిమిది బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టింది.  సివిల్‌ సర్వీసెస్‌ రిపీల్‌ బిల్లు, అగ్రికల్చర్‌ అండ్‌ మార్కెటింగ్‌ బిల్లు, ల్యాండ్‌ టైటిలింగ్‌ బిల్లు, యూనివర్సిటీల చట్ట సవరణ బిల్లు, పంచాయతీ రాజ్‌ సవరణ బిల్లులను సభలో ప్రవేశపెట్టింది.  ఈ బిల్లులను శాసనసభ ఆమోదం తెలిపింది. మరోవైపు రాష్ట్ర  ఆర్థికాభివృద్ధిపై సభలో స్వల్ప చర్చ కొనసాగుతోంది. 

పారిశ్రామిక అభివృద్ధిపై స్వల్ప చర్చ 

ఏపీ అసెంబ్లీలో పారిశ్రామిక అభివృద్ధి, పెట్టుబడులు, ఆర్థికాభివృద్ధి అంశంపై స్వల్ప చర్చ జరిగింది. వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి మాట్లాడుతూ ఐదేళ్ల కాలంలో చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని అనుకోలేదన్నారు. పరిశ్రమల స్థాపన కేవలం కాగితాలకే పరిమితం అయిందన్నారు. చంద్రబాబు వైఫల్యాలను వైసీపీ ప్రభుత్వంపై మోపుతున్నారన్నారు. చంద్రబాబు అప్పులు చేశారు తప్ప అభివృద్ధి చేయలేదని ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వం లక్ష కోట్ల భారం మోపిందన్నారు. గ్రాఫిక్స్‌తో రాజధాని రైతులను మోసం చేశారని ఆరోపించారు. అప్పటి అప్పులను సీఎం జగన్‌ పెద్ద మనసుతో తీర్చారన్నారు.  రాష్ట్రానికి లక్షా 57 వేల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ సభలో తెలిపారు. ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలకు ప్రోత్సహాన్ని అందిస్తున్నామన్నారు. గత ప్రభుత్వాల బకాయిలు కూడా చెల్లించామన్నారు. ఏపీ అసెంబ్లీలో పారిశ్రామికాభివృద్ధి, పెట్టుబడులపై చర్చ సందర్భంగా మంత్రి అమర్ నాథ్ మాట్లాడుతూ ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో ఏపీ తొలిస్థానంలో ఉందని స్పష్టం చేశారు.  

టీడీపీ సభ్యులు సస్పెన్షన్ 

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రెండో రోజు కూడా టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు. రెండో రోజు సభ ప్రారంభం కాగానే పెరిగిన ఛార్జీలు, పన్నులపై టీడీపీ చర్చకు పట్టుబట్టింది. ఈ సందర్భంగా వైఎస్ఆర్‌సీపీ, టీడీపీ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం కొనసాగింది. ఇరుపక్షాల వారు గట్టిగా కేకలు వేసుకున్నారు. ఈ సందర్భంగా వెల్ లోకి టీడీపీ ఎమ్మెల్యేలు దూసుకుపోయారు. స్పీకర్ తమ్మినేని సీతారాంను చుట్టుముట్టారు. టీడీపీ సభ్యుల ప్రవర్తన ఏమాత్రం బాగోలేదని మండిపడ్డారు. ప్రతి రోజు సభ సజావుగా కొనసాగకుండా ప్రవర్తిస్తున్నారని అన్నారు. సభలో మీరు మాత్రమే సభ్యులా? ఇతరులు సభ్యులు కాదా? అని ప్రశ్నించారు. సంస్కారం లేకుండా ప్రవర్తిస్తున్నారని అన్నారు. టీడీపీ సభ్యుల తీరు చూస్తుంటే చాలా బాధగా ఉందని చెప్పారు. టీడీపీ సభ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో సూచించాలని... దానికి అనుగుణంగా తాను చర్యలు తీసుకుంటానని శాసనసభ వ్యవహారాల మంత్రి బుగ్గనను స్పీకర్ కోరారు. తర్వాత   టీడీపీ సభ్యులపై  ఒక రోజు పాటు సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే వారు బయటకు వెళ్లకపోవడంతో స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాల్ ది మార్షల్స్ అండ్ పుల్ దెమ్ అవుట్ అని ఇంగ్లిష్‌లో ఆవేశంగా స్పందించారు. 

Also Read : Merugu Nagarjuna Comments : రోజా మాటలను వక్రీకరించారు - ఆమెకు దళితులంటే ఎంతో గౌరవమన్న మంత్రి నాగార్జున !

Also Read : AP Assembly Deputy Speaker: ఏపీ డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల, ఆయనకే ఛాన్స్ !

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Naidu Meets PM Modi: ప్రధాని మోదీ, అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ - ఎన్నికల కమిషన్ అంశంపై చర్చించారా?
ప్రధాని మోదీ, అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ - ఎన్నికల కమిషన్ అంశంపై చర్చించారా?
Vijayawada Police: విదేశీయుల ఆశ్రయంపై పోలీసుల నిఘా.. నిబంధనలు అతిక్రమిస్తే భారీ జరిమానా, జైలు శిక్ష
విదేశీయుల ఆశ్రయంపై పోలీసుల నిఘా.. నిబంధనలు అతిక్రమిస్తే భారీ జరిమానా, జైలు శిక్ష
Chandrababu Naidu CII Partnership Summit: గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ హబ్‌గా ఏపీ - న్యూఢిల్లీ సీఐఐ సదస్సులో సీఎం చంద్రబాబు ప్రకటన!
గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ హబ్‌గా ఏపీ - న్యూఢిల్లీ సీఐఐ సదస్సులో సీఎం చంద్రబాబు ప్రకటన!
Vijayasai Reddy: జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chalo Lok Bhavan Congress Protest: టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
VC Sajjanar Junior NTR Fans: మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
Vijayasai Reddy: జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Ravindra Jadeja Viral Post: అగార్కర్ తప్పుకున్న వేళ జడ్డూ సెటైరికల్ పోస్ట్.. సెలెక్టర్ పదవి ప్రొసీజర్ ఏంటంటూ ప్రశ్న, జడేజా కామెంట్ వైరల్
అగార్కర్ తప్పుకున్న వేళ జడ్డూ సెటైరికల్ పోస్ట్.. సెలెక్టర్ పదవి ప్రొసీజర్ ఏంటంటూ ప్రశ్న, సోషల్ మీడియాలో జడేజా కామెంట్ వైరల్
Indian 3 Movie Release : సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
AP Local Elections: ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
Embed widget