News
News
X

TDP Vs Ysrcp : గుంటూరు ఘటనపై సోషల్ మీడియాలో తొక్కిసలాట, వైసీపీ వర్సెస్ టీడీపీ ట్వీట్ల వార్

TDP Vs Ysrcp : గుంటూరు తొక్కిసలాటపై సోషల్ మీడియా వేదికగా టీడీపీ, వైసీపీ నేతలు పరస్పర విమర్శలు చేసుకుంటున్నారు. చంద్రబాబు సభలకు అనుమతి ఇవ్వకూడదని మంత్రులు డిమాండ్ చేస్తున్నారు.

FOLLOW US: 
Share:

TDP Vs Ysrcp : గుంటూరు తొక్కిసలాటపై టీడీపీ, వైసీపీ మధ్య సోషల్ మీడియాలో వార్ జరుగుతోంది. ఈ ఘటనపై మీరే బాధ్యులంటూ ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకున్నారు. గుంటూరు ఘనటపై చంద్రబాబుపై వైసీపీ మంత్రులు మండిపడ్డారు. ఇకపై చంద్రబాబు సభలకు అనుమతి ఇవ్వకూడదన్నారు. పనిలో పనిగా పవన్ కల్యాణ్ పై కూడా విమర్శలు చేశారు. తొక్కిసలాటలో చనిపోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రుల హామీ ఇచ్చారు. ఇప్పటం అభివృద్ధిలో భాగంగా గోడ కూల్చితే కారెక్కి వచ్చిన పవన్ కల్యాణ్ తొక్కిసలాటలో జనం చనిపోతే పత్తా లేకుండా పోయారని మంత్రి గుడివాడ అమర్నాథ్ ట్విట్టర్లో పంచ్ పేల్చారు. చంద్రబాబు సభలో కందుకూరులో 8 మంది, గుంటూరులో ముగ్గురు చనిపోతే ఎక్కడ దాక్కున్నావ్ అంటూ కౌంటర్ వేశారు. మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలని నాని తనదైన స్టైల్లో ట్వీట్ చేశారు. రాష్ట్రంలో రాజకీయ రావణుడెవారో ప్రజలకు తెలుసన్నారు. వెన్నుపోటు ఎవరి మార్క్ రాజకీయం? శవాల ముందు పొత్తుల చర్చలు ఎవరి మార్క్ రాజకీయం? ప్రచారం కోసం పుష్కరాల్లో, పదవి కోసం సభల్లో జనాలను తొక్కించి చంపడం ఎవరి మార్క్ రాజకీయం అంటూ ట్వీట్టర్ వేదికగా ప్రశ్నల వర్షం కురిపించారు కొడాలి నాని. 

చంద్రబాబు రక్త చరిత్రకు సాక్షాలు 

అధికార దాహంతో ప్రాణాలు తీయడం చంద్రబాబుకు మొదటి నుంచి అలవాటని మాజీ మంత్రి, ఎమ్మెల్యే మేకతోటి సుచరిత ట్విట్టర్లో ఫైరయ్యారు.  నాడు ఎన్టీఆర్ నుంచి నేడు గుంటూరు సభలో మహిళల దాకా చంద్రబాబు రక్త చరిత్రకు సాక్షాలుగా నిలిచారన్నారు. పదవి కోసం సొంత మామకే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు, ఓట్లు వేయకపోతే ప్రజలనే బెదిరించిన వ్యక్తి, అధికారం కోసం ఎంతకైనా దిగజారతారని  చంద్రబాబుపై  ఎమ్మెల్యేలు పాముల పుష్ప శ్రీవాణి, బాలినేని శ్రీనివాస రెడ్డి ట్వీట్ చేశారు. జరిగిన తప్పుకు పశ్చాత్తాప పడకుండా ఆ తప్పులను వైఎస్ఆర్సీపీపై నెట్టేందుకు ప్రయత్నించడం సిగ్గుచేటని మండిపడ్డారు. 

చంద్రబాబు అరెస్టు చేయాలి- జోగి రమేష్ 

మొన్న కందుకూరులో 8 మందిని... నిన్న గుంటూరులో ముగ్గురి మృతికి కారణమైన చంద్రబాబును వెంటనే అరెస్ట్ చేయాలని మంత్రి జోగి రమేష్ డీజీపీకి ట్విట్టర్లో విజ్ఞప్తి చేశారు. 11 మందిని పొట్టన పెట్టుకున్న చంద్రబాబు సభలకు పర్మిషన్ ఇవ్వొద్దని కోరారు. అధికారదాహంతో చంద్రబాబు పేదప్రజలను చంపుతున్నారని మంత్రి ట్వీట్ చేశారు. పసుపు కుంకుమ అని.. చీరలు, కానుకలని మహిళలను వంచించి వారి ప్రాణాలను తీసిన వ్యక్తి చంద్రబాబు అంటూ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఘాటుగా స్పందించారు.  చంద్రబాబు పాపాల చిట్టాలో ఇంకెన్ని బాకీ ఉన్నాయో? వాటిని లెక్క కట్టి తగిన శిక్ష వేసేది మాత్రం వైసీపీనే అని ట్వీట్ చేశారు. జగన్ మోహన్ రెడ్డి రాజకీయం అంటే ధైర్యంగా ప్రజా క్షేత్రంలో పోరాడటమని.. చంద్రబాబు రాజకీయం అంటే వెన్నుపోట్లు, ఓటుకు నోట్లు, పొత్తులు, హత్యారాజకీయాలని ఎమ్మెల్యె చింతల రామచంద్రారెడ్డి ట్విట్టర్లో కౌంటర్ వేశారు. 

టీడీపీ కౌంటర్ 

అయితే మంత్రుల ట్వీట్లపై టీడీపీ నేతలు కూడా కౌంటర్ ఇస్తున్నారు.  తెలుగుదేశం పార్టీ మాత్రం వరుసగా జరుగుతున్న తొక్కిసలాట ఘటన వెనుక కుట్ర కోణం ఉందని సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తోంది. ఈ అంశంపై తెలుగుదేశం పార్టీ నేతలు ప్రభుత్వం తీరుపైనే విమర్శలు చేస్తున్నారు. గుంటూరు దుర్ఘటన జరిగిన 5 నిమిషాల్లో మంత్రులు అంతా కట్టగట్టుకొని మాట్లాడడం, సిద్ధంగా కూర్చొని ఉన్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ లు చేస్తూ ట్రెండ్ చేయడం చూస్తుంటే కచ్చితంగా పక్కా ఫ్లాన్ ప్రకారం అని అర్థమవుతుందని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. 

Published at : 02 Jan 2023 07:56 PM (IST) Tags: Twitter AP Ministers Chandrababu ysrcp Guntur Stampede TDP vs Ysrcp

సంబంధిత కథనాలు

CM Jagan Delhi Tour : రేపు దిల్లీకి సీఎం జగన్, ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కు హాజరు

CM Jagan Delhi Tour : రేపు దిల్లీకి సీఎం జగన్, ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కు హాజరు

Pattipati Pullarao : టీడీపీ సీఎం అభ్యర్థి చంద్రబాబే, వైసీపీలోనే ఆ కన్ఫ్యూజన్ - పత్తిపాటి పుల్లారావు

Pattipati Pullarao : టీడీపీ సీఎం అభ్యర్థి చంద్రబాబే, వైసీపీలోనే ఆ కన్ఫ్యూజన్ - పత్తిపాటి పుల్లారావు

Nellore Rural MLA: నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు ! వైసీపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు

Nellore Rural MLA: నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు ! వైసీపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు

Ramana Dikshitulu : ఏపీలో ఆలయాల పరిస్థితి దయనీయం, రమణ దీక్షితులు సంచలన వ్యాఖ్యలు

Ramana Dikshitulu : ఏపీలో ఆలయాల పరిస్థితి దయనీయం, రమణ దీక్షితులు సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh Yatra: శాంతిపురం సండే మార్కెట్‌లో లోకేష్ పర్యటన, దివ్యాంగుడికి సాయం చేస్తానని యువనేత హామీ

Nara Lokesh Yatra: శాంతిపురం సండే మార్కెట్‌లో లోకేష్ పర్యటన, దివ్యాంగుడికి సాయం చేస్తానని యువనేత హామీ

టాప్ స్టోరీస్

మొన్న బాలకృష్ణ, నేడు చిరంజీవి - వివాదాలకు కేరాఫ్ గా సక్సెస్ మీట్లు? ఇంతకీ ఏమైంది?

మొన్న బాలకృష్ణ, నేడు చిరంజీవి - వివాదాలకు కేరాఫ్ గా సక్సెస్ మీట్లు? ఇంతకీ ఏమైంది?

Nara Lokesh Yatra: తాళిబొట్లు తాకట్టు పెట్టించిన వ్యక్తి సీఎం, ఎంత మోసగాడో అర్థం చేసుకోండి - లోకేశ్ వ్యాఖ్యలు

Nara Lokesh Yatra: తాళిబొట్లు తాకట్టు పెట్టించిన వ్యక్తి సీఎం, ఎంత మోసగాడో అర్థం చేసుకోండి - లోకేశ్ వ్యాఖ్యలు

Jangaon News: రసవత్తరంగా జనగామ రాజకీయాలు - అజ్ఞాతంలోకి 11 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు

Jangaon News: రసవత్తరంగా జనగామ రాజకీయాలు - అజ్ఞాతంలోకి 11 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు

Pranitha Subhash: పాలరాతి శిల్పంలా మెరిసిపోతున్న ప్రణీత

Pranitha Subhash: పాలరాతి శిల్పంలా మెరిసిపోతున్న ప్రణీత