X

Macharla: టీడీపీ నేత చంద్రయ్య అంతిమయాత్రలో పాడె మోసిన చంద్రబాబు... అధికారం, పదవులు శాశ్వతం కాదని చంద్రబాబు ఆగ్రహం

గుండ్లపాడులో హత్యకు గురైన టీడీపీ నేత చంద్రయ్య అంతియాత్రలో చంద్రబాబు పాల్గొన్నారు. అధికారం, పదవులు ఎవరికీ శాశ్వతం కాదని సీఎం జగన్ ఇది గుర్తుపెట్టుకోవాలని చంద్రబాబు అన్నారు.

FOLLOW US: 

గుంటూరు జిల్లా గుండ్లపాడులో హత్యకు గురైన టీడీపీ నేత తోట చంద్రయ్య అంతిమ యాత్రలో ఆ పార్టీ అధినేత చంద్రబాబు పాల్గొ్న్నారు. చంద్రయ్య అంతిమ యాత్రలో చంద్రబాబు పాడె మోశారు. చంద్రయ్య కుటుంబ సభ్యులను ఓదార్చారు. 

Also Read: మాచర్లలో ఫ్యాక్షన్ రాజకీయాలు.. టీడీపీ నేత హత్య, గ్రామ నడిబొడ్డులోనే దారుణంగా..

ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణకు తనను ఆహ్వానించాలని చంద్రయ్య అనుకున్నారని చంద్రబాబు అన్నారు. కానీ దురదృష్టవశాత్తు చంద్రయ్య అంతిమయాత్రలో పాల్గొనాల్సి వచ్చిందన్నారు. ధైర్యం ఉంటే సీఎం జగన్ ఈ హత్యకు సమాధానం చెప్పాలన్నారు. మాచర్ల పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జాగీరు కాదన్న ఆయన... బోండా ఉమా, బుద్దా వెంకన్నపై దాడి చేసిన విషయాన్ని గుర్తుచేశారు. టీడీపీ నేతలపై దాడిచేసిన వారిని మునిసిపల్ ఛైర్మన్ చేశారని ఆక్షేపించారు. బ్రహ్మారెడ్డి టీడీపీ ఇంచార్జ్ గా రాగానే పిన్నెల్లి కాళ్ల కింద కదులుతుందన్నారు. ఈ హత్యా కాండకు సీఎం జగన్, డీజీపీ సమాధానం చెప్పాలని చంద్రబాబు నిలదీశారు. చంద్రయ్య కుటుంబానికి అండగా ఉంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు. 33 మంది టీడీపీ కార్యకర్తలను వైసీపీ పొట్టన పెట్టుకుందని చంద్రబాబు ఆరోపించారు. శిక్ష పడేవరకు ఎవరిని వదలన్నారు. 

Also Read: ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య... మృతదేహాన్ని కాలువలో పడేసి డ్రామా

'మాచర్ల ప్రజలు పిన్నెల్లికి ఊడిగం చెయ్యాలా?. వైసీపీ నేతలు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలి. పల్నాడు టైగర్ కోడెల వైసీపీ వేధింపుల వల్ల ఆత్మహత్య చేసుకున్నారు. జగన్ సీఎం ఐతే అందరిని చంపమని లైసెన్స్ ఇచ్చినట్లు కాదు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో అసలు పోటీ ఉండకూడదనేది వైసీపీ ప్రణాళిక. చంద్రయ్య కుటుంబానికి పార్టీ నుంచి 25 లక్షల ఆర్ధిక సాయం అందిస్తాం. రెండేళ్లలో వచ్చేది టీడీపీనే. అప్పుడు పిన్నెల్లి ఇక్కడ ఉండడా?. అందరికి ఒక మెసేజ్ ఇస్తున్నా అని చెప్పి పిన్నెల్లి ఈ హత్య చేయించారు. నేను జగన్ కు ఒక మెసేజ్ ఇస్తున్నా...జగన్ తీరు మార్చుకోవాలి. లేకపోతే ఉపేక్షించం. పోరాడే వాళ్లని హత్యా రాజకీయాలతో బయపెడతారా?' అని చంద్రబాబు ప్రశ్నించారు. 

Also Read: Hyderabad Crime: నకిలీ కాల్ సెంటర్ తో రూ.50 కోట్ల మోసం... క్రెడిట్ కార్డులు క్లోనింగ్ చేస్తున్న ముఠా గుట్టురట్టుొ

Also Read: UP Polls 2022: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు.. 29 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించిన ఎస్పీ-ఆర్‌ఎల్‌డీ కూటమి 

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: AP News Chandrababu Guntur news tdp leader murder macharla news

సంబంధిత కథనాలు

AP PRC Issue: ఏపీ ఉద్యోగులకు జగన్ సర్కార్ బిగ్ షాక్! డిమాండ్లు పట్టించుకోకుండానే వరుస జీవోలు

AP PRC Issue: ఏపీ ఉద్యోగులకు జగన్ సర్కార్ బిగ్ షాక్! డిమాండ్లు పట్టించుకోకుండానే వరుస జీవోలు

Breaking News Live: కిటకిటలాడుతున్న వేములవాడ రాజన్న క్షేత్రం

Breaking News Live: కిటకిటలాడుతున్న వేములవాడ రాజన్న క్షేత్రం

Chandrababu Naidu Corona Positive: చంద్రబాబుకు కరోనా పాజిటివ్.. ఇంట్లోనే క్వారంటైన్‌లోకి..

Chandrababu Naidu Corona Positive: చంద్రబాబుకు కరోనా పాజిటివ్.. ఇంట్లోనే క్వారంటైన్‌లోకి..

Petrol-Diesel Price, 18 January: నేడు చాలా చోట్ల నిలకడగా పెట్రోల్, డీజిల్ ధరలు.. ఇక్కడ ఇంకా స్థిరంగానే.. తాజా రేట్లు ఇలా..

Petrol-Diesel Price, 18 January: నేడు చాలా చోట్ల నిలకడగా పెట్రోల్, డీజిల్ ధరలు.. ఇక్కడ ఇంకా స్థిరంగానే.. తాజా రేట్లు ఇలా..

Weather Updates: రెయిన్ అలర్ట్.. ఏపీ, తెలంగాణలో నేడు ఓ మోస్తరు వర్షాలు.. పెరుగుతున్న చలి తీవ్రత

Weather Updates: రెయిన్ అలర్ట్.. ఏపీ, తెలంగాణలో నేడు ఓ మోస్తరు వర్షాలు.. పెరుగుతున్న చలి తీవ్రత
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Shobha Shetty: మోడ్ర‌న్‌గా 'కార్తీక‌దీపం' మోనిత‌... డెనిమ్ స్క‌ర్ట్, టీ-ష‌ర్ట్‌లో!

Shobha Shetty: మోడ్ర‌న్‌గా 'కార్తీక‌దీపం' మోనిత‌... డెనిమ్ స్క‌ర్ట్, టీ-ష‌ర్ట్‌లో!

Karimnagar: కరోనా విజృంభణ.. ప్రతి నలుగురిలో ఒకరికి కరోనా

Karimnagar: కరోనా విజృంభణ.. ప్రతి నలుగురిలో ఒకరికి కరోనా

Anand Mahindra Thanks KTR: నా చిరకాల స్వప్నం నేరవేరింది.. థ్యాంక్యూ కేటీఆర్.. హుందాగా స్పందించిన ఐటీ మంత్రి

Anand Mahindra Thanks KTR: నా చిరకాల స్వప్నం నేరవేరింది.. థ్యాంక్యూ కేటీఆర్.. హుందాగా స్పందించిన ఐటీ మంత్రి

Siri Hanmanth Covid: 'బిగ్ బాస్' బ్యూటీ సిరి హనుమంతుకు కరోనా

Siri Hanmanth Covid: 'బిగ్ బాస్' బ్యూటీ సిరి హనుమంతుకు కరోనా