అన్వేషించండి

Gudivada Amarnath Controversy: హోంమంత్రి అనితపై గుడివాడ అమర్నాథ్ వివాదాస్పద వ్యాఖ్యలు - పవన్ కల్యాణ్ ఫైర్.. మహిళా కమిషన్ నోటీసులు!

Gudivada Amarnath: ఏపీ హోంమంత్రి అనితపై గుడివాడ అమర్నాథ్ మేకప్, వదిలేసిన కార్లు అంటూ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. దుస్తులు, రూపంపై వ్యాఖ్యలు అవమానకరమంటూ పవన్ కల్యాణ్ తీవ్రంగా ఖండించారు.

TDP Women Leaders Protest:  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మహిళా నేతలను, ముఖ్యంగా అత్యున్నత హోదాలో ఉన్న హోంమంత్రిని లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న వ్యక్తిగత విమర్శలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ  నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్.. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనితను ఉద్దేశించి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ వ్యవహారంపై అధికార కూటమి శ్రేణులు, మహిళా సంఘాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. 

గుడివాడ అమర్నాథ్ ఏమన్నారు? 

విశాఖ జిల్లా చోడవరంలో జరిగిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తల నిరసన సమావేశంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్  ప్రసంగించారు. హోంమంత్రి వంగలపూడి అనితపై తీవ్రమైన వ్యక్తిగత వ్యాఖ్యలు చేశారు. శాంతిభద్రతలను పక్కనబెట్టి హోంమంత్రి కేవలం తన  మేకప్ , కట్టుబొట్టుపైనే శ్రద్ధ పెడుతున్నారంటూ చౌకబారుగా విమర్శించారు. అంతేకాకుండా, నేను మంత్రిగా ఉన్నప్పుడు వాడి వదిలేసిన బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ఇప్పుడు ఆమె వాడుకుంటున్నారు  అంటూ ఎద్దేవా చేశారు. ఒక మహిళా మంత్రి రూపం, అలంకరణను లోకువ చేస్తూ మాజీ మంత్రి స్థాయి వ్యక్తి ఇలా మాట్లాడటం రాజకీయ వర్గాలను విస్మయానికి గురిచేసింది.   

 దుస్తులు, రూపంపై వ్యాఖ్యలు అవమానకరం:   పవన్ కల్యాణ్ 

గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా స్పందించారు. రాజకీయ విమర్శలు ఎప్పుడూ ప్రభుత్వ విధానాలు, పరిపాలనపైనే ఉండాలి తప్ప.. ఒక మహిళ దుస్తులు, రూపురేఖలను లక్ష్యంగా చేసుకోకూడదు  అని పవన్ స్పష్టం చేశారు. ఇలాంటి చౌకబారు భాష ఏమాత్రం క్షమార్హం కాదని, మహిళలను కించపరిచేలా మాట్లాడటం రాజకీయ సంస్కృతికే విరుద్ధమన్నారు. అలాగే ప్రతిపక్షాల అసభ్య భాషకు కూటమి నేతలు కూడా అదే స్థాయిలో దిగజారకుండా సంయమనంతో, ప్రజలు మెచ్చే రీతిలో బుద్ధి చెప్పాలని హితవు పలికారు.

తిరగబడ్డ తెలుగు మహిళలు 

మరోవైపు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సహా పలువురు నేతలు అమర్నాథ్ తీరును తీవ్రంగా ఖండించారు. ఒక దళిత మహిళ స్వశక్తితో, కిందిస్థాయి నుంచి ఎదిగి హోంమంత్రి అయితే ఓర్వలేకనే ఇలాంటి దాడులకు దిగుతున్నారని మండిపడ్డారు. మచిలీపట్నం, తిరుపతి, విశాఖపట్నం సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తెలుగు మహిళా విభాగం నేతలు రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపట్టారు. అమర్నాథ్ ఫొటోలను కోడిగుడ్లు, చెప్పులతో కొట్టి తమ నిరసన వ్యక్తం చేశారు. గతంలో అసెంబ్లీ సాక్షిగా నారా భువనేశ్వరిని కించపరిచినందుకే వైసీపీని ప్రజలు 11 సీట్లకు పరిమితం చేశారని, అయినా ఆ పార్టీ నేతలకు బుద్ధి రాలేదని మహిళా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.  

 రంగంలోకి మహిళా కమిషన్.. సమన్లు జారీ! 

ఈ వివాదాన్ని రాష్ట్ర మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది. ఒక మహిళా ప్రజాప్రతినిధి, పైగా రాష్ట్ర శాంతిభద్రతలను పర్యవేక్షించే హోంమంత్రి వ్యక్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడటంపై మహిళా కమిషన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌కు త్వరలోనే సమన్లు జారీ చేసి, కమిషన్ ముందు హాజరై తన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఆదేశించేందుకు సిద్ధమైంది. చట్టపరంగా కూడా ఆయనపై చర్యలు తీసుకునేలా సిఫార్సు చేయనున్నట్లు తెలుస్తోంది.
 
ఏపీ రాజకీయాల్లో గత కొన్నేళ్లుగా వ్యక్తిగత దూషణలు మితిమీరిపోతున్నాయనే విమర్శలు ఉన్నాయి. ఒక మహిళా హోంమంత్రి వ్యక్తిగత ప్రాధాన్యతలను, రూపకల్పనను విమర్శల పరిధిలోకి తీసుకురావడం ద్వారా గుడివాడ అమర్నాథ్ స్వయంగా డిఫెన్స్‌లో పడ్డారు. కూటమి ప్రభుత్వం ఈ అంశాన్ని మహిళల ఆత్మగౌరవ సెంటిమెంట్‌గా మార్చి వైఎస్సార్‌సీపీని మరింత ఇరుకున పెట్టే వ్యూహంలో ఉంది. అమర్నాథ్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని వస్తున్న డిమాండ్లపై ఆయన తదుపరి అడుగు ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.


 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
BC Reservations: బీసీల కోసం కేబినెట్ 3 చారిత్రాత్మక నిర్ణయాలు.. రేపు వైసీపీ కేసులు వేస్తుంది: సీఎం చంద్రబాబు
బీసీల కోసం కేబినెట్ 3 చారిత్రాత్మక నిర్ణయాలు.. రేపు వైసీపీ కేసులు వేస్తుంది: సీఎం చంద్రబాబు
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అలక! కీలక సమావేశాలకు డుమ్మా! బుజ్జగిస్తున్న చంద్రబాబు!
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అలక! కీలక సమావేశాలకు డుమ్మా! బుజ్జగిస్తున్న చంద్రబాబు!
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget